ETV Bharat / sports

T20 World Cup: అలా జరిగితేనే సెమీస్​కు టీమ్​ఇండియా!

author img

By

Published : Oct 31, 2021, 11:02 AM IST

Updated : Oct 31, 2021, 11:50 AM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) ఇప్పటికే మూడు విజయాలు సాధించిన పాకిస్థాన్​.. సెమీస్​ చేరడం దాదాపు ఖాయమైంది. ఇక మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం ప్రధానంగా టీమ్​ఇండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. భారత్​ సెమీస్​ (T20 World Cup Semi Final) చేరాలంటే ఇంతకీ ఏం చేయాలంటే?

T20 World Cup
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) అఫ్గానిస్థాన్​పై విజయంతో గ్రూప్​ 2 టేబుల్​ టాపర్​గా ఉన్న పాకిస్థాన్ (Pakistan Cricket News) దాదాపు​ సెమీస్​కు చేరినట్లే. ఇప్పటికే టీమ్​ఇండియా, న్యూజిలాండ్​పై గెలిచిన ఆ జట్టు ఇక పోటీపడాల్సింది చిన్న దేశాలైన స్కాట్​లాండ్, నమీబియా పైనే. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క సెమీస్​ (T20 World Cup Semi Final) బెర్తు కోసం ఈ రెండు జట్లకు అవకాశం లేదని భావించినా.. పోటీ ప్రధానంగా టీమ్ఇండియా, న్యూజిలాండ్​, అఫ్గానిస్థాన్ మధ్య ఉంది.

ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకు భారత్, కివీస్​, అఫ్గాన్​ ఒక దానితో మరొకటి పోటీ పడలేదు. ఆదివారం, న్యూజిలాండ్​తో టీమ్​ఇండియా (Ind Vs Nz) తలపడనుంది. అఫ్గానిస్థాన్​తో (Ind Vs Afg T20) నవంబర్​ 3న కోహ్లీసేన పోటీపడనుంది. నవంబర్​ 7న కివీస్​, అఫ్గాన్ (Nz Vs Afg)​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ మూడింటి ఫలితాలు తేలితే సెమీస్​ చేరే జట్లపై స్పష్టత వస్తుంది.

గట్టి పోటీనే..

ఈ మూడు జట్ల పోరులో రెండు మ్యాచ్​లు గెలిచే జట్టు సెమీస్​ రేసులో ముందంజ వేస్తుంది. అలా కాకుండా ఒకదానిపై గెలిచి మరో జట్టు చేతిలో ఓడితే.. ముడూ ఒక్కొక్కటి గెలిచినట్టు అవుతుంది. అప్పుడు నెట్​రన్​రేట్​పై ఆధారపడాల్సి వస్తుంది. సెమీస్​కు ప్రధానంగా న్యూజిలాండ్​, టీమ్​ఇండియా ఫేవరెట్​గా కనిపిస్తున్నా.. ​టాప్​2లో నిలిచేందుకు తామెంతో పట్టుదలగా ఉన్నామని గట్టి ప్రదర్శనతో అఫ్గాన్ ఇప్పటికే చాటిచెప్పింది.

ఇదీ చూడండి: IND vs NZ T20: 'టీమ్​ఇండియాను ఆ వ్యూహంతో కట్టడి చేస్తా'

Last Updated :Oct 31, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.