ETV Bharat / sports

IND VS AFG T20: ఈ రికార్డులపై ఓ లుక్కేయండి!

author img

By

Published : Nov 3, 2021, 9:41 AM IST

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భాగంగా నేడు (నవంబర్ 3) అఫ్గానిస్థాన్​తో తలపడనుంది టీమ్ఇండియా(ind vs afg t20). ఈ మ్యాచ్​లో గెలిచి సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.

kohli
కోహ్లీ

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో రెండు వరుస పరాజయాలతో అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చింది టీమ్ఇండియా. తద్వారా సెమీస్ బెర్తు రేసులో వెనకబడింది. నాకౌట్​ దశకు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్​లు కచ్చితంగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 3) అఫ్గానిస్థాన్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది కోహ్లీసేన(ind vs afg t20). ఈ మ్యాచ్​లో భారీ తేడాతో గెలిస్తే భారత జట్టుకు కొంత ఊరట లభిస్తుంది. అయితే ఈ మ్యాచ్​ ద్వారా పలు రికార్డులు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆటగాళ్లు. వారెవరో చూద్దాం.

హెడ్ టు హెడ్

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)ల్లో ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డాయి భారత్-అఫ్గానిస్థాన్(ind vs afg 2021). రెండుసార్లూ టీమ్ఇండియా విజయం సాధించింది.

రికార్డులు

  • విరాట్ కోహ్లీ(virat kohli records) మరో 9 సిక్సులు బాదితే టీ20ల్లో రోహిత్ తర్వాత 100 సిక్సులు సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తాడు,
  • ఈ మ్యాచ్​లో నాలుగు సిక్సులు బాదితే అంతర్జాతీయ క్రికెట్​లో 100 సిక్సులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు హార్దిక్ పాండ్యా(hardik pandya sixes).
  • మరొక వికెట్ సాధిస్తే టీ20ల్లో 400 వికెట్లు సాధించిన నాలుగో బౌలర్​గా రికార్డు సాధిస్తాడు అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(rashid khan wickets).
  • మరో 27 పరుగులు సాధిస్తే టీ20 క్రికెట్​లో 2000 పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు అఫ్గాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్.
  • మరో 7 పరుగులు సాధిస్తే టీ20ల్లో 2000 పరుగుల క్లబ్​లో చేరిన తొలి వికెట్ కీపర్​గా రికార్డు నెలకొల్పుతాడు మహ్మద్ షెహ్జాద్.
  • మరో 4 సిక్సులు బాదితే టీ20 క్రికెట్​లో 250 సిక్సులు బాదిన బ్యాటర్ల జాబితాలో చేరతాడు అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ. అలాగే మరో 26 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్​లో 1500 పరుగులు పూర్తి చేసుకుంటాడు.
  • మరో 11 పరుగులు చేస్తే టీ20 క్రికెట్​లో 5,500 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు కేఎల్ రాహుల్(kl rahul news).
  • ఈ మ్యాచ్​లో హాఫ్ సెంచరీ సాధిస్తే టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన కెప్టెన్​ల జాబితాలో బాబర్ అజామ్ సరసన నిలుస్తాడు కోహ్లీ(virat kohli half centuries in t20 as captain). ప్రస్తుతం 44 ఇన్నింగ్స్​ల్లో 13 హాఫ్ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. 27 ఇన్నింగ్స్​ల్లో 14 అర్ధశతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు బాబర్ అజామ్.
  • మరో 40 పరుగులు చేస్తే కోహ్లీ తర్వాత టీ20ల్లో 9,500 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తాడు రోహిత్ శర్మ(rohit sharma t20 runs).

ఇవీ చూడండి: T20 World Cup: టీ20 ప్రపంచకప్​లో పెద్దోడు-చిన్నోడు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.