ETV Bharat / international

'కొవాగ్జిన్'​ అనుమతిపై నేడు డబ్ల్యూహెచ్​ఓ బృందం భేటీ

author img

By

Published : Nov 3, 2021, 5:42 AM IST

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ అనుమతిపై(Covaxin WHO Approval) తుది మదింపునకు గాను డబ్ల్యూహెచ్​ఓ బృందం నేడు మరోసారి భేటీ కానుంది. ఇప్పటికే.. ఈ టీకాకు సంబంధించి మరింత సమాచారాన్ని తమకు అందజేయాలని భారత్ బయోటెక్​ సంస్థను డబ్ల్యూహెచ్​ఓ బృందం కోరింది.

Covaxin EUL
కొవాగ్జిన్ టీకా డబ్ల్యూహెచ్​ఓ అనుమతి

భారత్​ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను (Covaxin WHO Approval) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహా బృందం(టీఏజీ) నేడు మరోసారి భేటీ కానుంది. టీకాకు(Covaxin News) సంబంధించి అదనపు సమాచారం కావాలని ఇప్పటికే భారత్ బయోటెక్​ను టీఏజీ కోరింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ అధికారి ఒకరు తెలిపారు.

"కొవాగ్జిన్ టీకాకు సంబంధించి, అక్టోబరు 26న టీఏజీ భేటీ అయింది. టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా వ్యాక్సిన్ తయారీదారుల నుంచి అదనపు సమాచారాన్ని కోరింది. ఈ వ్యాక్సిన్​ వినియోగం వల్ల కలిగే తుది ప్రమాదం, ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఈ సమాచారం అవసరమవుతుంది."

-డబ్ల్యూహెచ్​ఓ అధికారి.

"ఈ వారాంతంలో భారత్‌ బయోటెక్‌ నుంచి(Covaxin WHO Approval) అదనపు సమాచారం తమకు అందుతుందని డబ్ల్యూహెచ్​ఓ బృందం భావిస్తోంది" అని సదరు అధికారి పేర్కొన్నారు. టీకాకు సంబంధించి అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై డబ్ల్యూహెచ్​ఓకు టీఏజీ సూచనలు చేయనుంది.

లక్షణాలు ఉన్న కొవిడ్​ బాధితులకు కొవాగ్జిన్​​ టీకాతో 77.8శాతం, డెల్టా వేరియంట్​పై 65.2శాతం రక్షణ లభిస్తుందని ఇప్పటికే పరీక్షల్లో తేలింది. మూడు దశల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.

భారత్​లో కొవాగ్జిన్ టీకాతో పాటు, ఆస్ట్రాజెనెకా, సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకాను వినియోగిస్తున్నారు. ఇప్పటికే 107 కోట్ల డోసులను దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.