ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 26, 2021, 5:54 AM IST

Updated : Nov 26, 2021, 5:54 PM IST

ఈటీవీ భారత్​
ఈటీవీ భారత్​

17:39 November 26

టాప్​ న్యూస్​ @6PM

  • ఎమ్మెల్సీల్లో సగం ఏకగ్రీవాలే..

Telangana MLC elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఆరింటిని తెరాస ఖాతాలో వేసుకుంది. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  • డిసెంబర్​ 6న భారత్​కు పుతిన్​

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ డిసెంబరు 6న భారత్​లో పర్యటించనున్నారు. 21వ భారత్-రష్యా వార్షిక సదస్సు కోసం ఆయన దిల్లీ రానున్నారు. ప్రధానమంత్రి మోదీతో కలిసి దిల్లీలో జరిగే ఈ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

  • సెలబ్రిటీలకు చైనా కొత్త రూల్స్​..

సెలబ్రిటీలపై కొత్త ఆంక్షలు విధిస్తోంది చైనా. వారు సామాజిక మాధ్యమాల్లో సంపద, విలాసాలకు సంబంధించిన వివరాలు వెల్లడించకుండా నిషేధించింది. విపరీత ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని భారీగా ఫైన్​లు విధించింది(china crackdown on celebrity culture). వినోద పరిశ్రమపై చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ వైఖరిని ఎందుకు అవలంబిస్తోందంటే..

  • రోహిత్​ డాన్స్​ వీడియో వైరల్​..

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test)లో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే శ్రేయస్, శార్దుల్ ఠాకుర్​తో పాటు అతడు డ్యాన్స్(Rohit Sharma Dance Video) చేసిన ఓ వీడియోను నెట్టింట షేర్ చేశాడు.

  • మేడమ్​ కొత్త సెల్పీ విత్​ మొక్క..

జిమ్​లు, సినిమా షూటింగ్​లు ఖాళీ దొరికితే ఫొటో షూట్లతో బిజీబిజీగా గడిపే ముద్దుగుమ్మ పూజహెగ్డే మొక్క నాటింది. రామోజీ ఫిలిం సిటీలో ఓ సినిమా షూటింగ్​ కోసం వచ్చిన పూజా.. సుషాంత్​ విసిరిన సవాలును స్వీకరించి.. మొక్క నాటింది.​ మరి మేడమ్​.. గ్రీన్​ ఇండియా సవాలును ఎవరికి విసిరిందంటే..?

16:49 November 26

  • 25 మంది నేతలు టచ్‌లో ఉన్నారు

సీఎం కేసీఆర్​పై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్( tarun chugh strong comments) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​కు దిల్లీలో షాక్ తగిలిందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెరాసకు అభ్యర్థులు దొరకరంటూ ఆరోపించారు.

  • తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కలెక్టరేట్‌కు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి.. తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తుడుందెబ్బ మద్దతుతో పుష్పరాణి నామినేషన్‌ వేశారు. పుష్పరాణికి భాజపా కూడా మద్దతు ప్రకటించింది.

  • కొనుగోలుకై కదం తొక్కిన రైతులు..

జగిత్యాలలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన(Jagtial Farmers Protest today) నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు పెద్దఎత్తున పోరుబాట(Farmers Protest in Jagtial today) పట్టారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన అన్నదాతలు.. పాత బస్టాండ్‌ నుంచి జగిత్యాల కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం.. పాలనాధికారి కార్యాలయం ముందు(jagityal farmers protest at collector office) బైఠాయించారు. వివిధ రకాల పంటలను ప్రదర్శిస్తూ.. నిరసన వ్యక్తం చేశారు.

  • బాలుని ఊపిరితిత్తుల్లో విజిల్​

Whistle Removed From Lungs: బంగాల్​లోని ప్రభుత్వ వైద్యులు కీలక సర్జరీని నిర్వహించారు. 12 ఏళ్ల బాలుడు ప్లాస్టిక్​ విజిల్​ను మింగగా అది ఊపిరితిత్తుల్లోనే (whistle in lungs) ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడికి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి విజిల్​ను బయటకు తీశారు.

  • రెండో రోజు కివిస్​దే ఆధిపత్యం...

భారత్-న్యూజిలాండ్​ మధ్య కాన్పుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్​లో భారత్ 345 పరుగులకు ఆలౌట్​ కాగా.. కివీస్​ ప్రస్తుతానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 129 పరుగులు చేసింది. ఇంకా 216 రన్స్ వెనుకంజలో ఉంది.

15:48 November 26

టాప్​ న్యూస్​ @4PM

  • ముగిసిన ఉపసంహరణ గడువు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఆరింటిని తెరాస ఖాతాలో వేసుకుంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్‌ జరగనుంది.

  • జగిత్యాలలో ఉద్రిక్త వాతావరణం..

జగిత్యాల కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలెక్టర్‌ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. మిల్లర్ల మోసాలు అరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే మల్లేశం అనే రైతు ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తోటి రైతులు, పోలీసులు కలిసి మల్లేశంను అడ్డుకున్నారు.

  • రేప్​ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం..

రేప్​ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. బాధిత మహిళ కావాలనే అతనికి నగ్నంగా వీడియో కాల్స్ చేసిందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది(karnataka high court news).

  • మార్కెట్​పై మళ్లీ కరోనా పంజా..

stock market crash today: కరోనా కొత్త వేరియంట్​ వార్తలు, అంతర్జాతీయంగా లాక్​డౌన్​ భయాలతో దేశీయ సూచీలు శుక్రవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1688పాయింట్లు కోల్పోయి 57,107 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 510పాయింట్లు నష్టపోయి 17,026 వద్ద ముగిసింది.

  • ఆర్​ఆర్​ఆర్'​లోని 'జనని' పాట విన్నారా..

తారక్-రామ్​చరణ్ కాంబినేషన్​లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి 'జనని' పాట (RRR Janani Song) విడుదలైంది. తెలుగు సహా కన్నడ, మలయాళం, తమిళ్, హిందీల్లో విడుదలైన ఈ పాట భావోద్వేగానికి గురిచేస్తోంది.

14:30 November 26

టాప్​ న్యూస్​ @3PM

  • కొనుగోళ్ల కోసం రైతుల పోరుబాట..

Jagtial Farmers Protest today : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానాపాట్లు పడుతున్న రైతులు పోరుబాట పట్టారు. జగిత్యాలలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

  • 5వేల కోట్లు ఖర్చుపెట్టలేరా..?

పండించిన పంటకు కనీస మద్దతు ధర లేన్నందునే... రాష్ట్రంలో రైతులకు సమస్యలు వచ్చాయని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి(MLC Jeevan Reddy on paddy) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అపాయింట్​మెంట్​ తీసుకోకుండా సీఎం కేసీఆర్​ దిల్లీ వెళ్లినప్పుడే ఆయన నిజస్వరూపం బయటపడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రైతులకు ​అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

  • పోలీస్​స్టేషన్​నే పేల్చేశారు..

ఝార్ఖండ్​, గుమ్లా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్​ భవనాన్ని(Kurumgarh Police Station Blast) బాంబుతో పేల్చేశారు. ఇటీవల అరెస్టైన నక్సల్ అగ్రనేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • షాపింగ్​మాల్​లో భారీ అగ్నిప్రమాదం..

అమెరికా లాస్​ ఏంజలెస్​లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్​ అలమేడాలోని ఓ వాణిజ్య సముదాయంలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. వస్త్రాలతో నిండి ఉన్న ఓ పెద్ద భవనం మొత్తం మంటలు అంటుకున్నాయి. దుస్తులు, సామగ్రి కాలిపోయాయి. మైళ్ల మేర దట్టమైన పొగ కమ్ముకుంది. 80 వేల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న భవంతి పైకప్పు కూలిపోయింది. దాదాపు 100 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

  • కోపంలో చాహర్​ ఆంపైర్​తో..

IND A vs SA A: టీమ్​ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతుండగా అంపైర్​పై ఆగ్రహం వ్యక్తం చేశాడు లెగ్​ స్పిన్నర్ రాహుల్ చాహర్. కోపం అదుపుచేసుకోలేక అంపైర్​తో గొడవ పెట్టుకున్నాడు.

13:37 November 26

టాప్​ న్యూస్​ @2PM

  • 'అభివృద్ధి పథంలో దేశం'

రాజ్యాంగ బలంతోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో మహిళలకు ఓటు హక్కు మాత్రమే కల్పించలేదని, రాజ్యాంగ పరిషత్​లో వారు సభ్యులుగా కూడా ఉన్నారని పేర్కొన్నారు.

  • తాగేస్తామంటూ బెదిరించుకున్నారు

వారికి పెళ్లై ఏడాదే అయింది. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయి. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తాజాగా జరిగిన గొడవలో పురుగు మందు తాగి చనిపోతానని ఒకరినొకరు బెదిరించుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే...

  • కాలేజీలో 182 మందికి కరోనా

కర్ణాటకలోని వైద్యకళాశాలలో(SDM College Covid News) కరోనా బారిన పడ్డ విద్యార్థుల సంఖ్య 182కు చేరింది. ఇప్పటివరకు 300 మందికి పైగా విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి తెలిపారు. కాలేజీలో ఇటీవల జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వెల్లడించారు.

  • సెమీస్​కు పీవీ సింధు

PV Sindhu Indonesia Open: ఇండోనేసియా ఓపెన్​ క్వార్టర్స్​లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సత్తాచాటింది. దక్షిణ కొరియా క్రీడాకారిణి సిమ్ యుజిన్​పై విజయం సాధించి సెమీస్​ చేరుకుంది.

  • '83' టీజర్..

1983 ప్రపంచకప్​ ఆధారంగా తీస్తున్న సినిమా '83'. గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే టీజర్​ను శుక్రవారం(నవంబరు 26) రిలీజ్ చేశారు. 1983 జూన్ 25న జరిగిన మ్యాచ్​ దృశ్యాల్ని.. ఈ టీజర్​లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

12:36 November 26

టాప్​ న్యూస్​ @1PM

  • 'వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు'

వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని1950 తర్వాత ప్రతి ఏటా నిర్వహించాల్సిందని పేర్కొన్నారు. కానీ కొంతమంది అలా చేయలేదని చెప్పారు.

  • అలుపెరగని పోరాటం

ఏపీలోని నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్ర (Amaravati farmers maha padayatra) కొనసాగుతోంది. 26వ రోజు రాజుపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. నేడు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్​ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించి రైతులు యాత్ర ప్రారంభించారు.

  • తాగి నడుపుతూ దొరికిపోయారు.. 

మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎన్నిసార్లు చెప్పినా.. ఎంత అవగాహన కల్పించినా మందుబాబులకు అర్థంకావడం లేదు. తాగడం తూలుతూ వాహనం నడుపుతూ.. ప్రమాదాలు చేయడం పరిపాటైంది. ఈ ప్రమాదాల్లో వారు గాయపడుతున్నా.. ఎదుటి వాళ్ల ప్రాణాలు పోతున్నా వారి పంథా మారడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన కేసులను చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

  • మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

కర్ణాటకలోని వైద్యకళాశాలలో(SDM College Covid News) కరోనా బారిన పడ్డ విద్యార్థుల సంఖ్య 182కు చేరింది. ఇప్పటివరకు 300 మందికి పైగా విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి తెలిపారు. కాలేజీలో ఇటీవల జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వెల్లడించారు.

  • అభిమానికి వార్నర్​ షాకింగ్​ రిప్లై

David Warner SRH: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్​ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు. ఐపీఎల్​లో సన్​రైజర్స్​ తరఫున ఆడిన అతడు.. ఇప్పుడు ఓ అభిమానికి షాకింగ్ రిప్లై ఇచ్చాడు. అసలేం జరిగిందంటే?

11:44 November 26

టాప్​ న్యూస్​@ 12PM

  • ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శకం

దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవం(నవంబరు 26) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News Latest). ఈ మేరకు డాక్టర్. బీఆర్​ అంబేడ్కర్ వ్యాఖ్యలను ట్విట్టర్​ వేదికగా షేర్ చేశారు. మోదీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

  • మార్కెట్లపై మళ్లీ కరోనా ఎఫెక్ట్

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా భయాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఓ దశలో దాదాపు 1500 పాయింట్ల మేర కోల్పోయింది. నిఫ్టీ 400 పాయింట్లు కోల్పోయింది.

  • అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నారా భువనేశ్వరి

ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నారా భువనేశ్వరి స్పందించారు. తనకు అండగా నిలిచిన వారిని ఎన్నటికీ మరవనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలను ఖండించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన అవమానాన్ని మీ తల్లి, సోదరికి జరిగినట్లు భావించారని వెల్లడించారు. అండగా నిలబడిన వారిని జీవితంలో మర్చిపోలేనని తెలిపారు.

కేసీఆర్ కుటుంబసభ్యుల పూజలు

MLC Kavitha karthika pooja: కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక శుక్రవారం సందర్భంగా కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెరాస నేతలు పాల్గొన్నారు.

  • ఓటీటీలో మూడు తెలుగు సినిమాలు

ఓటీటీలో శుక్రవారం మూడు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఆకాశ్ పూరీ 'రొమాంటిక్', సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్', నవీన్ చంద్ర 'బ్రో' చిత్రాలు ఉన్నాయి.

11:02 November 26

టాప్​ న్యూస్​@ 11AM

  • టీకా వేయించుకోవాలి

రాజ్​భవన్​లో నిర్వహించిన 72వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్(Governor Tamilisai)... అందరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా ఇంకా పోలేదని... జాగ్రత్తలు పాటించాలని అన్నారు. దేశానికి అంబేడ్కర్ అద్భుత రాజ్యాంగం అందించారని వ్యాఖ్యానించారు.

  • ఆ మారణహోమానికి 13 ఏళ్లు

ముంబయి పేలుళ్లు (Mumbai attack 26/11).. యావత్​ భారతావని ఎన్నటికీ మరువలేని ఘటన. ఆ మారణహోమం జరిగి నేటికి 13 సంవత్సరాలు (Mumbai attack date). ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు అమరులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

  • పెరిగిన పసిడి ధరలు

బంగారం ధర (Gold price Today) స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.200 మేర ఎగసి.. 49 వేల 419కి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

  • మార్కెట్లపై మళ్లీ కరోనా భయాలు

కరోనా భయాలు మళ్లీ స్టాక్​ మార్కెట్లను (Stock market today) కుదిపేశాయి. దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 1300 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల మేర నష్టపోయాయి. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్​ బయటపడిన నేపథ్యంలో.. ఆసియా సహా ప్రపంచ దేశాల స్టాక్​ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి.

  • తొలి టెస్టులో శ్రేయస్ సెంచరీ

Shreyas Iyer Century: న్యూజిలాండ్, భారత్ తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. భారత్​ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన 16వ బ్యాటర్​గా నిలిచాడు.

09:52 November 26

టాప్​ న్యూస్​@ 10AM

  • కొత్తగా 10,549 మందికి కరోనా

దేశం​లో క్రితం రోజుతో పోలిస్తే.. కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా పెరిగింది. తాజాగా 10,549 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 488 మంది మృతి చెందారు.

  • ఈనెల 29న అల్పపీడనం

AP Weather News Today: ఈనెల 29నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో తేలికపాటినుంచి మోస్తరు.. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

వారాంతపు సెషన్​ను స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ బలహీనతలు, ఆసియా మార్కెట్​లో ప్రతికూల పవనాల నడుమ సెన్సెక్స్​ 843 పాయింట్లు నష్టపోయి 57,951కి పడిపోయింది.

  • ఆస్ట్రేలియా టెస్టు సారథిగా కమిన్స్

Pat Cummins Captain: ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్​గా పాట్​ కమిన్స్​ను, వైస్​ కెప్టెన్​గా స్టీవ్ స్మిత్​ను నియమించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇటీవలే టిమ్ పైన్​ సారథిగా తప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

  • సమంత ఇంటర్నేషనల్​ ప్రాజెక్టు

(samantha new movie) అంతకంతకూ తన ఇమేజ్​ పెంచుకుంటూ పోతున్న సమంత.. ఇప్పుడు అంతర్జాతీయంగానూ మెప్పించేందుకు సిద్ధమైంది. ఓ ఇంగ్లీష్ సినిమా​లో నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ రచయిత తిమేరి ఎన్.మురారి నవల 'ద అరెంజ్​మెంట్స్ ఆఫ్ లవ్​' ఆధారంగా తెరకెక్కించనున్నారట.

08:47 November 26

టాప్​ న్యూస్​@ 9AM

  • పాపను కాటేసిన పాము

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో విషాదం నెలకొంది. బయ్యారంలోని అంగన్వాడీకి వెళ్లిన ఓ చిన్నారి పాముకాటుకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి(Anganwadi student died by snake) చెందింది. పాముకాటును ఆయమ్మ గుర్తించి ఉంటే చిన్నారి ప్రాణం పోకుండా ఉండేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

  • నలుగురు దుర్మరణం

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కరీంనగర్​లోని జ్యోతినగర్​ వాసులుగా గుర్తింపు. ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా మానకొండూర్ పోలీస్ స్టేషన్​ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు

నవంబరు 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. అంతకుముందే కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆర్డినెన్సులు తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

  • పైన్.. క్రికెట్​కు కొన్నాళ్లు దూరం!

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ నేపథ్యంలో టెస్టు జట్టు మాజీ సారథి టిమ్​ పైన్(tim paine news) అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పైన్ కీలక ప్రకటన చేశాడు. కొద్ది రోజుల పాటు క్రికెట్​కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు.

  • పెళ్లికి రండి.. వాటిని తీసుకురాకండి!

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్.. తమ పెళ్లికి వచ్చే వారికి కచ్చితమైన నిబంధన ఒకటి పెట్టారట. అతిథులెవరూ వాటిని తీసుకురావొద్దని సూచించారట. ఇంతకీ అదెంటంటే?(katrina kaif marriage)

08:09 November 26

టాప్​ న్యూస్​@ 8AM

  • కాంగ్రెస్ వరిదీక్ష

Congress Dharna at Indira Park 2021 : రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్​లోని ఇందిపార్కు వద్ద శని, ఆదివారాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'వరి దీక్ష' చేపడుతున్నట్లు తెలిపారు.

  • టర్కీ తరహా మసీదు

Telangana Secretariat Mosque: సచివాలయ ప్రాంగణంలో గతంలో ఉన్న మసీదులు, ఆలయం, చర్చిలను పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం మసీదుల నిర్మాణ పనులను (Foundation For Mosque at Secretaria) ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

  • భారీ భూకంపం

Earthquake In Thenzawl: మిజోరం ఈశాన్యప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్​సీఎస్​) స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది.

  • కార్ల్‌సన్‌కు ఎదురుందా?

World Chess Championship 2021: ప్రపంచ చెస్‌ ఛాంపియన్​షిప్ సమరం శుక్రవారం(నవంబర్ 26) నుంచే ప్రారంభం కానుంది. దుబాయ్‌ వేదికగా జరిగే ఈ పోరులో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్​సన్, రష్యా ఆటగాడు ఇయాన్ నిపోమ్​నిషి తలపడనున్నారు.

  • సూర్యతో కీర్తి సురేశ్

keerthy suresh surya movie: 'గ్యాంగ్‌' చిత్రంతో ఆకట్టుకున్న జంట సూర్య, కీర్తి సురేశ్. ఇప్పుడు ఈ జోడీ మరోసారి కలిసి నటించనుంది అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. 20 ఏళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో సూర్య ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

06:44 November 26

టాప్​ న్యూస్​@ 7AM

  • టికెట్​ ధర తగ్గింపు

ప్లాట్​ఫామ్​ టికెట్లపై పెంచిన ఛార్జీలను (Platform Ticket Price) తగ్గిస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. దీంతో రూ.50గా ఉన్న ప్లాట్​ఫామ్​ టికెట్​ ధర మళ్లీ రూ.10కు చేరనుంది. దేశవ్యాప్తంగా ఈ ధరల మార్పు అందుబాటులోకి రానుంది.

  • పాకిస్థాన్​ అప్పులు

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాకిస్థాన్​ అప్పులు రూ.50 లక్ష కోట్లు దాటినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మొత్తంలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్​ హయాంలోనే పెరిగినట్లు వెల్లడించింది.

  • భారత్‌ 13.. కెనడా 1

Junior Hockey World Cup:జూనియర్ హాకీ ప్రపంచకప్​లో భారత్​ తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం 13-1 తేడాతో కెనడాను చిత్తుచేసింది.

  • 'ఆ కరెన్సీలకు విలువ లేదు

క్రిప్టో కరెన్సీలకు(Cryptocurrency In India) ప్రాథమిక విలువ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ గార్గ్‌ తెలిపారు. క్రిప్టో కరెన్సీలపై 2017లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది.

  • 'అఖండ' ధైర్యాన్నిచ్చింది

'అఖండ' హై ఓల్టేజ్​ సినిమా అని శ్రీకాంత్ చెప్పారు. బాలయ్యకు విలన్​గా చేయడం గురించి మాట్లాడారు. ఇందులో తన పాత్ర సరికొత్తగా ఉంటుందని అన్నారు.

04:44 November 26

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • మూత్రపిండాలకు ముప్పు

మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉంది. క్రమేణా ప్రాణాపాయానికి దారి తీసే కిడ్నీల వైఫల్య వ్యాధి భయపెడుతోంది. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న బాధితుల సంఖ్య అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

  • రైసు మిల్లుల పరిశ్రమ కుదేల్

ఉప్పుడు బియ్యం వ్యవహారం వేలమంది ఉపాధిని ప్రశ్నార్థకంగా మార్చనుంది. యాసంగిలో బియ్యం తీసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉండటంతో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతోంది.

  • ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc Elections)కు ఎన్ని జిల్లాలో పోలింగ్ జరగబోయేది ఇవాళ తేలనుంది. నాలుగు ఉమ్మడి జిలాల్లోని ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

  • లాభాలంటారు... ఆపై దోచేస్తారు!

బిట్‌కాయిన్‌ (Bitcoin Fraud) కొంటే రోజూ లాభాలొస్తాయ్‌ మీ తరఫున లావాదేవీలు మేం నిర్వహిస్తాం... మీరు అమెరికన్‌ డాలర్లలో మదుపుచేసిన డబ్బును ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ... సైబర్‌ నేరస్థులు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. 

  • మెట్రోరైల్​పై సర్కార్ దృష్టి

హైదరాబాద్ మెట్రోరైల్​(Hyderabad Metro Rail)ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన మెట్రోరైల్‌ గాడిన పెట్టేందు కోసం అవకాశాలను అన్వేషిస్తోంది.

  • అతడ్ని చంపింది నేనే

'ఆ హత్య చేసింది నేనే.. ఆరు నెలల్లో మిగతా వాళ్లందరినీ లేపేస్తా' అంటూ గ్యాంగ్​స్టర్ ప్రిన్స్​ఖాన్​ హెచ్చరించిన ఓ వీడియో(Prince khan video)​ .. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 

  • చైనా నుంచి పాక్​కు యుద్ధనౌక

China's military hardware export to Pak: పాకిస్థాన్​ నేవీకి కావాల్సిన ప్రధాన మిలటరీ హార్డ్​వేర్​ను చైనా సరఫరా చేస్తోందని భారతీయ నేవీ చీఫ్​ అడ్మిరల్​ కరంబీర్​ సింగ్​ పేర్కొన్నారు. 

  • బొగ్గు గనిలో భారీ పేలుడు

రష్యాలోని ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించిన ఘటనలో (Russia Coal Mine Accident) 52 మంది మృతిచెందారు. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు పుతిన్​ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అన్ని విధాల సాయం అందిచాలని అధికారులను ఆదేశించారు.

  • 'లైగర్' షూటింగ్ పూర్తి

'లైగర్' టీమ్​ లాస్ వెగాస్ షెడ్యూల్​ పూర్తి చేసింది. దిగ్గజ బాక్సర్​ మైక్​ టైసన్​పై కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగించుకుంది.

  • నాలుగేళ్లుగా ఆ ఫొటోనే?

shreyas iyer test debut: న్యూజిలాండ్​తో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన శ్రేయస్((75*)).. హాఫ్​ సెంచరీతో అదరగొట్టి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. (shreya iyer vs newzealand). ఈ క్రమంలోనే అతడి తండ్రి కూడా అయ్యర్​ ఆటతీరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. 
 

Last Updated : Nov 26, 2021, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.