ETV Bharat / sports

T2 world cup 2021: నమీబియాపై అఫ్గానిస్థాన్​​ ఘన విజయం

author img

By

Published : Oct 31, 2021, 7:08 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) జరిగిన మ్యాచ్​లో నమీబియాపై విజయం సాధించింది అఫ్గానిస్థాన్. 62 పరుగుల తేడాతో గెలుపొందింది. నమీబియా బౌలర్లలో నవీన్​ ఉల్​ హక్​ 3, హమీద్​ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నారు.

afghanisthan
అఫ్గానిస్థాన్​

టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అఫ్గాన్‌ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్‌ వైస్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్‌ బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌, హమీద్‌ హసన్‌ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, గుల్బాదీన్‌ నైబ్‌ రెండు, రషీద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

తొలుత టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (33), మహమ్మద్‌ షంజాద్‌ (45) తొలి వికెట్‌కు అర్ధశతకం(53) భాగస్వామ్యం నిర్మించారు. పవర్‌ప్లేలో ధాటిగా ఆడిన అఫ్గాన్‌ను నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లతోపాటు రహమాన్‌తుల్లా (4), జాద్రాన్‌ (7)ను ఔట్‌ చేసి కాస్త పట్టు సాధించారు. అయితే అస్గర్ అఫ్గాన్‌ (31), కెప్టెన్ మహమ్మద్‌ నబీ (32*) ఆఖర్లో దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంపుల్మన్‌ 2, జాన్‌ నికోల్ 2.. స్మిత్ ఒక వికెట్‌ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.