David Warner SRH: అయ్యయ్యో వద్దమ్మా.. వార్నర్ రెస్పాన్స్ అదుర్స్!

author img

By

Published : Nov 26, 2021, 12:29 PM IST

david warner

David Warner SRH: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్​ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు. ఐపీఎల్​లో సన్​రైజర్స్​ తరఫున ఆడిన అతడు.. ఇప్పుడు ఓ అభిమానికి షాకింగ్ రిప్లై ఇచ్చాడు. అసలేం జరిగిందంటే?

టీ20 ప్రపంచకప్​లో తిరిగి ఫామ్​లోకి వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner SRH)​ 'ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నీ​'గా నిలిచాడు. అయితే.. ఈ మెగా టోర్నీకి ముందు జరిగిన ఐపీఎల్​ సీజన్​లో వార్నర్​కు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. పేలవ ప్రదర్శన కారణంగా సన్​రైజర్స్​ జట్టు అతడిని కెప్టెన్​గా(David Warner reply to fan) తొలగించింది. కేవలం రెండు మ్యాచ్​ల్లోనే ఆడేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కనీసం కారణం కూడా చెప్పకుండా సన్​రైజర్స్​ అతడిని సారథిగా తొలగించిందని వార్నర్​ ఓ సందర్భంలో చెప్పాడు.

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం ప్రక్రియ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఇన్​స్టా వేదికగా ఓ ఎస్​ఆర్​హెచ్​ ఫ్యాన్​ పేజ్​ పోస్ట్​కు వార్నర్​ స్పందించడం విశేషం.

'వచ్చే సీజన్ ఐపీఎల్(IPL 2022) దృష్ట్యా సన్​రైజర్స్​ జట్టు ఎవరికి బాధ్యతలు అప్పగించాలి?, ఎవరిపై దృష్టిసారించాలి' అని ఓ ఫ్యాన్ పేజ్​ పోస్ట్​ చేసింది. దీనిపై అభిమానుల స్పందన కోరింది. దీనిపై కామెంట్ చేసిన ఓ అభిమాని.. 'టామ్​ మూడీ హెడ్​ కోచ్, డేవిడ్ వార్నర్ కెప్టెన్'గా ఉండాలని అన్నాడు. దీనికి 'నో థాంక్స్' అని రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు వార్నర్.

david warner reply
వార్నర్ రిప్లై

భారత్​లోనే..

ఐపీఎల్ 15వ సీజన్​ భారత్​లోనే నిర్వహించున్నట్లు బీసీసీఐ ఇటీవలే స్పష్టం చేసింది. ఈ మేరకు మెగా వేలం ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న ఐపీఎల్​ ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:

IPL 2022: ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ఐపీఎల్-15 అప్పటినుంచే..!

ధోనీ అభిమానులకు గుడ్​న్యూస్.. మరో మూడేళ్లు సీఎస్కేతోనే!

IPL 2022: ఐపీఎల్​ రిటెన్షన్.. ఏ జట్టులో ఎవరెవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.