ETV Bharat / international

'2022 చివరి నాటికి భారత్​లో 500 కోట్ల టీకా డోసుల ఉత్పత్తి'

author img

By

Published : Oct 30, 2021, 10:54 PM IST

వచ్చే ఏడాది చివరి నాటికి 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్​ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. తద్వారా కరోనాపై పోరులో ప్రపంచానికి మరింత బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన జీ-20 సదస్సులో(G20 Summit 2021) మాట్లాడారు. అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాల పరస్పర గుర్తింపు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

modi g20 summit
మోదీ జీ20 సదస్సు

2022 చివరి నాటికి భారత్​ 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేసి, కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ-20 సదస్సులో(G20 Summit 2021) మాట్లాడిన ఆయన కరోనాపై పోరులో భారత్ భాగస్వామ్యాన్ని ప్రధానంగా వివరించారు. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా వెల్లడించారు.

"అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాలను పరస్పరం గుర్తించుకోవడం వంటి అంశాలను జీ-20 సదస్సులో మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. భారత్​ స్వదేశీ టీకా కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలపాల్సి ఉన్న విషయాన్ని కూడా పేర్కొన్నారు. ఈ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం లభిస్తే ఇతర దేశాలకు భారత్ మరింత సాయపడగలదని వివరించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో 150 దేశాలకు భారత్​ ఔషధాలను సరఫరా చేసిందని గుర్తు చేశారు.

-హర్షవర్ధన్ శ్రింగ్లా, భారత విదేశాంగ కార్యదర్శి

జీ-20 సదస్సులో(G20 Summit 2021) 'ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సెషన్'​లో భాగంగా మోదీ ఈ మేరకు మాట్లాడారని శ్రింగ్లా తెలిపారు. సుస్థిర ప్రపంచ సరఫరా గొలుసుల ఆవశ్యకతను వివరించారని.. భారత్​ సాహసోపేత ఆర్థిక సంస్కరణల గురించి వివరించారని చెప్పారు. ఆర్థిక పునరుద్ధరణ, సరఫరా గొలుసు వైవిధ్యీకరణలో భారత్​ను తమ భాగస్వామిగా మార్చుకోవాలని జీ20 దేశాలను మోదీ ఆహ్వానించారని వెల్లడించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.