కైకాల ఆరోగ్యంపై చిరు ప్రత్యేక శ్రద్ధ.. నిరంతరం పర్యవేక్షిస్తూ

author img

By

Published : Nov 24, 2021, 5:11 PM IST

కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై చిరు మానిటరింగ్​, chiranjeevi monitoring on kaikala health condition

chiranjeevi on kaikala health condition: అస్వస్థకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కైకాల సత్యనారాయణ ఆరోగ్యం గురించి పలువురు ప్రముఖులు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, కైకాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. ఆయన కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు చిరంజీవి.

chiranjeevi on kaikala satyanarayana health condition: కొద్ది రోజుల క్రితం అస్వస్థకు గురైన టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కైకాల హాస్పిటల్​లో చేరినప్పటి నుంచి మెగాస్టార్​ చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే చిరు.. వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కైకాల కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు(kaikala health condition news). ప్రతిరోజూ.. కైకాల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన స్పృహలో ఉన్నారా? లేదా? వంటి విషయాల గురించి డాక్టర్​లతో మాట్లాడుతున్నారు. కైకాల స్పృహలోకి వచ్చాక తనకు థంబ్స్​అప్​ సైగ కూడా చూపించారని ఇటీవలే చిరు తెలిపారు.

కాగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, సీనియర్​ హీరోలు నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, నటుడు రావు రమేష్​, కన్నడ స్టార్​ హీరోలు యశ్​, శివ రాజ్​కుమార్​ కూడా ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆయనకు ఏమీ కాదని, తామంతా ఉన్నామని కైకాల కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

అలాగే, కైకాల ఆరోగ్యం గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన కైకాల ఫ్యామిలీ.. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని, దయచేసి పుకార్లు పుట్టించొద్దని కోరారు.

ఇదీ చూడండి: Kaikala satyanarayana health: కైకాలతో ఫోన్​లో మాట్లాడిన చిరు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.