'ఈ జెర్సీ ధరిస్తే ప్రపంచకప్ మనదే'.. జాఫర్ ఫన్నీ మీమ్

author img

By

Published : Nov 24, 2021, 9:39 PM IST

Wasim Jaffer

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్ విజేతగా నిలవాలంటే పసుపు రంగు జెర్సీ ధరించాలంటూ ఫన్నీ మీమ్​ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. అసలు ఈ ఎల్లో జెర్సీ కథేంటంటే?

టీ20 ప్రపంచకప్-2021లో సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టి నిరాశపర్చింది టీమ్ఇండియా. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు బీసీసీఐ విధానాలను తప్పుబట్టారు. మరికొందరు జట్టు ప్రణాళికపై మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే మెగాటోర్నీ కోసమైనా సరైన వ్యూహాలు రచించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియాకు ఓ మంచి సూచన ఇచ్చాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్​.

అప్పట్లో టీమ్ఇండియా పసుపు రంగు జెర్సీ ధరించి కొన్ని మ్యాచ్​లు ఆడింది. దీనికి సంబంధించి సచిన్ ఎల్లో జెర్సీ ధరించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన జాఫర్.. "ప్రస్తుతం పసుపు రంగు జెర్సీ ధరించిన జట్టు ట్రోఫీలు గెలుస్తోంది. అందువల్ల ఎల్లో జెర్సీని తిరిగి తీసుకురావాల్సిన సమయం వచ్చింది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిని చూసిన నెటిజన్లు.. జాఫర్ ట్వీట్​పై విపరీతంగా కామెంట్లు పెడుతూ నవ్వుకుంటున్నారు. మరికొందరు 'నిజమే కదా!' అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇదీ మ్యాటర్!

ఈ ఏడాది ఐపీఎల్​ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ట్రోఫీ కైవసం చేసుకున్న తమిళనాడు జట్లవి పసుపు రంగు జెర్సీలే. అలాగే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ దక్కించుకున్న ఆస్ట్రేలియా కూడా ఎల్లో జెర్సీనే ధరించింది. దీంతో వచ్చే ఏడాది టీమ్ఇండియా ట్రోఫీ సాధించాలంటే ఎల్లో జెర్సీ ధరించాలని ఫన్నీగా కామెంట్ చేశాడు జాఫర్.

ఇవీ చూడండి: టెస్టు క్రికెట్​కు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.