భారీగా తగ్గిన వెండి ధర- ఏపీ, తెలంగాణలో బంగారం రేటు ఇలా..

author img

By

Published : Nov 24, 2021, 10:08 AM IST

Gold price, Silver rate

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలో (Gold Rate Today) బుధవారం స్వల్పంగా తగ్గుదల నమోదైంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.330 తగ్గింది. అయితే వెండి కిలోకు రూ.1,866కుపైగా దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.49,270 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,894 వద్ద ఉంది.

విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold Price in Vijayawada) ధర రూ.49,270గా ఉంది. కిలో వెండి ధర రూ.64,894 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,894 వద్ద కొనసాగుతోంది

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,794 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.55 డాలర్లు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.

వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.

గుంటూరు నగరంలో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: రూ.1,000లోపు దుస్తులపై కేంద్రం జీఎస్టీ ఎందుకు పెంచింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.