ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 'కేజీఎఫ్​'.. వందల కోట్లకు అధిపతి!

author img

By

Published : Nov 24, 2021, 12:15 PM IST

KGF Babu is 1,643 crore property owner

కర్ణాటకలో స్థానిక సంస్థల కోటా (Karnataka mlc elections) ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 25 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో ఓ కాంగ్రెస్​ అభ్యర్థి ఆస్తి తెలిస్తే షాకవ్వాల్సిందే. కోట్లకు అధిపతి అయిన కేజీఎఫ్​ బాబు (Kgf babu mlc ticket) బెంగళూరు సిటీ నుంచి బరిలో ఉన్నారు.

KGF babu karnataka: వందల కోట్ల అధిపతి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఆయనే బెంగళూరు నగర కాంగ్రెస్​ అభ్యర్థి యూసుఫ్​ షరీఫ్ (Yusuf shariff kgf)​. ఈయనను కేజీఎఫ్​ బాబు అని పిలుచుకుంటారు. మండలి ఎన్నికల బరిలో ఉన్నవారిలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

వ్యాపారవేత్త అయిన కేజీఎఫ్​ బాబు.. బెంగళూరు రాజకీయ నాయకుల్లోని అత్యంత ధనవంతుల్లో (Richest politician in karnataka list) ఒకరు. తనకు రూ. 1643 కోట్లు ఆస్తి ఉన్నట్లు తన అఫిడవిట్​లో పేర్కొన్నారు.

డిసెంబర్​ 10న కర్ణాటకలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు ప్రకటించనున్నారు.

Karnataka Council Election
కర్ణాటక కాంగ్రెస్​ కార్యాలయంలో కేజీఎఫ్​ బాబు, కర్ణాటక కాంగ్రెస్​ చీఫ్​ డీకే శివకుమార్​

ఈ నేపథ్యంలోనే.. మంగళవారం నామినేషన్​ వేసిన కేజీఎఫ్​ బాబు(Karnataka mlc elections).. తన ఆస్తి వివరాలు వెల్లడించారు.

Karnataka Council Election
నామినేషన్​ సమర్పిస్తున్న కేజీఎఫ్​ బాబు

ఆస్తి వివరాలు..

  • ఆస్తి మొత్తం- రూ. 1643 కోట్లు
  • బ్యాంకు ఖాతాలు- 23
  • అప్పులు- రూ. 58 కోట్లు

రూ. 2 కోట్ల 99 లక్షలు విలువ చేసే 3 కార్లు, కోటికిపైగా విలువైన వాచ్​, 4.5 కేజీల బంగారం, రూ. 48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, రూ. 1593 కోట్ల విలువైన స్థలాలు ఉన్నాయి.

Karnataka Council Election
యూసుఫ్​ నామినేషన్​ పత్రం
Karnataka Council Election
యూసుఫ్​ షరీఫ్​ ఆస్తి వివరాలు

ఇవీ చూడండి: మలాశయంలో ఇరుక్కున్న టాయిలెట్​ స్ప్రేయర్​​- చివరకు...

టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ.. బాంబులతో దాడి చేసుకుని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.