ETV Bharat / state

Heart Surgery Types: పెరుగుతున్న గుండెకోత.. రాజధానిలోనే ఏటా 15 వేల శస్త్రచికిత్సలు!

author img

By

Published : Oct 31, 2021, 6:58 AM IST

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు(Heart Surgery Types) వస్తున్నాయి. కేవలం 30-40 ఏళ్లకే హృదోగ ముప్పు పెరగడం ఆందోళన కలిగించే అంశమే. అయితే ఏటా ఒక్క హైదరాబాద్​లో 15వేల గుండె శస్త్ర చికిత్సలు జరుగుతుండడం గమనార్హం. ఇందులో 8-10 వేల వరకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలేనని(Heart Surgery Types) వైద్యులు చెబుతున్నారు.

heart surgery types, heart surgeries in hyderabad
హైదరాబాద్​లో హార్ట్ సర్జరీలు, హైదరాబాద్​లో గుండె జబ్బులు

వయసుతో సంబంధం లేకుండా ఏటా హృద్రోగ ముప్పు పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. 30-40 ఏళ్లకే గుండె జబ్బులబారిన(Heart Surgery Types) పడుతున్నారు. అకస్మాత్తుగా గుండె వైఫల్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ పిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఇలాగే మరికొందరు ఆటలాడుతూ.. వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయిన సందర్భాలున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా 15 వేల వరకు గుండె శస్త్రచికిత్సలు(Heart Surgery Types) జరుగుతున్నాయి. ఇందులో 8-10 వేల వరకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలేనని వైద్యులు చెబుతున్నారు. నిమ్స్‌లో ఏటా వెయ్యి వరకు బైపాస్‌ సర్జరీలు చేస్తున్నారు. స్టెంట్లు, ఇతర చికిత్సలు కలిపి మరో 1000-2000 వరకు ఉంటున్నాయి. ఇందులో 30-40 శాతం మంది 40-50 ఏళ్ల వారేనని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల వారు ఉంటున్నారు.

ముఖ్యంగా 30-40 ఏళ్ల వయసు నుంచే గుండె సమస్యలు(Heart Surgery Types) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యక్తిగత ఒత్తిడి, మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను(Heart Surgery Types) నివారించవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. పక్షవాతం, గుండె జబ్బులకు అధిక రక్తపోటు (high bp symptoms) కారణం. బయటకు ఎలాంటి హెచ్చరికలు, లక్షణాలు, సంకేతాలు కనిపించవు. లోలోపల అది తీవ్ర నష్టం చేస్తుంది. బీపీ 140/80కి దిగువన ఉండేలా చూసుకోవాలి. మధుమేహం ఉన్నవారిలో 60 శాతం మరణాలకు గుండెపోటు, పక్షవాతాలే కారణం. రక్తంలో గ్లూకోజు పరగడుపున 100 లోపు, ఆహారం తిన్న రెండు గంటల తరువాత 140 లోపల ఉండాలి. ఆహారంలో పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం.. అధిక నూనెలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం.. పొగ తాగడం మానుకోవడం చాలా అవసరం. ఊబకాయం నియంత్రణలో ఉండాలి.

30 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు తప్పనిసరి

.

30 ఏళ్లు దాటాక ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకోసారి రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అధిక బరువు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడిని నియంత్రణలో పెట్టుకోవాలి. పౌష్టికాహారం, ఒత్తిడి లేని జీవితం, సుఖ నిద్ర, రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయాలి. నిమ్స్‌లో నెలకు 80 గుండె శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. సగం బైపాస్‌లే. మరో 20-30 వరకు వాల్వుల మార్పిళ్లు. 40-50 ఏళ్ల వయసు వారు 30-40 శాతం, 60 ఏళ్ల వారు 30-40 శాతం, మిగతావారు 30 శాతం వరకు ఉంటున్నారు. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్య ఉంటే జాగ్రత్త పడాలి. గుండె రక్తనాళాల్లో కాల్షియం ఎంత ఉందనేది తెలుసుకోవాలి.

- డా.ఆర్వీకుమార్‌, గుండెమార్పిడి నిపుణులు, నిమ్స్‌

గుండె సంకేతాలను అశ్రద్ధ చేయొద్దు

గుండె తన స్థితి గురించి కొన్ని సంకేతాలిస్తుంది. చాలామందిలో గుండె నొప్పి, ఆయాసం లాంటివి వస్తున్నా అలసట, గ్యాస్ట్రిక్‌ సమస్యగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అప్పటికే రక్తపోటు, మధుమేహం లాంటి ఇబ్బందులుంటే అప్రమత్తం కావాలి. అధిక స్థాయిలో వ్యాయామం చేసినప్పుడు, డ్రగ్స్‌ ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో రకరకాల హార్మోన్లు (క్యాథకోలమైన్స్‌) వెలువడుతుంటాయి. వీటివల్ల ఆరోగ్యవంతులకు కూడా గుండె లయతప్పి ప్రాణాపాయం సంభవిస్తుంది. కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల సమస్య తలెత్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. కొవిడ్‌ తర్వాత గుండె సమస్యలు పెరిగాయి. అప్రమత్తత అవసరం.

- డా.పి.ప్రణీత్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్టు, కేర్‌ ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.