యుద్ధమేఘాలు కమ్ముకున్న ఇథియోపియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశ రాజధాని ఆడిస్ అబబాను ఆక్రమిస్తామంటూ టిగ్రే బలగాలు తాజాగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం జాతీయ అత్యయిక స్థితి ప్రకటించింది.
మంగళవారం నుంచి ఆరు నెలల వరకు అది అమల్లో ఉంటుంది. ఇథియోపియాలో పరిస్థితులు గణనీయంగా క్షీణించాయని అమెరికా తెలిపింది. ఆ దేశాన్ని వెంటనే వీడాలని అక్కడున్న తమ పౌరులకు సూచించింది.
ఇదీ చూడండి: 'మాకు వీడియో లింక్ పంపలేదు'.. కాప్26 గైర్హాజరుపై చైనా