ETV Bharat / bharat

విదేశాల​ నుంచి రాగానే వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

author img

By

Published : Oct 31, 2021, 2:49 PM IST

Updated : Oct 31, 2021, 2:56 PM IST

జీ-20, కాప్​26 సదస్సులు ముగించుకొని భారత్​ వచ్చిన వెంటనే.. ప్రధాని నరేంద్ర మోదీ(Modi news today) వ్యాక్సినేషన్​పై సమీక్ష నిర్వహించనున్నారు. టీకా పంపిణీ(Vaccination in India) తక్కువగా జరిగిన జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నవంబర్​ 3న మోదీ మాట్లాడతారు.

PM Modi to review COVID-19 vaccination in districts with low coverage on Nov 3
వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

జీ-20, ఐరాస వాతావరణ సదస్సు(కాప్​26) సదస్సుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్​కు తిరిగొచ్చిన వెంటనే దేశంలో వ్యాక్సినేషన్​పై(Vaccination in India) సమీక్ష నిర్వహించనున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టీకా మొదటి డోసు పంపిణీ 50 శాతం కంటే తక్కువ, రెండో డోసులో చాలా వెనుకంజలో ఉన్న ఆయా జిల్లాల్లో వ్యాక్సినేషన్​పై(Vaccination in India) వీడియో కాన్భరెన్స్​ ద్వారా సమీక్షించనున్నారు.

నవంబర్​ 3న మధ్యాహ్నం 12 గంటలకు ఝార్ఖండ్​, మణిపుర్​, నాగాలాండ్​, అరుణాచల్​ ప్రదేశ్​, మహారాష్ట్ర, మేఘాలయ సహా ఇతర రాష్ట్రాల్లోని దాదాపు 40 జిల్లాల కలెక్టర్లతో మోదీ(Modi news today) మాట్లాడతారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

భారత్​లో ఇప్పటివరకు అర్హత కలిగిన లబ్ధిదారులకు.. 106.14 కోట్ల డోసుల టీకా పంపిణీ (Coronavirus vaccination) చేపట్టింది కేంద్రం. దేశంలో ఇంకా.. చిన్నపిల్లలు, టీనేజీ వారికి టీకా అందుబాటులోకి రాలేదు.

ఇవీ చూడండి: Cop26 Glasgow: వాతావరణ మార్పులపై 'కాప్'​ అస్త్రం ఫలిస్తుందా?

'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతోంది'

Last Updated :Oct 31, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.