ETV Bharat / city

ఈటీవీ భారత్​-ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 3, 2021, 5:54 AM IST

Updated : Nov 3, 2021, 8:54 PM IST

etv bharat latest news
etv bharat latest news

20:48 November 03

టాప్​న్యూస్​@ 9PM

  • రేపు వ్యాక్సినేషన్​కు హాలిడే..

రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్​ ప్రక్రియకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.

  • కన్నుల పండువగా దీపోత్సవం..

దీపావళిని పురస్కరించుకుని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. లక్షలాది దీపాల వెలుగులతో ఆ ప్రాంతమంతా సరికొత్త శోభను సంతరించుకుంది.

  • కొవాగ్జిన్​.. ఇక ప్రపంచానికి..

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ (Covaxin WHO Approval) అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్​ఓ ఈ నిర్ణయం తీసుకుంది.

  • వాహనదారులకు దీపావళి కానుక..

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. దీపావళి వేళ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాహనదారులకు కాస్త ఊరట కలిగించే అంశం. తగ్గించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి.

  • భీమ్లానాయక్​ ఆగయా..

'భీమ్లా నాయక్' నుంచి మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

18:52 November 03

  • రేపటి నుంచే అమలుచేయాలి లేదంటే..

హుజూరాబాద్ ప్రజలకు భాజపా రుణపడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస అబద్ధాలను ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​ చెప్పినట్లుగా రేపటినుంచి దళితబంధును అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

  • ఆధార్​ చట్టం ఉల్లంఘిస్తే..

ఆధార్‌ చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(యూఐడీఏఐ)కు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

  • కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ గ్రీన్​సిగ్నల్​

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్​ఓ ఈ నిర్ణయం తీసుకుంది.

  • ఇండియాపై స్కాట్లాండ్​ కీపర్​ వ్యాఖ్యలు..

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) న్యూజిలాండ్- స్కాట్లాండ్​ మ్యాచ్​లో(NZ vs SCO T20) ఆసక్తికర దృశ్యం కనిపించింది. టీమ్​ఇండియాను ఉద్దేశిస్తూ స్కాట్లాండ్​ కీపర్ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

  • కొత్త సరుకు వచ్చేసింది..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సుమ కొత్త సినిమా, రిపబ్లిక్, కురుప్, మంచిరోజులు వచ్చాయి, సూపర్​మచ్చి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

17:50 November 03

టాప్​న్యూస్​@ 6PM

  • కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ గ్రీన్​సిగ్నల్​

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్​ఓ ఈ నిర్ణయం తీసుకుంది.

  • నర్సింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​..

దీపావళి వేళ రాష్ట్రప్రభుత్వం నర్సింగ్ విద్యార్థులకు గుడ్​న్యూస్​ చెప్పింది. నర్సింగ్​ చదువుతున్న విద్యార్థులకు స్టైపండ్‌ పెంచుతూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న నాలుగు సంవత్సరాల విద్యార్థులతో పాటు జీఎన్ఎం స్టూసెంట్స్​కు కూడా స్టైపండ్‌ పెరగనుంది. 

  • గవర్నర్​ దీపావళి శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దీపావళి శుభాకాంక్షలు(Governor Tamilisai Diwali Wishes) తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్​ స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తులతో పండుగ జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

  • హెలికాప్టర్​లో వచ్చిన సీతారాములు..

అయోధ్య దీపోత్సవంలో భాగంగా.. దేవతామూర్తుల పాత్రలు ధరించిన కళాకారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి పాత్రలు పోషిస్తున్న కళాకారులకు పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు.. వారందరినీ సీఎం స్వయంగా హెలికాప్టర్​లో లఖ్​నవూ నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు.

  • నెట్​ఫ్లిక్స్​ బంపర్​ ఆఫర్​..

ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో పోటీ బాగా పెరుగుతుండటం వల్ల వినియోగదారులను ఆకర్షించేందుకు నెట్​ఫ్లిక్స్ కొత్త ఆఫర్​ను ప్రకటించింది. ఐదు మొబైల్​ గేమ్స్​ను సబ్​స్క్రైబర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకే ఈ సదుపాయం ఉన్నట్లు తెలిపింది.

  • సూపర్​ స్పీడ్​లో రామ్​చరణ్​..

డైరెక్టర్​ శంకర్​ తీస్తున్న కొత్త సినిమా తొలి షెడ్యూల్​ను రామ్​చరణ్(ram charan new movie) పూర్తిచేశారు. అక్టోబరు చివరి వారంలో పుణెలో ఇది ప్రారంభమైంది. యాక్షన్ సీక్వెన్స్​ను ఇందులో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

17:02 November 03

టాప్​న్యూస్​@ 5PM

  • జీఆర్​ఎంబీకి మరో లేఖ..

గోదావరికి సంబంధించిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్​ల విషయంలో కాలయాపన చేయకుండా.. వెంటనే కేంద్ర జలసంఘానికి పంపాలని నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. జీఆర్ఎంబీ చైర్మన్​కు లేఖ రాసిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్... అక్టోబర్ 26న రాసిన లేఖకు కొనసాగింపుగా ప్రాజెక్టుల డీపీఆర్​ల అంశాన్ని ప్రస్తావించారు.

  • రేపు వ్యాక్సినేషన్​ బంద్​..

రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్​ ప్రక్రియకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు. 

  • ఇక నుంచి ఏడాది గ్యాప్​..

కొవాగ్జిన్​ టీకా కాలపరిమితిని 12 నెలలకు పెంచింది సీడీఎస్​సీఓ. టీకా తయారైనప్పటి నుంచి 12 నెలల వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. అదనపు డేటాను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

  • దీపావళికి జియో కొత్త స్మార్ట్​ఫోన్

జియోతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపిన రిలయన్స్​.. ఇప్పుడు అత్యాధునిక స్మార్ట్​ఫోన్​ను ప్రజలకు చౌకగా అందించాలనే లక్ష్యంతో జియోఫోన్ నెక్స్ట్‌ను(jio phone next) మార్కెట్లోకి తీసుకొస్తోంది. గూగుల్​తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఫోన్​ దీపావళి రోజు(నవంబర్​ 4న) విడుదల అవుతోంది. మరి దీని ధర ఎంత?(jio phone next price) ఫీచర్లు ఏంటి? ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలి? అనే పూర్తి వివరాలు..

  • సర్కారు వారి పాట సంక్రాంతికి కాదు..

మహేశ్​ 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతికి కాకుండా ఏప్రిల్​లో 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కొత్త పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 

14:40 November 03

  • భట్టిపై రేణుక ఫైర్​..

గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader batti vikramarka), రేణుకా చౌదరి (renuka chowdary) మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఖమ్మం జిల్లాలో భట్టి చర్యలతో సమస్యలు వస్తున్నాయని రేణుక చౌదరి ప్రస్తావించారు.

  • పార్టీని పట్టించుకోను..

2023 వరకు కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ విషయాల్లో జోక్యం చేసుకోనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి (PCC Executive President Jaggareddy) స్పష్టంచేశారు. ఉన్నది ఉన్నట్లు చెబితే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. హుజురాబాద్‌కు తమ పార్టీ సూపర్‌స్టార్లు వెళ్తేనే ఓట్లు రాలేదని... తాను వెళ్తే వస్తాయా అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

  • మోదీ నయా నినాదం..

దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహించడం తగదని అన్నారు. టీకా పంపిణీ పలు జిల్లాల్లో నెమ్మదిగా సాగడంపై సమీక్ష(Modi meeting today) నిర్వహించారు. 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

  • చైనా చేజేతులా చేసుకుంది..

'సరకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి. పొట్టుతీయని ధాన్యాలు తినండి. పండ్లు, కాయగూరలను ఆరబెట్టి నిల్వచేసుకోండి' లాంటి ప్రకటనలు ప్రభుత్వాల నుంచి వెలువడితే.. ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయో ఊహించుకోవచ్చు! ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా పాలకులు (china food shortage) ఈ మధ్య ఇలాంటి ప్రకటనలనే ఇస్తున్నారట!. ఇంతకీ.. చైనా పాలకులకు ఆ గత్యంతరం ఎందుకు పట్టిందంటే..

  • అగ్రస్థానానికి బాబర్​..

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ అగ్రస్థానానికి చేరుకోగా.. టీమ్​ఇండియా సారథి కెప్టెన్​ కోహ్లీ మాత్రం పాత ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. బుమ్రా మాత్రం ఏకంగా పది స్థానాలను మెరుగుపరచుకోవడం విశేషం.

13:45 November 03

టాప్​న్యూస్​@ 2PM

  • మంత్రి కేటీఆర్​ పరామర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యాచారానికి గురైన ఆరేళ్ల గిరిజన బాలికను మంత్రి కేటీఆర్​ పరామర్శించారు. హైదరాబాద్​ నీలోఫర్​ ఆస్పత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా నీలోఫర్​ చేరుకున్న కేటీఆర్​.. చిన్నారిని, పాప తల్లిదండ్రులను పరామర్శించారు. 

  • దివ్వెలతో దీపోత్సవం

దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అయోధ్య ముస్తాబైంది(ayodhya deepotsav 2021). రామ్‌కీ పౌడీ ఘాట్‌లో 7లక్షల 50వేల దీపాలు వెలిగించి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీపోత్సవంతో(ayodhya diwali 2021) పాటు రామాయణ ఇతివృత్తం తెలిపేలా కళాకారులు గీసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి.

  • భూతాపం పెరిగితే పరిస్థితి ఏంటి?

భూతాపం వల్ల ఎన్నో విపత్కర పరిస్థితులు (Effects of Global Warming) ఏర్పడుతున్నాయి. హిమానీనదాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, వరదలు, కార్చిచ్చులు, సునామీలు (Global Warming Projections) విధ్వంసం సృష్టిస్తున్నాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే.. భూతాపం 3 డిగ్రీలకు పెరిగితే? అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? మానవులు మనుగడ సాధించే అవకాశం ఉంటుందా?

  • గిల్​-సారా బ్రేకప్?

టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కించుకోని యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ ప్రస్తుతం ఇంటివద్దే విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. తరచూ సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన విషయాలు పంచుకునే ఇతడు.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అతడికి ఏమైందని కామెంట్లు పెడుతున్నారు.

  • 'ఆ జోనర్​లో నటించాలని ఉంది'

కామెడీ సినిమాలో నటించాలనే కోరిక చాలా రోజులుగా ఉందని తన మనసులో మాటను చెప్పారు నటి సాయిపల్లవి. సరైన కామెడీ స్ప్రిప్ట్​ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తనదైన శైలి నటన, డ్యాన్స్​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పల్లవి. ఇటీవలే శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్​స్టోరీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త బ్రేక్​ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇన్​స్టాలో సరదాగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగానే తన మనసులోని మాటను బయటపెట్టారు.

12:34 November 03

టాప్​న్యూస్​@ 1PM

కేసీఆర్​కు గుణపాఠం కావాలి

ప్రజలు అవినీతినైనా సహిస్తారు కానీ.. అహంభావాన్ని సహించరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana on KCR) అన్నారు. సీఎం కేసీఆర్​ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. హుజూరాబాద్​ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​(CPI Narayana on KCR) విజయం సాధించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష

హుజూరాబాద్​లో ఘోర పరాజయంపై కాంగ్రెస్​ అంతర్మథనం ప్రారంభించింది. పీసీసీ పీఠంపైకి రేవంత్​ వచ్చాక.. జరిగిన పోరులో డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడంతో.. శ్రేణుల్లో నిరాశ మొదలైంది. ఓటమికి కారణాలపై విశ్లేషించేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీభవన్​లో సమావేశమైంది.


బావను కొట్టి చంపిన బామ్మర్ది

తరచూ ఇంటికి వస్తున్నాడని సొంత బావనే హత్య చేశాడు (crime news latest updates) ఓ యువకుడు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లోని బైతూల్ జిల్లాలో జరిగింది.


పాకిస్థాన్​: అఫ్గాన్‌ సదస్సుకు రాను

అఫ్గానిస్థాన్​లోని పరిస్థితులపై భారత్​ నిర్వహించే సదస్సుకు హాజరవనని పాకిస్థాన్​ జాతీయ భద్రత సలహాదారు మెయీద్​ యూసుఫ్​ తెలిపారు. భారత్‌ను శాంతిదూత పాత్రలో చూడబోమని వ్యాఖ్యానించారు.


గజదొంగ పాత్రలో మాస్​ మహారాజా

టాలీవుడ్ హీరో రవితేజ నటించబోతున్న #RT71 సినిమాకు సంబంధించిన అప్​డేట్ వచ్చింది. గజదొంగ 'టైగర్​ నాగేశ్వరరావు' బయోపిక్​గా పాన్​ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. దర్శకుడు వంశీ దీన్ని తెరకెక్కించనున్నారు.

12:06 November 03

టాప్​న్యూస్​@ 12PM

  • 'పేకాడదాం రండి'

మంచిరేవుల ఫాంహౌస్​ కేసు(Naga shaurya farm house case) విచారణలో భాగంగా గుత్తా సుమన్‌కుమార్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. చూడగానే ఆకట్టుకునేలా సిద్ధం చేసిన కార్డులను పంపించి పేకాట ఆడేందుకు రావాలని ప్రముఖులను గుత్తా సుమన్‌కుమార్‌ ఆహ్వానించేవాడని సైబరాబాద్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. విజయవాడ మామిడితోటల నుంచి కొలంబో వరకు అతని ప్రయాణం సాగిందని తెలిపారు.

  • భాజపాకు పెరిగిన బలం

తెలంగాణ అసెంబ్లీలో భాజపా సభ్యుల(BJP Seats in Telangana Assembly) సంఖ్య పెరిగింది. తాజాగా వెలువడిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలతో ఆ సంఖ్య మూడుకు చేరింది. సాధారణ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకు మాత్రమే పరిమితమైన భాజపా... ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలను కలిగిఉంది.

  • పూలతో బద్రినాథ్​ ఆలయం అలంకరణ

ఉత్తరాఖండ్​లోని బద్రినాథ్​ ఆలయాన్ని 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా చేరుకుంటున్నారు.

  • కోహ్లీపై ఫన్నీ మీమ్స్!

టీమ్ఇండియా సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ క్రికెట్ ఆడిందా? 88 బంతుల్లో 52 పరుగులు చేసిందా? ఎక్కడ ఆడింది? సినిమాలోనా.. నిజంగానా.. ఈ వార్త చూడగానే ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటున్నారా? అయితే అదేంటో తెలుసుకోండి.

  • 'భీమ్లానాయక్'​ నుంచి అప్డేట్​

'భీమ్లానాయక్'​ సినిమాలోని 'లాలా భీమ్లా' సాంగ్​కు సంబంధించిన ప్రోమోను సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే పవన్​ మాస్​లుక్​లో ఉన్న ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

10:57 November 03

టాప్​న్యూస్​@ 11AM

  • ప్రజల అభిమానంతోనే గెలుపు

హుజురాబాద్ ఉపఎన్నికలో తన గెలుపును తమ గెలుపుగా భావించి అంతా దీపావళి చేసుకున్నారని ఈటల రాజేందర్‌ తెలిపారు. తెరాస ఎన్నో కుట్రలు చేసినా... వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రజలు తలొగ్గ లేదన్నారు. ఉపఎన్నికలో భాజపా కార్యకర్తలు పులిబిడ్డల్లా పనిచేశాని ఈటల కొనియాడారు. 

  • తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala reopen date) తిరిగి తెరుచుకుంది. ప్రత్యేక పూజల కోసం ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరిచారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న భక్తులను దర్శనానికి (Sabarimala Darshan) అనుమతిస్తున్నారు. నవంబర్ 15న ఆలయం పూర్తిస్థాయిలో తెరుచుకోనుంది.

  • 18 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత

భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను పట్టుకున్నారు (Drugs seized today) దిల్లీ పోలీసులు. రూ.18 కోట్లు విలువైన హెరాయిన్​ను నార్కోటిక్స్ విభాగ (Drugs Seized in Delhi) అధికారులు సీజ్ చేశారు.

  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధరలు క్రితంరోజుతో పోలిస్తే బుధవారం స్పల్పంగా తగ్గాయి. వెండి ధరలో భారీగా తగ్గుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.1,364 దిగొచ్చింది.

  • రిలీజ్​ డేట్​తో 'మేజర్'

అడివి శేష్ 'మేజర్'(major movie release date) సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. ఈ మూవీ రిలీజ్​ డేట్​ ఖరారైంది. 2022 ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఓ మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

10:01 November 03

టాప్​న్యూస్​@ 10AM

  • పోలీస్ స్టేషన్‌కు నాగశౌర్య తండ్రి!

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసు(Naga Shaurya farm house case) దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్‌ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు. నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇవాళ పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. 

  • దేశంలో కరోనా కేసులిలా..

దేశంలో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 11,903 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 14,159 మంది కరోనాను జయించారు.

  • 'మీ కుటుంబ బాధ్యత మాది'

సీఏపీఎఫ్ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఏపీఎఫ్ సిబ్బంది నిశ్చింతగా దేశ రక్షణలో పాల్గొనాలని అన్నారు. సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.

  • ఈ రికార్డులపై ఓ లుక్కేయండి!

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భాగంగా నేడు (నవంబర్ 3) అఫ్గానిస్థాన్​తో తలపడనుంది టీమ్ఇండియా(ind vs afg t20). ఈ మ్యాచ్​లో గెలిచి సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.

  • అలా వాళ్లిద్దరూ సేఫ్‌

బిగ్​బాస్​లో(nagarjuna bigg boss 5) ఈ వారం నామినేషన్స్​లో ఉన్న అనీ మాస్టర్​​, మానస్​ సేవ్ అయ్యారు. ఇక కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు(Nagarjuna Bigboss season 5 latest episode). మరి ఇందులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే! అప్పటివరకు ప్రోమోను చూసేయండి..

08:55 November 03

టాప్​న్యూస్​@ 9AM

  • దిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని భారత్​కు చేరుకున్నారు (Modi return to India) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎయిర్​ఇండియా వన్ విమానంలో దిల్లీలో దిగారు. ఆయనకు ఎయిర్​ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు.

  • కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య

ఏడాది కాలంలో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య లక్షా 91 వేలు పెరిగింది. కొత్తగా 2లక్షల 84 వేల పేర్లు జాబితాలో(voter list 2021 telangana) చేరగా... 92వేల పేర్లు తొలగించారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6 లక్షల 61వేల మంది ఓటర్లుండగా... అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో కేవలం లక్షా 42వేల మంది ఓటర్లున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 65 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.

  • కూలిన 21 అంతస్తుల భవనం

నైజీరియాలోని లాగోస్ నగరంలో దారుణం జరిగింది. 21 అంతస్తుల భవనం కుప్పకూలిన (building collapse latest news) ఘటనలో 20 మంది మృతి చెందారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • ఆవు కడుపులో 75 కిలోల ప్లాస్టిక్​

కర్ణాటక ధార్వాడ్​లో ఓ ఆవు కడుపులో నుంచి దాదాపు 75కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు వైద్యులు. అయితే వారి శ్రమకు ఫలితం దక్కలేదు. తీవ్ర అనారోగ్యంతో గోమాత మరణించింది.

  • కోహ్లీ రికార్డును తిరగరాసిన బాబర్

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో భాగంగా మంగళవారం నమీబియాతో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది పాకిస్థాన్. తద్వారా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్​ ద్వారా పలు రికార్డులు నమోదు చేశారు పాక్ ఆటగాళ్లు. అవేంటో చూద్దాం.
 

08:01 November 03

టాప్​న్యూస్​@ 8AM

  • ప్రైవేటు బస్సు బోల్తా

నిర్మల్ జిల్లా కొండాపూర్ బైపాస్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా(private bus accident today) పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

  • అడవులకు పశు తాకిడి

అధిక సంఖ్యలో పశువులు అనియంత్రితంగా వనాల్లో మేయడం వల్లే సమస్య తలెత్తుతోంది. అడవుల్లో సహజంగా పెరిగే మొక్కలను పశువుల నుంచి కాపాడవలసిన అవసరం ఉంది. పశుపోషకులకు సరైన ప్రత్యామ్నాయాలు చూపించి, జీవాలను అడవుల్లోకి తోలుకెళ్లకుండా (livestock grazing in public lands) ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మేలైన పశుగ్రాస వంగడాలను ఉత్పత్తి చేయాలి. వాటిని స్థానికంగా పెంచుతూ, పశువులకు ఉన్నచోటనే (livestock grazing system) ఆహారం అందేలా చూడాలి.

  • ఇథియోపియాలో జాతీయ అత్యయిక స్థితి

ఇథియోపియా ప్రభుత్వం జాతీయ అత్యయిక స్థితి ప్రకటించింది. దేశ రాజధాని ఆడిస్​ అబబాను ఆక్రమిస్తామంటూ టిగ్రే బలగాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • బ్యాటింగ్ కోచ్ రేసులో విక్రమ్

టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్(team india batting coach) పదవికి మరోసారి దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు విక్రమ్ రాథోడ్(vikram rathore batting coach). జట్టుకు చేయాల్సింది ఇంకా చాలా ఉందని తెలిపారు.

  • ఫేవరెట్​ హీరో ఆయనే

బాలీవుడ్ స్టార్​ షారుక్​ ఖాన్ తనకిష్టమైన​ హీరో అని చెప్పింది నటి​ అనన్యా పాండే.. చిన్నప్పటి నుంచి బాద్​షా​ సినిమాలు చూస్తూ పెరిగినట్లు తెలిపింది. అలాగే బంధుప్రీతి(నెపోటిజమ్​)​ గురించి కూడా మాట్లాడింది.

06:56 November 03

టాప్​న్యూస్​@ 7AM

  • టపాసులతో కొవిడ్‌ ఉద్ధృతి

టపాసులతో కొవిడ్‌ ఉద్ధృతి పెరిగే అవకాశం(Corona with Diwali Firecrackers) ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. బాణసంచా కాలుష్యంతో సాధారణం కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. వైరస్ బాధితులపై బాణసంచా పొగ తెచ్చే కాలుష్యం ముప్పు తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని... కాలుష్యాన్ని వాహకంగా చేసుకొని శ్వాసకోశాలపై వైరస్‌ తీవ్ర దాడికి తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

  • ఓటర్ల మొగ్గు ఈటల వైపే

హుజురాబాద్ ఉపఎన్నిక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుగా సాగింది. ధాన్యం కొనుగోళ్లు, పెట్రో ధరల పెరుగుదల అంశాలే ప్రధానాస్త్రాలుగా మలచుకున్నాయి. రెండు అంశాల్లోనూ పరస్పర విమర్శలతో ఉపఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. సవాళ్లు-ప్రతిసవాళ్లు చేసుకున్న నేతలు మీరంటే మీరే కారణమని దుయ్యబట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ రేసులో కమలం విజయపథంలో దూసుకెళ్లింది.

  • కమలదళంలో కొత్త జోష్​

హజూరాబాద్​ ఫలితాలతో కమలదళంలో కొత్త జోష్​ వచ్చింది. ఈటల రాజీనామా నుంచి ఎన్నికల ఫలితాల వరకు పక్కా ప్రణాళికతో వ్యవహరించిన భాజపాకు విజయం వరించింది. సుమారు 23 వేల పైచిలుకు ఓట్లతో ఈటల రాజేందర్​ ఘన విజయం సాధించారు.

  • కాప్​26 గైర్హాజరుపై చైనా

గ్లాస్గోలో జరిగిన కాప్​26 ప్రపంచ నేతల సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ హాజరు కాకపోవడం(Cop26 China Not Attending) సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే.. దీనిపై స్పందించిన చైనా.. తమకు ఆ సదస్సు నిర్వాహకులు వీడియోలింక్​ను పంపలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో.. కాప్​ సదస్సుకు వాతావరణ మార్పుల కట్టడిలో తమ నిర్ణయాలను వివరిస్తూ ఓ లేఖను పంపినట్లు చెప్పింది.

  • ఎప్పుడూ ఫైట్​ చేయాల్సిందే

'ఏక్‌ మినీ కథ' విజయం వల్లే 'మంచి రోజులు వచ్చాయి' అవకాశం వచ్చింది అని చెప్పిన(manchi rojulu vachayi santosh) హీరో సంతోష్ శోభన్​.. దర్శకుడు మారుతితో(manchi rojulu vachayi 2021 director) పని చేయడం కొత్త అనుభూతినిచ్చిందని అన్నారు. ఈ మూవీ దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

05:41 November 03

ఈటీవీ భారత్​-ముఖ్యాంశాలు

  • వికసించిన కమలం

తెరాసకు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఉపఎన్నికల కంటే.. హుజురాబాద్ పోరు (HUZURABAD BYPOLL) చాలా ప్రత్యేకం. హుజురాబాద్ ఉపఎన్నికను తెరాస సవాల్‌గా తీసుకుంది. ఈటల వంటి సీనియర్‌ నేతను ఓడించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తమకు ఎదురులేదని నిరూపించాలని గులాబీ దళం ఉవ్విళ్లూరింది. కమల దళం సైతం హుజురాబాద్ గెలుపు.. అధికార మార్పునకు మలుపు అనే నినాదంతో పనిచేసింది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న భాజపా .. తెరాసను హుజురాబాద్ గడ్డపై ఓడించి గట్టి సందేశం ఇవ్వాలని సంకల్పించింది. గెలుపును రెండు పార్టీలు సవాల్‌గా తీసుకుని పోరాడాయి.

  • 'ఎందుకు ఓడిపోయాం..?'

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర సమితిని నిరాశ పరిచింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ విజయాన్ని అందుకోలేకపోయింది. నాలుగు నెలలుగా ఎత్తులు, పైఎత్తులు.. వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెట్టినప్పటికీ... హుజూరాబాద్​పై గులాబీ జెండా ఎగరవేయలేకపోయింది. అయితే తెరాసకు ఓట్లేమీ తగ్గలేదని.. నైతిక విజయం తమదేనని తెరాస నేతలు పేర్కొంటున్నారు. భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ హుజూరాబాద్ ఫలితంపై త్వరలో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉంది.

  • ఈటల ప్రస్థానం

గతంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అన్నిసార్లు మంచి ఆధిక్యాలతో ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. 2004 నుంచి 2018 వరకు ప్రతి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2004లో కమలాపూర్‌ నుంచి ఇప్పటి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వరకు ఈటల రాజేందర్‌ సాధించిన మెజార్టీపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

  • కాంగ్రెస్​కు గట్టి షాక్​

కాంగ్రెస్​కు మళ్లీ ఘోర పరాభవం ఎదురైంది. పీసీసీ పీఠంపైకి రేవంత్​ వచ్చాక.. శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. పార్టీ కార్యక్రమాలు సైతం పుంజుకున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో ఓట్లు రాబడతాయనుకున్న నేతలకు ఫలితాలు గట్టి షాక్​ ఇచ్చాయి. ఈ ఫలితాలపై పార్టీ నేతలు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండగా.. రేవంత్​ రెడ్డి మాత్రం హుజూరాబాద్​ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్​ పార్టీ భవిష్యత్​ను నిర్ణయించలేవని దీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10:30 గంటలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని పీసీసీ నిర్ణయించింది.

  • 'కొవాగ్జిన్'​ అనుమతిపై.. 

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ అనుమతిపై(Covaxin WHO Approval) తుది మదింపునకు గాను డబ్ల్యూహెచ్​ఓ బృందం నేడు మరోసారి భేటీ కానుంది. ఇప్పటికే.. ఈ టీకాకు సంబంధించి మరింత సమాచారాన్ని తమకు అందజేయాలని భారత్ బయోటెక్​ సంస్థను డబ్ల్యూహెచ్​ఓ బృందం కోరింది.

  • ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య

దీపావళి పండగ సందర్భంగా అత్యధిక దీపాలు(Ayodhya Deepotsav 2021) వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. దీపావళి(Ayodhya Diwali) ముందురోజైన బుధవారం సరయూ నదీతీరంలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

  • కాప్​ సదస్సులో బైడెన్ కునుకు..! 

వాతావరణ మార్పుల కట్టడి కోసం గ్లాస్గో వేదికగా కాప్​26 సదస్సు జరుగుతోంది. ఒక్కో దేశం తాము చేపడుతున్న కార్యక్రమాలు, చేయాల్సిన విషయాలపై అంతర్జాతీయ సమాజానికి వివరిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాత్రం కునుకు(Biden Asleep) తీస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

  • 'డెంగీ' డేంజర్ బెల్స్

దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డెంగీ​ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వైద్య నిపుణులతో కూడిన బృందాలను పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. మిగతా రాష్ట్రాల్లోనూ డెంగీ కట్టడికి విస్తృతమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది.

  • సంక్రాంతి బరిలో రాజశేఖర్ సినిమా

పలు భారీ బడ్జెట్​ సినిమాలతో సంక్రాంతి రేసు రంజుగా ఉంది. అయితే తన సినిమాను అదే సమయానికి రిలీజ్ చేయాలని రాజశేఖర్ భావిస్తున్నారట. ఇంతకీ అది కుదురుతుందా?

  • అఫ్గాన్​తో చావోరేవో!

పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటములు చవిచూసి ఇంటాబయటా విమర్శలుఎదుర్కొంటున్న టీమ్​ఇండియా.. పొట్టి ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) మరో పోరుకు సిద్ధమైంది. అబుదాబి వేదికగా బుధవారం అఫ్గానిస్థాన్​తో (Ind Vs Afg T20) తలపడనుంది. వరుసగా రెండు పరాజయాలతో ఆత్మవిశ్వాసం లోపించి ఉన్న భారత్‌ను.. దెబ్బకొట్టాలని అఫ్గాన్‌ పట్టుదలగా ఉండగా.. అఫ్గాన్‌తో పోరులో ఘన విజయం సాధించి సాంకేతికంగా ఉన్నకాసిన్ని సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని టీమ్​ఇండియా భావిస్తోంది

Last Updated : Nov 3, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.