ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 24, 2021, 5:51 AM IST

Updated : Nov 24, 2021, 9:57 PM IST

etv bharat headlines
ఈటీవీ భారత్​

21:52 November 24

టాప్​న్యూస్​@ 10PM

  • ముగిసిన నామినేషన్ల పరిశీలన ఘట్టం.. 

స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో.... నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో మూడు స్థానాలు ఎకగ్రీవంకానున్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. డిసెంబరు 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

  • వరద మిగిల్చిన వేదన.. భర్త ఆచూకీ కోసం భార్య తపన

చూస్తుండగానే వరద వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కళ్ల ముందే కట్టుకున్నోడు (women search for husband dead body) కనుమరుగయ్యాడు. వరద పోయాక ఆమె తన వాళ్ల కోసం కళ్లలో వత్తులేసుకుని వెతుకుతోంది. భర్త మృతదేహం ఆ చుట్టుపక్కలే ఉందని ఆమెకు ఎవరో చెప్పారు. అంతే..కాళ్లరిగేలా వెదుకుతూనే ఉంది కానీ భర్త కానరాలేదు. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన ఆయేషా ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

  • నాలుగేళ్లు ఆస్పత్రిలోనే.. 

Amma rajasekhar in WOW Show: అనారోగ్యం వల్ల ఆస్పత్రిలోనే నాలుగేళ్ల పాటు ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో తన తల్లి అండగా నిలిచిందని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మరాజశేఖర్​. ఇంకా తన కెరీర్​ గురించి పలు విషయాలను తెలిపారు.

  • జాలరిని లక్షాధికారిని చేసిన అరుదైన చేప

కర్ణాటక జాలరికి అరుదైన 'ఘోల్ ఫిష్​' వలలో చిక్కింది. మాల్పే ఓడరేవులో దీని ధర రూ.1.8 లక్షలు పలికింది.

  • 'ఈ జెర్సీ ధరిస్తే ప్రపంచకప్ మనదే'.. 

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్ విజేతగా నిలవాలంటే పసుపు రంగు జెర్సీ ధరించాలంటూ ఫన్నీ మీమ్​ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. అసలు ఈ ఎల్లో జెర్సీ కథేంటంటే?

20:44 November 24

టాప్​న్యూస్​@ 9PM

  • 'కేటీఆర్​ ఘాటు వ్యాఖ్యలు'

జీహెచ్​ఎంసీ కార్యాలయంపై భాజపా కార్పొరేటర్ల దాడిపై( BJP Corporators Attack) మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి చర్యలు సరికావన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీని కేటీఆర్‌ కోరారు.

  • వడ్లు కొనమని అధికారి కాళ్లు మొక్కిన రైతన్న

రాష్ట్రంలో అన్నదాతల కష్టాలు తీరడం లేదు. ధాన్యం కొనుగోళ్ల జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు (paddy procurement delay). అకాల వర్షాలకు పంట తడిసిపోయి మెులకలు వస్తుండటంతో నష్టపోతున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

  • ఆప్​తో ఎస్పీ పొత్తు

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సమాజ్​వాదీ పార్టీ(Aap and sp alliance) సిద్ధమవుతోంది. బుధవారం ఆప్​ నేత సంజయ్ సింగ్​తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్​ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చలు(Akhilesh alliance) జరిపారు.

  • విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నాగశౌర్య 'లక్ష్య' రిలీజ్​ డేట్​, ధనుశ్​-అక్షయ్​ నటించిన 'అత్రాంగి రే' ట్రైలర్​, 'మంచి రోజులు వచ్చాయి' ఓటీటీ విడుదల తేదీ వివరాలు ఉన్నాయి.

  • హర్మన్​ప్రీత్ రికార్డు

ఉమెన్స్ బిగ్​బాష్ లీగ్​లో పాల్గొని ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి రికార్డు సృష్టించింది టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్మన్​ప్రీత్ కౌర్(Harmanpreet Kaur WBBL). ఈ నేపథ్యంలో మాట్లాడుతూ మహిళల ఐపీఎల్​ను పూర్తి స్థాయిలో నిర్వహించే విషయమై ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

19:52 November 24

టాప్​న్యూస్​@ 8PM

  • ఒకేసారి ఐదు టీకాలు.. మూణ్నెళ్ల చిన్నారి మృతి

టీకా వికటించి మూడు నెలల చిన్నారి మృతి(child died with vaccine) చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటుచేసుకుంది. ప్రభుత్వం చిన్న పిల్లలకు వేసే టీకాలో భాగంగా ఈరోజు సారపాక పీహెచ్​సీలో టీకాలు వేయించారు. కళ్లముందే పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • 'కత్రినా కైఫ్ బుగ్గల్లా మన రోడ్లు ఉండాలి'

రహదారులను బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బుగ్గలతో పోల్చారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

  • మోదీతో దీదీ భేటీ.. 

Mamata Banerjee Meeting With Pm: బంగాల్​లో బీఎస్​ఫ్​ ప్రాదేశిక పరిధి పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు దిల్లీలో మోదీతో భేటీ అనంతరం మమత పేర్కొన్నారు.

  • 'అంత సులభం కాదని అర్థమైంది'

హీరో రాజ్​తరుణ్​ నటించిన 'అనుభవించు రాజా'(anubhavinchu raja movie 2021) సినిమా నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను సహా కెరీర్​ గురించి పలు ఆసక్తకిర సంగతులను చెప్పారు రాజ్​. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే..

  • తండ్రైన భువనేశ్వర్​..

టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తండ్రయ్యాడు. ఇతడి సతీమణి నుపుర్ నగర్ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

18:52 November 24

టాప్​న్యూస్​@ 7PM

  • ఇల్లు కూలడానికి క్షణాల ముందే...

అర్ధరాత్రి సమయం... హోరు వర్షం.. భీకర గాలులు.. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ ఇంటి పెద్ద అప్రమత్తతతో వారంతా ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter in kashmir) భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

  • 'ఎంత కొంటారో చెప్పండి'

వరిధాన్యం కొంటారా లేదా స్పష్టత ఇవ్వాలని భాజపా నాయకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister errabelli dayakar rao) ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి మంత్రి హన్మకొండలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. 

  • స్మార్ట్​ఫోన్లతోనే.. 

స్మార్ట్​ఫోన్​లను యూనివర్సల్ ఆథెంటికేటర్‌గా(వ్యక్తిగత ధ్రువీకరణ) ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ-ఉడాయ్​) సీఈఓ సౌరభ్​ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లను ప్రామాణికత కోసం ఉపయోగించవచ్చని ఆయన వెల్లడించారు.

  • తుదిజట్టులో ఒక్కరికే అవకాశం

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​(IND vs NZ test series 2021)లో సత్తాచాటేందుకు టీమ్ఇండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సిద్ధంగా ఉన్నారని తెలిపాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. కానీ ఈ సిరీస్​లో వీరిద్దరిలో ఒకరు మాత్రమే తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

17:58 November 24

టాప్​న్యూస్​@ 6PM

  • వడ్లు కొనాలంటూ అధికారి కాళ్లు మొక్కిన రైతన్న.. 

రాష్ట్రంలో అన్నదాతల కష్టాలు తీరడం లేదు. ధాన్యం కొనుగోళ్ల జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు (paddy procurement delay). అకాల వర్షాలకు పంట తడిసిపోయి మెులకలు వస్తుండటంతో నష్టపోతున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

  • ఆన్​లైన్​లోనే సినిమా టికెట్లు..

అధిక ధరలకు సినిమా టికెట్లు అమ్మకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి పేర్ని నాని (Perni nani On Online Cinema Tickets) స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ద్వారా ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలకు మార్గం సుగమమైందన్నారు. ప్రేక్షకులను దోపిడీ నుంచి కాపాడేందుకే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.

  • న్యాయం చేయమని ట్యాగ్​ చేస్తే.. 

న్యాయం చేయండి అని ప్రముఖ సామాజిక మాధ్యమైన ట్విట్టర్​ వేదికగా పోలీసులను వేడుకుంటే.. అందుకు ప్రతిఫలంగా అతడ్ని వారు (jharkhand police) చితకబాదారు. ఝార్ఖండ్​లోని వెస్ట్​ సింఘుభూమ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

  • కైకాల ఆరోగ్యంపై చిరు ప్రత్యేక శ్రద్ధ

chiranjeevi on kaikala health condition: అస్వస్థకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కైకాల సత్యనారాయణ ఆరోగ్యం గురించి పలువురు ప్రముఖులు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, కైకాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. ఆయన కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు చిరంజీవి.
 

  • నెట్స్​లో ద్రవిడ్ బౌలింగ్.. 

భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు​(IND vs NZ first test) కాన్పుర్ వేదికగా గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్​లో మునిగిపోయాయి ఇరుజట్లు. కాగా, నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న భారత బ్యాటర్లకు తన స్పిన్ బౌలింగ్​తో సవాల్ విసిరాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

16:54 November 24

టాప్​న్యూస్​@ 5PM

  • ఎయిడ్స్ రోగులకు శుభవార్త.. 

ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో‌ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్షా(Minister Harishrao Review) సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్​లో రెండు ప్రత్యేక డయాలసిస్ కేంద్రాల(free dialysis centers in Telangana )ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

  • డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు

కర్ణాటకలో విస్తృత సోదాలు నిర్వహించిన ఏసీబీ సిబ్బంది ఓ అవినీతి అధికారి ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు గుర్తించారు. ప్లంబర్​ను పిలిపించి పైపు కత్తిరించి వాటిని వెలికి తీశారు. ఆ అధికారి ఇంట్లో 7.5కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశారు(ACB Raid in Karnataka).

  • 'ఆచార్య' అప్​డేట్​.. 

Acharyam movie teaser: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమా టీజర్​ను నవంబరు 28న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

  • శ్రేయస్ టెస్టు అరంగేట్రం

టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రానికి(Shreyas Iyer Test debut) అంతా సిద్ధమైంది. గురువారం న్యూజిలాండ్​తో ప్రారంభమయ్యే తొలి టెస్టులో శ్రేయస్​ను తుదిజట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపాడు కెప్టెన్ అజింక్యా రహానె.

  • స్టార్​హెల్త్​ ఐపీఓ 

స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ(Star health IPO) సబ్​స్క్రిప్షన్​ తేదీని ప్రకటించింది. నవంబరు 30న ప్రారంభం కానుండగా.. డిసెంబరు 2న ముగియనుంది. మరోవైపు.. తాజాగా ఏడు కంపెనీల ఐపీఓ దరఖాస్తులకు సెబీ ఆమోద ముద్ర వేసింది.

15:51 November 24

టాప్​ న్యూస్​@ 4 PM

  • 'వారు గాడ్సే అభిమానులు'

జీహెచ్​ఎంసీ కార్యాలయంపై భాజపా కార్పొరేటర్ల దాడిపై( BJP Corporators Attack) మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి చర్యలు సరికావన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీని కేటీఆర్‌ కోరారు.

  • మార్చి వరకు రేషన్​ ఫ్రీ!

"ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

  • రష్మికి బంపర్​ ఆఫర్​..

Chiranjeevi Rashmi Dance: యాంకర్​ రష్మికి ఓ బంఫర్​ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది! ఆమె మెగాస్టార్​ చిరంజీవితో కలిసి ఓ మాస్​ సాంగ్​లో స్టెప్పులేయనుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

  • కోహ్లీ టాప్-10 గల్లంతు

ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్(ICC T20 Ranking)​లో టాప్-5కి చేరుకున్నాడు టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్. రోహిత్, దీపక్, భువనేశ్వర్ కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు కోల్పోయాడు.

  • సెన్సెక్స్ 323 పాయింట్లు డౌన్

స్టాక్​ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 323 పాయింట్లకుపైగా కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 145 పాయింట్లు దిగజారింది.

14:44 November 24

టాప్​ న్యూస్​@ 3PM

  • సాగు చట్టాల రద్దు బిల్లుకు..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు భేటీ అయింది. 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • 'అమెజాన్​' ద్వారా గంజాయి స్మగ్లింగ్ 

ఏపీలోని విశాఖ కేంద్రంగా అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్(smugling marjuana thruough amazon) చేస్తున్న నలుగురు సభ్యులను మధ్యప్రదేశ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న శ్రీనివాస్​తో పాటు ఆన్​లైన్ స్టోర్​ ఉద్యోగులు కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణలను అదుపులోకి తీసుకున్నారు.

  • పెళ్లికి యువత 'నో'

వివాహాలు చేసుకోవడానికి చైనా యువత వెనకడుగు వేస్తోంది. తద్వారా ఆ దేశం జనాభా సంక్షోభంలో(China population crisis) చిక్కుకుపోతోంది. చైనాలో వరుసగా ఏడేళ్లపాటు వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ మేరకు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ.. చైనా యువత పెళ్లంటే ఎందుకు ముఖం చాటేస్తోంది? దాని వెనుక ఉన్న కారణాలేంటి?

  • పునీత్ రాజ్​కుమార్​ స్టెప్పులేస్తే..

కన్నడ పవర్​స్టార్​, దివంగత నటుడు పునీత్​ రాజ్​కుమార్​ హఠాన్మరణాన్ని (Puneeth Rajkumar Death) ఇప్పటికీ ఎందరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు నివాళిగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు రూపొందిస్తున్నారు. అయితే పునీత్ డాన్స్​కు ఉండే క్రేజే వేరు.​ ఈ క్రమంలోనే రామ్​చరణ్-ఎన్టీఆర్​ల 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని నాటు నాటు పాటకు పునీత్​ స్టెప్పులేస్తే (Puneeth Rajkumar Dance) ఎలా ఉంటుందో తెలుపుతూ ఓ అభిమాని రూపొందించిన వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • కేన్​ను త్వరగా పెవిలియన్​కు పంపితేనే..'

భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్ ​(IND vs NZ Test Series) గురువారం (నవంబర్ 25) ప్రారంభం కానుంది. టీమ్​ఇండియా.. రోహిత్, కోహ్లీ, రాహుల్​ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే కివీస్​తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కివీస్ సారథి కేన్​ విలియమ్సన్​ను భారత బౌలర్లు వీలైనంత త్వరగా పెవిలియన్​కు పంపడం కీలకం అని అంటున్నారు క్రికెట్ నిపుణులు. మరి విలియమ్సన్​ బలహీనతలేంటో తెలుసుకుందాం..

13:44 November 24

టాప్​ న్యూస్​@ 2 PM

  • రైతులకు ఒరిగిందేమీ లేదు

తెరాస, భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(tpcc chief revanth reddy) ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్‌రెడ్డి(revanth reddy).. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రం దిల్లీలో సేద తీరుతున్నారని ఆరోపించారు.

  • ఎవరూ అధైర్యపడవద్దు

తిరుపతిలో చంద్రబాబు(chandrababu) పర్యటన కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ఎవరూ అధైర్యపడవద్దని... తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  •  రామోజీ ఫౌండేషన్‌ చేయూత

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్‌(Ramoji foundation) చేయూతనిచ్చింది. పురాతన భవనంతో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా స్పందించిన రామోజీ ఫౌండేషన్‌... రూ.కోటితో సకల హంగులతో నూతన భవనానికి శ్రీకారం చుట్టింది.

  • విడాకుల రూమర్లకు చెక్!

భర్త నిక్ జోనస్​తో నటి ప్రియాంక చోప్రా (Priyanka and Nick Latest News) విడాకులు తీసుకోబోతోందన్న రూమర్లు ఇటీవల చక్కర్లు కొట్టాయి. వాటికి తనదైన శైలిలో చెక్​ పెట్టింది ప్రియాంక. భర్తను ఆటపట్టిస్తూ అతడిపై ఎంత ప్రేమ ఉందో తెలియజేసింది.

  •  సింధు శుభారంభం

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu News) ఇండోనేసియా ఓపెన్​ తొలి మ్యాచ్​లో విజయం సాధించింది. జపాన్​ క్రీడాకారిణిపై గెలిచి ప్రీ క్వార్టర్స్​లోకి ప్రవేశించింది.

12:49 November 24

టాప్​ న్యూస్​@ 1 PM

రాజకీయ చదరంగం

తెరాస, భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(tpcc chief revanth reddy) ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్‌రెడ్డి(revanth reddy).. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రం దిల్లీలో సేద తీరుతున్నారని ఆరోపించారు.

గంభీర్​ను చంపేస్తాం

మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌ను(gautam gambhir news latest) హతమారుస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన గంభీర్.. తనకు 'ఐఎస్‌ఐఎస్ కశ్మీర్' నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల బరిలో 'కేజీఎఫ్​'

కర్ణాటకలో స్థానిక సంస్థల కోటా (Karnataka mlc elections) ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 25 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో ఓ కాంగ్రెస్​ అభ్యర్థి ఆస్తి తెలిస్తే షాకవ్వాల్సిందే. కోట్లకు అధిపతి అయిన కేజీఎఫ్​ బాబు (Kgf babu mlc ticket) బెంగళూరు సిటీ నుంచి బరిలో ఉన్నారు.

నిరుద్యోగమే ఎర

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న రాచకొండ ఎస్వోటీ పోలీసులు... వారి నుంచి రూ.5లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సీపీ మహేశ్ భగవత్(CP Mahesh bhagwat press meet) వెల్లడించారు.

అందుకే మానేశా

మెగా డాటర్ నిహారిక (Niharika Konidela).. నిర్మాతగా ఫుల్ బిజీ అయ్యింది. వరుస వెబ్​ సిరీస్​లతో జోరు మీద ఉంది. అయితే సినిమాల్లో నటించడంపై ఆసక్తికర విషయం వెల్లడించింది. అంతేకాక వరుణ్ తేజ్, సాయి తేజ్​లతో చేసిన అల్లరి పనులేంటో తెలిపింది.


 

11:48 November 24

టాప్​ న్యూస్ ​@ 12 PM

ఎమ్మెల్సీ బరిలో 'కోటీశ్వరులు'

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు(mlc elections in telangana) నామినేషన్ల గడువు ముగిసింది. ఖమ్మం జిల్లాలో నలుగురు నామపత్రాలు దాఖలు చేశారు. వారిలో ముగ్గురూ కోటీశ్వరులే కావడం గమనార్హం. అభ్యర్థులు అఫిడవిట్​లో సమర్పించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలో 60 చోట్ల ఏసీబీ తనిఖీలు

కర్ణాటకలో 15 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు(ACB raids in Karnataka ) నిర్వహించారు అవినీతి నిరోధక శాఖ సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో 400 మంది సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.

విద్యార్థి అదృశ్యం విషాదాంతం

ఎంపీసీ గ్రూప్‌ వద్దన్నా.. అమ్మానాన్నలకు అర్థంకాలేదు. నచ్చిన దారిలో వెళ్లనివ్వలేదు. అతికష్టం మీద మొదటి సంపత్సరం పూర్తి చేశాడు. రెండో సంవత్సరం చదువుతుండగా... మనస్తాపం చెందిన విద్యార్థి ఇంటినుంచి వెళ్లిపోయాడు. చివరకు చెరువులో శవమై తేలి(Student suicide case)... కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

తాగిన మత్తులో చంపేశాడు

మద్యం మత్తు.. ఇద్దరి జీవితాల్ని చిత్తు చేసింది. ఒకరి ప్రాణాలు పోగా.. మరొకరు కటకటాలపాలయ్యారు. తాగిన మైకంలో స్నేహితుడిని చెంపదెబ్బ కొట్టగా.. ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.


సిరి కన్నీరు.. కాజల్ సంబరాలు!

బిగ్​బాస్​ హౌస్​లో (Bigg Boss 5 Telugu) నియంత మాటే శాసనం టాస్క్​ ఆసక్తికరంగా సాగుతోంది. కెప్టెన్​గా చేసే అవకాశం ఒక్కసారి కూడా రాలేదంటూ కన్నీరు పెట్టుకుంది కాజల్. అయితే నాలుగో రౌండ్​లో శ్రీరామ్​ డిస్​క్వాలిఫై అవడం వల్ల సంబరాలు మొదలుపెట్టింది.

10:56 November 24

టాప్​ న్యూస్​ @ 11AM

ఈసారి కూడా 50 శాతం ఛాయిస్‌

TS Inter Exams 2021: ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఈసారి కూడా 50 ఛాయిస్ ఇవ్వనున్నారు. పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు పంపనుంది. సిలబస్‌లో 30 శాతం తగ్గించి... 70 శాతం పాఠ్య ప్రణాళికకే పరీక్షలు జరుపుతామని తాజాగా బోర్డు ప్రకటించగా... తగ్గించిన సిలబస్‌ను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది.


బైడెన్​ ఆహ్వానం- చైనాకు​ ఝలక్​​

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ (Biden news).. చైనా, రష్యాకు ఝలక్​ ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై నిర్వహించ తలపెట్టిన వర్చువల్​ సమావేశానికి 110 దేశాలను ఆహ్వానించిన బైడెన్​.. చైనా, రష్యాను దూరం పెట్టారు. భారత్​కు చోటు దక్కింది.


కలెక్టర్‌ వాహనంపై 28 చలాన్లు

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలను నడిపిన వ్యక్తులను ఈ-చలాన్లు భయపెడుతున్నాయి. పెండింగ్ చలాన్లు(pending challans vehicle seize) ఉన్న వాహనాల్లో ప్రభుత్వ వెహికిల్స్ కూడా ఉండడం గమనార్హం. ఓ కలెక్టర్ వాహనంపై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 28 చలాన్లు ఉన్నాయి.


 

బంగారం రేటు ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

జీ పే అకౌంట్​ను బ్లాక్​ చేయండిలా!

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్​ పే వాడుతున్నారా? మరి ఫోన్​ పోతే? గూగుల్​ పే అకౌంట్​ను బ్లాక్‌(block google pay account) చేయవచ్చా? అయితే ఎలా చేయాలి?


 

09:49 November 24

టాప్​ న్యూస్​ @ 10AM

హైదరాబాద్​లోనూ కుంకుమపువ్వు సాగు

Saffron cultivation in Hyderabad: అందాల కశ్మీర్‌ లోయకే పరిమితమైన సుగంధ ద్రవ్యాల్లో రారాణిగా భావించే కుంకుమపువ్వు.. ఇప్పుడు చారిత్రక ప్రసిద్ధిగాంచిన భాగ్యనగరంలోనూ విరబూస్తోంది. ఈ అసాధ్యమైన విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన అర్బన్‌ కిసాన్‌ అంకుర సంస్థ సుసాధ్యం చేసి ఔరా అనిపిస్తోంది.

రైళ్లలో రిజర్వేషన్లు పూర్తి

సంక్రాంతి పండక్కి నెలన్నర ముందే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. చాలా బండ్లలో చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌ కనిపిస్తోంది. గోదావరి, గౌతమి, గరీబ్‌ రథ్‌ వంటి రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది.

అంత మాత్రాన స్టార్​డమ్ రాదు

స్టార్​ హోదా అంత సులువుగా రాదంటున్నారు బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan New Movie). దాని కోసం యువ నటులు ఎంతో శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. బాగా నటించడం ఒక్కటే చాలదని అన్నారు.

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు (Stocks today) బుధవారం సెషన్​ను మిశ్రమంగా ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 100 పాయింట్లకుపైగా లాభంతో.. 50,809 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 49 పాయింట్లు పెరిగి.. 17,552 వద్ద కొనసాగుతోంది. 

మేటి బౌలర్లు

భారత సంతతికి చెందిన ఇష్​ సోధి(Ish sodhi news), అజాజ్​ పటేల్(Ajaz Patel news)​ న్యూజిలాండ్​ జట్టులో కీలక ఆటగాళ్లు కాబోతున్నారు. న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్(IND vs NZ Test series)​ నేపథ్యంలో వీరు భారత జట్టుకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు.


 

08:48 November 24

టాప్​ న్యూస్​@ 9AM

  • ఆసుపత్రుల్లోనూ కుల, మత జాడ్యం!

కుల, మతాల ప్రాతిపదికన చిన్నచూపు చూస్తుండటం ఆసుపత్రుల్లోనూ తగ్గడం లేదు. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఈ జాడ్యానికి బాధితులు అవుతున్నారని ఆక్స్‌ఫామ్‌ సర్వేలో(oxfam india survey) వెల్లడైంది.

  • పెట్రోల్​ రేటును దాటిన టమాట

టమాట ధర రోజురోజుకు(Tomato price hike) పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం సెంచరీ మార్క్‌కు చేరిన టమాట ధర... ఇపుడు రూ. 130కి చేరింది. ఆసియాలో అతిపెద్ద టమాట మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఏపీలోని మదనపల్లె మార్కెట్‌ యార్డులో గతంలో ఎన్నడూ లేని రీతిలో టమాట ధర పలికింది. చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి రైతుల నుంచి వ్యాపారులు టమాట కొనుగోలు చేశారు.

  • ఆ ఎన్నికలు జరపాల్సిందే

Kondapally Municipal Chairman Elections: ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సమావేశం నిర్వహించి.. కొండపల్లి పురపాలక ఛైర్మన్, వైస్​ ఛైర్మన్​ ఎన్నిక జరిపించాల్సిందేనని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ సహకారం తీసుకోవాలని ఆర్వోను ఆదేశించింది.

  • దానికి అర్థం చెబుతాం

'ప్రతి మనిషిలోనూ అనుభవించాలనే ఓ కోరిక ఉంటుంది. నిజంగా అనుభవించడం అంటే ఏమిటో మా సినిమాలో చూపిస్తాం' అంటున్నారు దర్శకుడు శ్రీను గవిరెడ్డి. ఆయన దర్శకత్వంలో (Anubhavinchu Raja Movie Raj Tarun) రాజ్​ తరుణ్ హీరోగా నటించిన 'అనుభవించు రాజా' సినిమా (Anubhavinchu Raja Movie) ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలివి.

  • ఐపీఎల్-15 అప్పటినుంచే

క్రికెట్​ అభిమానులకు గుడ్​న్యూస్. ఐపీఎల్​ 15వ సీజన్​ (IPL 2022 start date) త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

07:47 November 24

టాప్​ న్యూస్​ @ 8AM

టీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రాబడి

గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకీ రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా వల్ల కొద్దిరోజులు నష్టాలు వస్తే… పెరిగిన డీజీల్ ధరలతో మరికొన్ని నష్టాలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ ఒక్కరోజులోనే రూ.14.06 కోట్లు వసూలు చేసి.. రికార్డులు తిరగరాసింది.


వాల్టన్​ బాటలో ముకేశ్​ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థల అధినేత.. వాల్‌మార్ట్‌ వ్యవస్థాపకులైన శామ్‌వాల్టన్‌ బాటలోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. వారసత్వ ప్రణాళికపై అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశారు. ఆ సంస్థ లాంటి ట్రస్టును ఏర్పాటు చేసి.. దాని నియంత్రణలోకి కుటుంబ వాటాలన్నీ బదిలీ చేసే యోచనలో ఉన్న ఆయన ఉన్నట్లు సమాచారం.


నాసా సరికొత్త ప్రయోగం

NASA news: సుదూర విశ్వంలోకి వెళ్లే వ్యోమనౌకలతో కమ్యూనికేషన్​ సాగించడం కీలకంగా మారింది. దీనిని అధిగమించేందుకు నాసా సంకల్పించింది. కమ్యూనికేషన్లను వేగవంతం చేసేందుకు ఎల్​సీఆర్​డీ (NASA laser communication) అనే కొత్త సాధనాన్ని ప్రయోగించనుంది.

'రాజధాని' మారిందిలా..

బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో దేశ రాజధాని మార్పు ఒకింత కలకలం సృష్టించింది. లార్డ్‌ కర్జన్‌లాంటి అనేక మంది వద్దని చెప్పినా.. 1911లో రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చారు. భారత్‌లో తమ పాలనను శాశ్వతంగా పదిల పర్చుకోవటానికి దిల్లీ కేంద్రమైతే బాగుంటుందనుకున్నారు. కానీ కొత్త దిల్లీ ఉదయించిన కొన్నాళ్లకే.. బ్రిటిష్‌ సామ్రాజ్యంపై రవి అస్తమించించటం యాదృచ్ఛికం!


సీనియర్లే స్ఫూర్తిగా

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌(Junior Hockey World Cup) నేటి(నవంబర్ 24) నుంచి ప్రారంభం కానుంది. టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రాత్మక కాంస్య పతకం సాధించిన భారత సీనియర్‌ జట్టే స్ఫూర్తిగా మన యువ ఆటగాళ్లు జూనియర్‌ ప్రపంచకప్‌లో బరిలో దిగబోతున్నారు. సీనియర్ ఆటగాడు వివేక్ సాగర్ యువ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం.


 

06:50 November 24

టాప్​ న్యూస్​ @ 7AM

  • పరిశీలకుల నియామకం

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Election Observers)కు పరిశీలకులను నియమించారు. ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశాలు జారీ చేసింది.

  • అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ

వాయుసేన కోసం కేంద్రం రూ.2236 కోట్లతో అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. 'భారత్‌లో తయారీ' కింద ఈ సామాగ్రిని సమకూర్చుకోనున్నట్లు రక్షణశాఖ (Defence Acquisition Council) ప్రకటనలో తెలిపింది.

  • విజయవంతం

వైద్య పరీక్షల నిమిత్తం పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ డయాగ్నొస్టిక్​ కేంద్రాలు(T- Diagnostic centers).. సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 15 లక్షలకు పైగా నిరుపేదలకు లబ్ధి చేకూరింది. ఈ మేరకు ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ నివేదిక సమర్పించింది. త్వరలో మరికొన్ని జిల్లాల్లో ఉచిత డయాగ్నొస్టిక్​ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

  • ప్రభాస్​ పారితోషికం​ అన్ని కోట్లా?

prabhas remuneration for spirit movie: స్టార్​ హీరో ప్రభాస్​ రెమ్యునరేషన్​ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్​మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సందీప్​ వంగా దర్శకత్వంలో ఆయన నటించనున్న 'స్పిరిట్' సినిమా(spirit movie prabhas) కోసం భారీ మొత్తంలో పారితోషికం తీసుకోనున్నారట! ఇంతకీ పారితోషికం ఎంతంటే?

  • వాళ్లు చూసుకుంటారు: బెయిలీ

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌ పైన్‌(Tim Paine News)ను తుది జట్టులోకి ఎంపిక చేసే విషయంలో ఓటింగ్‌ పద్ధతి అవలంభిస్తే.. తాను పక్కకు తప్పుకొంటానని ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ తెలిపాడు. ఆ బాధ్యతలను మరో సెలెక్టర్‌ టోనీ డోడ్‌మెయిడ్‌, ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు అప్పగిస్తానని వెల్లడించాడు.

03:28 November 24

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో కొవిడ్ కేసులు (Covid Cases) గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జీహెచ్​ఎంసీ (GHMC), రంగారెడ్డి మినహా రాష్ట్రంలో మరెక్కడా రోజుకు పదికి మించి కేసులు నమోదు కావటం లేదని వైద్యారోగ్య శాఖ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. 

  • ధాన్యం అమ్మకం కష్టాలు

అన్నదాతను ధాన్యం అమ్మకం కష్టాలు (Paddy Problems) వెంటాడుతూనే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి అన్నదాతలు ఎదురు చూస్తున్నా... కొనే దిక్కు లేదు.

  • లిక్కర్‌ కంటే బీర్ల అమ్మకాలే అధికం

తెలంగాణలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత ఆరేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత మద్యం విధానంలో గడచిన రెండేళ్లలోనే రూ.50 వేల కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి.

  • కోటి కొల్లగొట్టిన కిలాడి దంపతులు

చదివింది ఇంజినీరింగ్‌...! ప్రముఖ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం సైతం సంపాదించాడు. అయినా అప్పనంగా వచ్చే సొమ్ముపై ఆశపట్టాడు. జూదానికి అలవాటుపడి ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఆ తర్వాత తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో సామాజిక మాధ్యమాల వేదికగా కోటి రూపాయలకు పైగా మోసం చేశాడు. 

  • రైళ్లలో రిజర్వేషన్లు పూర్తి

సంక్రాంతి పండక్కి నెలన్నర ముందే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. చాలా బండ్లలో చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌ కనిపిస్తోంది. గోదావరి, గౌతమి, గరీబ్‌ రథ్‌ వంటి రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది.

  • రెండో డోసు తీసుకుంటే..

టీకా పంపిణీ విస్తృతం చేసేందుకు మధ్యప్రదేశ్​లోని మందసుర్​ జిల్లా (Madhya Pradesh Vaccination) అధికారులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. రెండో డోసు టీకా తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్​ ఇప్పిస్తామని ప్రకటించారు.

  • సింహం ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లి

హైదరాబాద్​ నెహ్రూ జూపార్కులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. సింహాలు ఉండే ఎన్​క్లోజర్ దగ్గరికి వెళ్లాడు. ఆఫ్రికన్ జాతికి చెందిన సింహాలు ఉండే ఎన్​క్లోజర్ దగ్గిరికి వెళ్లిన యువకుడు సమీపంలో ఉన్న రాళ్లపై కూర్చున్నాడు.

  • ఇండో-పసిఫిక్‌ ఇనీషియేటివ్‌

'ఇండో-పసిఫిక్‌ ఇనీషియేటివ్‌'ను గుర్తిస్తున్నట్లు (Indo Pacific Oceans Initiative) చైనా ప్రకటించింది. ఈ ప్రాంతంలోను, అంతర్జాతీయంగా ఆసియాన్‌ నిర్వహిస్తున్న కీలకపాత్రకు చైనా ఎప్పుడూ మద్దతిస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు.

  • పైన్ సెలక్షన్​ను వాళ్లు చూసుకుంటారు

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌ పైన్‌(Tim Paine News)ను తుది జట్టులోకి ఎంపిక చేసే విషయంలో ఓటింగ్‌ పద్ధతి అవలంభిస్తే.. తాను పక్కకు తప్పుకొంటానని ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ తెలిపాడు. ఆ బాధ్యతలను మరో సెలెక్టర్‌ టోనీ డోడ్‌మెయిడ్‌, ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు అప్పగిస్తానని వెల్లడించాడు.

  • ఎంట్రీ ఇవ్వనున్న సాయిపల్లవి సోదరి

saipallavai sister movie: వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ సాయిపల్లవి సోదరి పూజా కన్నన్​ నటించిన తొలి సినిమా 'చిత్తిరి సేవానమ్'​ డిసెంబరు 3న రిలీజ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.




 

Last Updated : Nov 24, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.