ETV Bharat / sports

T20 World Cup: టీ20 ప్రపంచకప్​లో పెద్దోడు-చిన్నోడు వీరే!

author img

By

Published : Nov 3, 2021, 6:54 AM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup) ఆడుతున్న అత్యంత పెద్ద వయస్కుడి వయసు 44 ఏళ్లు. అత్యంత పిన్న వయస్కుడి వయస్సు 17 ఏళ్లు. వారెవరో తెలుసా?

T20 World Cup
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) అద్భుత ప్రదర్శనతో సెమీస్​ పోటీదారుగా మారింది అఫ్గానిస్థాన్. ఇక డిఫెండింగ్​ ఛాంపియన్​గా ఉన్న వెస్టిండీస్​ పేలవ ప్రదర్శనతో టేబుల్​లో చివరి స్థానాల్లో ఉంది. అయితే ఈ రెండు జట్ల నుంచి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుత ప్రపంచకప్​లో అత్యంత పిన్న వయస్కుడు, అత్యంత పెద్ద వయస్కుడు అఫ్గాన్, విండీస్​లోనే ఉన్నారు.

T20 World Cup
గుర్బాజ్
  • ప్రస్తుత ప్రపంచకప్​లో (Youngest Player in T20 World Cup) అత్యంత పిన్న వయస్కుడు- అఫ్గానిస్థాన్​కు చెందిన రెహ్మనుల్లా గుర్బాజ్​ (19 ఏళ్ల 331 రోజులు)
  • ప్రస్తుత ప్రపంచకప్​లో (Oldest Player in T20 World Cup) అత్యంత పెద్ద వయస్కుడు- వెస్టిండీస్​ (Chris Gayle News) స్టార్​ క్రిస్ గేల్ (42 ఏళ్లు)
    T20 World Cup
    గేల్
  • టీ20 ప్రపంచకప్​ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడు- పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆమిర్ (17 ఏళ్ల 55 రోజులు).. 2009లో ఇంగ్లాండ్​పై​ తొలి ప్రపంచకప్ మ్యాచ్​ ఆడాడు ఆమిర్.
  • టీ20 ప్రపంచకప్​ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడు- హాంగ్​కాంగ్​కు చెందిన ర్యాన్ క్యాంప్​బెల్​ (2016లో 44 ఏళ్ల వయసులో ఆడాడు), టెస్టు ఆడే దేశాల్లో అయితే ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్​ హాగ్ (2014లో 43 ఏళ్లప్పుడు ఆడాడు)

నయా రికార్డు..

ఐర్లాండ్​తో మ్యాచ్​ సందర్భంగా నెదర్లాండ్​కు చెందిన ఐదుగురు బ్యాటర్లు తొలి బంతికే ఔటయ్యారు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు.

ఇదీ చూడండి: yuvraj singh: యువరాజ్​ నుంచి గుడ్​న్యూస్.. మైదానంలోకి రీఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.