ETV Bharat / business

Gold rate today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

author img

By

Published : Oct 31, 2021, 10:10 AM IST

బంగారం, వెండి (Gold Rate Today) ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold price today
బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) ఆదివారం స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.49,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,100 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పుత్తడి (Gold Price in Vijayawada) ధర రూ.49,250గా ఉంది. కిలో వెండి ధర రూ.66,100 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.49,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,100 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,783 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఆగని పెట్రో బాదుడు

దేశంలో చమురు ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 36 పైసలు, డీజిల్​పై 39 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.109.34కు చేరగా.. డీజిల్​ ధర రూ.98.08కు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.113.68కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.95 కి చేరింది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు రూ.115.35కి చేరింది. డీజిల్​పై 37 పైసలు పెరిగి​ లీటర్ రూ.108.29 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.115.65 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.108.29కి చేరింది.

ఇదీ చూడండి: Bank holidays in november: నవంబర్​లో 17 రోజులు బ్యాంకు సెలవులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.