Tomato price hike: రికార్డు స్థాయిలో టమాట ధర.. పెట్రోల్​ రేటును దాటి..

author img

By

Published : Nov 24, 2021, 8:13 AM IST

Tomato price hike

టమాట ధర రోజురోజుకు(Tomato price hike) పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం సెంచరీ మార్క్‌కు చేరిన టమాట ధర... ఇపుడు రూ. 130కి చేరింది. ఆసియాలో అతిపెద్ద టమాట మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఏపీలోని మదనపల్లె మార్కెట్‌ యార్డులో గతంలో ఎన్నడూ లేని రీతిలో టమాట ధర పలికింది. చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి రైతుల నుంచి వ్యాపారులు టమాట కొనుగోలు చేశారు.

Tomato price today: ఆసియాలో అతిపెద్ద టమాట మార్కెట్‌గా గుర్తింపు పొందిన మదనపల్లె మార్కెట్‌ యార్డులో గతంలో ఎన్నడూ లేని రీతిలో టమాట ధర పలికింది. వారం రోజుల క్రితం సెంచరీ మార్క్‌ చేరిన కిలో టమాట ధర... ఇప్పుడు రూ. 130కి చేరింది. గరిష్ఠంగా రోజుకు వెయ్యి మెట్రిక్‌ టన్నులతో కళకళలాడే ఆంధ్రప్రదేశ్​లోని మదనపల్లె మార్కెట్‌ యార్డు.. కేవలం 150 మెట్రిక్‌ టన్నులకు పరిమితమవ్వగా.... చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి.. వ్యాపారులు టమాట కొనుగోలు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో టమాట ధరలు(tomato price hike) ఆకాశాన్నంటుతున్నట్లు మార్కెట్ యార్డ్ సిబ్బంది తెలిపారు.

చిత్తూరు నుంచి

రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో టమాట పంట సాగుచేస్తుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం చిత్తూరు జిల్లాలో పండిన టమాట ఎగుమతి అవుతుంది. గడచిన కొంత కాలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమాట పంట పూర్తిగా దెబ్బతింది. మరో వైపు ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు... రబీ సీజన్‌ ప్రారంభ దశ కావడంతో దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఫలితంగా గతంలో రోజుకు 800 వందల నుంచి వెయ్యి మెట్రిక్‌ టన్నుల మేర మదనపల్లె మార్కెట్‌(tomato price at madanapalle market yard)కు వచ్చిన టమాట ఇపుడు 150 టన్నులకు పడిపోయింది. పరిమిత సంఖ్యలో వస్తున్న టమాట దక్కించుకోవడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. దీంతో చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో 28 కిలోల బాక్స్‌ 3,640 పలికిందని మదనపల్లి మార్కెట్ యార్డ్ కార్యదర్శి అక్బర్ బాషా వెల్లడించారు.

విదేశాలకు కష్టమే

గతంలో రాష్ట్ర అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో టమాట పంటను అందించిన మదనపల్లె మార్కెట్‌.. ఇపుడు స్థానిక అవసరాలకు సరిపడక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. స్థానిక వ్యాపారులు తమ వినియోగదారులకు ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం రాయపూర్‌ నుంచి దాదాపు 20 మెట్రిక్‌ టన్నులు రోజూ దిగుమతి చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: Trains Reservations: సంక్రాంతి పండక్కి రైళ్లలో రిజర్వేషన్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.