ETV Bharat / sitara

హైదరాబాద్​లో శంకర్​-చెర్రీ సినిమా రెండో షెడ్యూల్​!

author img

By

Published : Oct 31, 2021, 8:05 PM IST

హీరో రామ్​చరణ్​-దర్శకుడు శంకర్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా తొలి షెడ్యూల్​ చిత్రీకరణ నవంబరు 2న పూర్తికానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండో షెడ్యూల్​ను హైదరాబాద్​లో చిత్రీకరించనున్నారట.

shankar
శంకర్​ చెర్రీ సినిమా

మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​, దర్శకుడు శంకర్(shankar ram charan film)​ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్​ వేగంగా జరుపుకుంటోంది. ఈ నెల 22న పుణెలో తొలి షెడ్యూల్​ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రస్తుం చెర్రీ, కియారాపై(ramcharan kiara movie) ఓ సాంగ్​తో పాటు కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్​ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్​ నవంబరు 2న పూర్తి అవుతుందని తెలిసింది. ఆ తర్వాత కాస్త విరామం తీసుకుని రెండో షెడ్యూల్​ను హైదరాబాద్​లో చిత్రీకరిస్తారట.

kiara
కియారా

ఈ చిత్రంలో విలన్​గా మలయాళ నటుడు సురేష్​ గోపి నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీకాంత్​, సునీల్​ ముఖ్య పాత్రలు పోషిస్తున్నరు. చెర్రీ ఐఏఎస్​ ఆఫీసర్​గా నటించనున్నట్లు తెలుస్తోంది. తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, శంకర్‌, రామ్​చరణ్​కు ఇది 15వ సినిమా కావడం విశేషం. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా. పాన్ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ.170కోట్లతో నిర్మిస్తున్నారు(shankar ram charan movie budget)!

chiranjeevi
చిరంజీవి, రామ్​చరణ్​, కియారా

త్వరలోనే రామ్​చరణ్​ 'ఆర్ఆర్ఆర్'(Ramcharan RRR movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటే 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(ram charan new movie) దర్శకత్వంలోనూ నటించారు. ఇటీవలే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు.

chiranjeevi
చిరంజీవి, రామ్​చరణ్​, కియారా

ఇదీ చూడండి: సాగరకన్యలా జాక్వెలిన్​.. పూజాహెగ్డే గ్లామర్​ స్టిల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.