ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 23, 2021, 5:47 AM IST

Updated : Nov 23, 2021, 9:59 PM IST

ETV BHARAT
ఈటీవీ భారత్​

21:53 November 23

టాప్​ న్యూస్​@ 10PM

  •  సీఎంతో మంత్రులు, ఎంపీలు భేటీ

సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల, ఎంపీలు (Ministers meet cm kcr) సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్​ తోమర్​తో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాల సారాంశాన్ని సీఎం కేసీఆర్​కు వివరించారు. 

  •  డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

రాబోయే రోజుల్లో కరోనా మరణాలు పెరుగుతాయని యూరప్​ పరిధిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం (who warns europe covid) హెచ్చరించింది. తమ పరిధిలోని 53 దేశాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మరణాలు నమోదవుతాయని పేర్కొంది. ఆస్పత్రుల్లో బెడ్లు, ఐసీయూల కొరతతో మధ్య ఆసియా, యూరప్ ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పింది.

  • ఈ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు

క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును (cryptocurrency bill) కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తూ.. అధికారిక క్రిప్టోకరెన్సీ విధివిధానాలను జారీ చేయనుంది. సాగు చట్టాలను రద్దు చేస్తూ మరో బిల్లును తీసుకురానుంది.

  • అతను మా విమానాన్ని కూల్చలేదు

2019లో బాలాకోట్​ ఉగ్రవాద శిబిరాలపై దాడుల సమయంలో భారత వైమానిక దళ(ఐఏఎఫ్​) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్(Abhinandan varthaman) పాకిస్థాన్​కు చెందిన ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని(Pak f 16 shot down) విజయవంతగా కూల్చివేశారు. అయితే... తాజాగా దీనిపై స్పందించిన పాక్ తమ విమానాన్ని భారత పైలట్ కూల్చలేదని ఆరోపించింది. 

  • బిగ్​బాస్​ హోస్ట్​గా హీరోయిన్..​?

 తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-5కు హోస్ట్‌గా నటి శ్రుతిహాసన్‌ వ్యవహరించనుందని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

20:51 November 23

టాప్​ న్యూస్​@ 9PM

  • కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రుల భేటీ

ధాన్యం సేకరణపై స్పష్టత కోసం దిల్లీలో ఉన్న మంత్రుల బృందం... ఆ దిశగా తమ కసరత్తు ముమ్మరం చేసింది.  కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్​తో...  మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. ఎంపీలు కూడా భేటీలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర అధికారులతో మంత్రుల బృందం చర్చిస్తోంది.

  •  ముగిసిన  గడువు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్లను పరీశీలిస్తారు. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్​ 10 ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు. 

  •  మూడో ముప్పు లేనట్టే!

భారత్​కు కరోనా మూడో దశ ముప్పు తొలగినట్లేనా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. హైబ్రిడ్ ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతున్నటు చెప్పారు. ఒకవేళ థర్డ్​ వేవ్ వచ్చినా రెండో దశ అంత తీవ్రస్థాయిలో మాత్రం ప్రభావం ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు(third wave in india).

  • కస్టమర్లకు షాక్.. ఛార్జీలు భారీగా పెంపు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన (Telecom news) టెలికాం ఆపరేటర్​ వొడాఫోన్​ ఐడియా (Vodafone idea) కూడా ఎయిర్​టెల్​ బాటలోనే పయనించింది. టారిఫ్​లను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది.

  •  చిక్కుల్లో బీసీసీఐ!

భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్​ బుధవారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేకమైన ఫుడ్ మెనూను రూపొందించింది బీసీసీఐ. అయితే ఈ మెనూలో హలాల్ మాంసానికి(halal meat india cricket) ప్రాధాన్యమివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

19:48 November 23

టాప్​ న్యూస్​@ 8PM

  •  రూ.144 కోట్లు అటాచ్‌.. ఎందుకంటే?

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ED attaches Assets in ESI Scam) కుంభకోణంలో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ వేగం పెంచింది.

  • ' ఆయన వచ్చేసరికి మొలకెత్తేలా ఉన్నాయ్​'

సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనపై సీఎల్పీ నేత భట్టి (Bhatti comments on kcr)విమర్శలు చేశారు. దిల్లీలో యుద్ధానికంటూ వెళ్తున్న కేసీఆర్​.. అమిత్​షాతో భేటీ అనంతరం యూ టర్న్​ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ యుద్ధం చేసి దిల్లీ నుంచి వచ్చే స​రికి రాష్ట్రంలో వడ్లన్నీ తడిచి మొలకలెత్తేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

  • 'కానీ ఆ చెత్త మాకెందుకు?'

Arvind Kejriwal News: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమ్​ ఆద్మీ పార్టీలోకి కనీసం 25 మంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ అన్నారు. అంతేగాకుండా మరో ఇద్దరు ఎంపీలు ఆప్​లోకి వచ్చేందుకు తమ నేతలతో టచ్​లో ఉన్నట్లు వెల్లడించారు.

  • ఆ స్టెప్పులకు ఎన్ని టేక్స్‌ అంటే?

Naatu Naatu song: 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని 'నాటు నాటు' పాట ఇటీవల విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ గీతంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. అయితే ఈ స్టెప్పులు వేయడానికి తామిద్దరూ ఎన్ని టేక్స్​ తీసుకున్నారో తెలిపారు తారక్​. దర్శకుడు రాజమౌళి(rajamouli RRR movie).. దేశం గర్వించదగ్గ దర్శకుడు అని ప్రశంసించారు.

  • అతనికి ఒక్క ఇన్నింగ్స్ చాలు!

కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానె. ఈ నేపథ్యంలో ఇతడికి మద్దతుగా నిలిచాడు మరో బ్యాటర్ పుజారా. రహానె ఫామ్​లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలని తెలిపాడు.

18:49 November 23

టాప్​ న్యూస్​@ 7PM

  • జూ పార్కులో యువకుడి హల్ చల్..!

హైదరాబాద్​లోని జూ పార్కులో యువకుడు హల్ చల్ చేశాడు. ఆఫ్రికన్ జాతి సింహం ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లిన యువకుడు హంగామా సృష్టించాడు. 

  •  పామును చేప మింగేసిందా?

సైజు పరంగా చూస్తే చేప చిన్నగా ఉంటుంది. పాము.. చేప కంటే చాలా పెద్దగా ఉంటుంది. అలాంటిది.. పామును చేప వేటాడడం ఎప్పుడైనా చూశారా? వేటాడి.. అమాంతం మింగడం(Fish swallows snake) గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం గనుక 'లేదు.. కాదు' అయినట్లైతే.. ఓసారి ఈ స్టోరీ చదివేయండి.

  • 'యూపీఏ పాలన ఆ బుక్​తో విస్పష్టం'

2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో(2008 mumbai attacks) యూపీఏ ప్రభుత్వ తీరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం(Manish tewari book).. భాజపా, కాంగ్రెస్​ల మధ్య పెను దుమారానికి దారి తీసింది. యూపీఏ ప్రభుత్వ తీరుపై భాజపా తీవ్రంగా మండిపడింది. ఈ పుస్తకం ద్వారా యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి రుజువైందని విమర్శించింది.

  •  పర్యాటకానికి 'భారత్​ గౌరవ్​'

(Indian Railways) సరకు, ప్రయాణికుల రవాణాకు మాత్రమే పరిమితమైన భారతీయ రైల్వే.. టూరిజం కోసం ప్రత్యేకంగా రైళ్లను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం సుమారు 190 రైళ్లను గుర్తించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ తెలిపారు. ఈ రైళ్లు భారత దేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • ' టీమిండియా​ లైనప్​లో లోపాలున్నాయి'

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్(IND vs NZ t20 series)​ను క్లీన్​స్వీప్ చేసింది టీమ్ఇండియా. ఈ విజయాన్ని కొనియాడుతూ కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు మాజీలు. తాజాగా ఇదే విషయమై స్పందించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్.. టీమ్ఇండియా బ్యాటింగ్​ లైనప్​లో కొన్ని లోపాలు ఉన్నాయని వెల్లడించాడు.

17:51 November 23

టాప్​ న్యూస్​@ 6PM

  • ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ 

ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణంలో రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.  మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ జప్తు చేసింది. 

  •  దక్షిణాసియాలోనే తొలిసారి

కర్ణాటకలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక వ్యవస్థతో కూడిన రోసెన్‌బర్‌ అగ్నిమాపక సిమ్యులేటర్‌ను ఏర్పాటుచేశారు. సిబ్బందికి శిక్షణ కోసం ఈ సిమ్యులేటర్‌ ఉపయోగిస్తున్నారు. దీంతో దక్షిణాసియాలోనే రోసెన్‌బర్‌ సిమ్యులేటర్‌ కల్గిన ఏకైన విమానాశ్రయంగా బెంగళూరు విమానాశ్రయం నిలిచింది(bangalore airport news).

  • వింత ఆకారంలో మేకపిల్ల 

కేరళ ఎర్నాకుళం జిల్లాలో వింత ఆకారంలో మేకపిల్ల జన్మించింది. వెలియన్నూర్ పంచాయతీకి చెందిన థామస్ ఇంట్లో పుట్టిన ఈ మేకపిల్లకు ముక్కు, ఓ కన్ను లేదు. 

  • చైతూ  ఫస్ట్​లుక్​..!

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో నాగచైతన్య 'థ్యాంక్యూ', శింబు 'మానాడు', సుమ 'జయమ్మ పంచాయతీ' చిత్రాల వివరాలు ఉన్నాయి.

  • 'ముగ్గురితో ఆడతాం'

బుధవారం నుంచి భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్(IND vs NZ Test Series) ప్రారంభంకానుంది. తాజాగా ఈ విషయమై స్పందించిన కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ పిచ్ పరిస్థితులను బట్టి జట్టులో మార్పులు చేస్తామని తెలిపాడు. అలాగే పలు విషయాలపై మాట్లాడాడు.

16:53 November 23

టాప్​ న్యూస్​@ 5PM

  • సుప్రీంకోర్టు ఎదుట చొక్కా విప్పిన జడ్జి 

సుప్రీంకోర్టు ఎదుట ఓ జిల్లా కోర్టు న్యాయమూర్తి వింతగా నిరసన తెలిపారు. తన చొక్కా విప్పి, అర్ధనగ్న ప్రదర్శనతో నిరసనకు దిగారు. ఓ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఇలా (District court judge protest at suprme court) చేసినట్లు తెలుస్తోంది.

  • కేంద్ర అధికారులతో మంత్రుల భేటీ

కేంద్ర వినియోగదారులశాఖ అధికారులతో తెరాస మంత్రులు(TRS Ministers Meeting) సమావేశమయ్యారు. ధాన్యం సేకరణ వ్యవహారంపై కేంద్ర అధికారులతో చర్చిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్​తో పాటు పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు.

  • మహిళపైకి దూసుకెళ్లిన బస్సు

చెన్నై వేలాచేరీ ప్రాంతంలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన జరిగింది. రోడ్డు దాటడానికి కూడలి వద్ద సైకిల్​తో నిలిచి ఉన్న మహిళపైకి ఓ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చింది.

  •  అందరి దృష్టి గోరింటాకుపైనే!

బాలీవుడ్​ ప్రేమజంట కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్(katrina kaif vicky kaushal marriage)​ పెళ్లి వచ్చే నెలలో రాజస్థాన్​లోని ఓ ప్రముఖ కోటలో జరగనుందని ప్రచారం సాగుతోంది. 

  •  టీమిండియా స్టార్ ప్లేయర్  దూరం.. అతడికే ఛాన్స్..!

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. ఇతడి స్థానంలో యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్​ను జట్టులోకి తీసుకున్నారు.

15:55 November 23

టాప్​ న్యూస్​@ 4PM

  • ముగిసిన నామినేషన్ల గడువు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

  •  'కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత'

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు(High Tension at rangareddy collectorate) నెలకొన్నాయి. తెరాస అభ్యర్థులు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి మంగళవారం నామ పత్రాలు సమర్పించగా... తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. 

  • 'ఆ సెక్స్ తీవ్ర నేరం కాదు'

పిల్లలతో ఓరల్ సెక్స్ తీవ్ర నేరం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఈ కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి శిక్షను 10 నుంచి 7 ఏళ్లకు తగ్గించింది(allahabad high court news).

  •  ఎన్టీఆర్​ షోలో ప్రిన్స్​..!​ 

 ఎన్టీఆర్​ వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న రియాల్టీ గేమ్​ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'లో సూపర్​స్టార్ మహేశ్​బాబు సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

  • నాకు అదే ముఖ్యం..!

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో భయం లేకుండా ఆడాలనుకుంటున్నట్లు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా(cheteshwar pujara news) వెల్లడించాడు. అలాగే రెండేళ్లకుపైగా శతకం సాధించకపోవడంపైనా స్పందించాడు.

14:35 November 23

టాప్​ న్యూస్​@ 3PM

  •  పోటెత్తిన వరద

కర్ణాటకలో భారీవర్షాల కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న కేంద్రీయ విహార్​ అపార్ట్​మెంట్​ను సీఎం బసవరాజ్​ బొమ్మై సందర్శించారు(karnataka rains). ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్​ షా తనకు ఫోన్ చేసి వరదలపై ఆరా తీశారని వెల్లడించారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

 

  • ఆ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం

AP high court on kondapalli municipal elections: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్ కమిషనర్​లను కోర్టుకు రావాలని ఆదేశించింది.

  • తమిళ స్టార్​పై పరువు నష్టం కేసు

తమిళ నటుడు సూర్యపై (case on suriya) వన్నియార్ సంఘం.. కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేసింది. 'జై భీమ్' సినిమాలో (Jai bhim movie ) ఉద్దేశపూర్వకంగా తమ వర్గాన్ని కించపరిచేలా చూపించారని తన ఫిర్యాదులో పేర్కొంది.

  •  ఛార్జీలు భారీగా పెంపు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన (Telecom news) టెలికాం ఆపరేటర్​ వొడాఫోన్​ ఐడియా (Vodafone idea) కూడా ఎయిర్​టెల్​ బాటలోనే పయనించింది. టారిఫ్​లను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది.

  • 'ఆ దిగ్గజం నన్ను రేప్ చేశాడు'


ఫుట్​బాల్ దిగ్గజం డీగో మారడోనాపై(Diego Maradona News) సంచలన ఆరోపణలు చేశారు క్యూబాకు చెందిన ఓ మహిళ. టీనేజ్​లో ఉన్నప్పుడే ఆమెపై డీగో అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

13:45 November 23

టాప్​ న్యూస్​@ 2PM

  • భార్యపై హత్యాచారం

హైదరాబాద్​లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌లో దారుణం (Rape And Murder) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సిద్ధమనుకున్న తర్వాత ముగ్గురు కలిసి మద్యం తాగారు.

  • రౌడీషీటర్‌ జాబితాలో ఎంపీటీసీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి పోలీసుల తీరుపై(MPTC photo as rowdy sheeter) విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎంపీటీసీ ఫొటోపై రౌడీషీటర్ అని రాసి.. నోటీస్ బోర్డులో పెట్టారని వ్యవహరిస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • మలాశయంలో ఇరుక్కున్న ​ స్ప్రేయర్

కిమ్స్​ ఆస్పత్రి వైద్యులకు ఓ వింత కేసు ఎదురైంది. ఓ వ్యక్తి మలాశయంలో టాయిలెట్​ జెట్​ స్ప్రే (Toilet jet spray pipe) ఇరుక్కొని ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అతడు అలాగే.. ఆ టాయిలెట్​ వాటర్​ పైప్​ను చేత్తో పట్టుకొని ఆస్పత్రికి చేరుకోగా.. తీవ్రంగా శ్రమించిన వైద్యులు ఆపరేషన్​ చేసి దాన్ని తొలగించారు.

  • హనుమ విహారి చేసిన తప్పేంటి?

న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​కు హనుమ విహారిని(Hanuma Vihari News) ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు చేశాడు. ఇండియా- ఏ తరఫున అతడిని దక్షిణాఫ్రికాకు పంపడమేంటని అన్నాడు. విహారి చేసిన తప్పేంటని ప్రశ్నించాడు.

  • తనను తలుచుకుంటే..

భార్య విరానికాను చూసిన క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుందని చెప్పారు హీరో మంచు విష్ణు. మంగళవారం ఆయన పుట్టిన రోజు (Manchu Vishnu Birthday). ఈ సందర్భంగా తన జీవిత భాగస్వామి గురించి విష్ణు చెప్పిన విశేషాలు.

12:55 November 23

టాప్​ న్యూస్​@ 1PM

  • ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులు

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు రాగా... వివరణ ఇవ్వాలని వెంకట్రామిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.

  • కర్నల్‌ సంతోశ్​బాబుకు 'మహావీరచక్ర' పురస్కారం

colonel Santosh Babu with Mahavir Chakra: చైనా సరిహద్దులోని గల్వాన్‌లో ప్రత్యర్థులతో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన కర్నల్ సంతోశ్ బాబుని.. కేంద్రం మహావీర చక్ర పురస్కారంతో సత్కరించింది. 

  • జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో భాజపా మెరుపు ధర్నా

High Tension in GHMC Head Office: హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

  • ఉపరాష్ట్రపతి కొత్త నివాసానికి లైన్ క్లియర్

కేంద్రం ప్రతిప్టాత్మకంగా చేపడుతున్న సెంట్రల్​ విస్టా (Central vista) ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఉపరాష్ట్రపతి కొత్త అధికారిక నివాస ప్రాంతాన్ని ఎందుకు మార్చారని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

  • మెరుగవుతున్న కైకాల ఆరోగ్యం

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలే అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. క్రమంగా కోలుకుంటున్నారని సమాచారం.

11:59 November 23

టాప్​ న్యూస్​@ 12PM

  • 2 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. నిర్మల, నాగేశ్వరరావు పేర్లను పీసీసీ అధిష్ఠానానికి పంపింది. మెదక్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల బరిలో దిగనున్నారు. ఖమ్మం నుంచి  రాయల నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.

  • భాజపా కార్పొరేటర్లు ఆందోళన

హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. మేయర్ ఛాంబర్‌కు వెళ్లేందుకు యత్నించగా... పోలీసులు  అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

  • 'తల్లి'డిల్లిన మాతృహృదయం

మనుషులైనా, జంతువులైనా.. తల్లీబిడ్డల అనుబంధం ఒకేలా ఉంటుంది. తల్లి కోసం బిడ్డ.. బిడ్డ కోసం తల్లి పడే తపన ఎక్కడైనా ఒకటే. తమిళనాడు (Tamil nadu news) చెన్నైలో మాతృత్వానికి అద్దం పట్టే ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

  • ఉగ్రవాదుల దాడి- 20మంది మృతి!

తూర్పు కాంగో ఇటురి రాష్ట్రంలోని రెండు గ్రామాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పునరావాస శిబిరాలే లక్ష్యంగా తుపాకుల మోత మోగించారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మృతి చెందారని సైన్యం తెలిపింది. స్థానిక అధికారులు, కివు సెక్యూరిటీ ట్రాకర్​ మాత్రం మృతుల సంఖ్య 29 వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే ముందుగా 107 మంది మృతి చెంది ఉంటారని పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత సంఖ్యను సవరించింది.

  • ఎయిర్​టెల్​కు పెరిగారు!

సెప్టెంబరు నెలలో జియో సంస్థ(reliance jio) 1.9 లక్షల మంది​ యూజర్లను కోల్పోయినట్లు ట్రాయ్​ వెల్లడించింది. అదే నెలలో పోటీదారైన ఎయిర్​టెల్​కు 2.74 లక్షల మంది కొత్త యూజర్లు పెరగగా.. ఐడియా 10.7 లక్షల సబ్​స్క్రైబర్స్​ను కోల్పోయినట్లు పేర్కొంది.

10:53 November 23

టాప్​ న్యూస్​@ 11AM

  • మసాజ్, స్పా సెంటర్లపై ​దాడులు

Raids on Spa Centers Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో టాస్క్​ఫోర్స్ మసాజ్, స్పా సెంటర్లపై దాడులు చేసింది. 13 మందిని అరెస్టు చేసి.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లకు తరలించారు. మసాజ్, స్పా సెంటర్లను సీజ్ చేశారు.

  • 45 మంది సజీవదహనం!

బల్గేరియాలో (Bulgaria accident news) ఘోర ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రులకు తరలించారు. 

  • మరో 4 రోజులు భారీ వర్షాలు

తమిళనాడును (Rains in chennai) కొద్దిరోజులుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలు ఇప్పటికీ తేరుకోలేదు. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • బంగారం ధర-ఏపీ, తెలంగాణలో ఇలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర మంగళవారం భారీగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.900 దిగొచ్చింది. వెండి ధర కిలోకు రూ.1,090 తగ్గి.. రూ.66,760కు చేరుకుంది.

  • 'బంగార్రాజు' టీజర్ వచ్చేసింది

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బంగార్రాజు'(nagarjuna bangarraju). మంగళవారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా టీజర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. నాగచైతన్య లుక్స్​, బుల్లెట్​పై వెళ్లే సీన్స్​ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కుతోంది.

09:49 November 23

టాప్​ న్యూస్​@ 10AM

  • గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు

అందరు హాయిగా నిద్రపోతున్న సమయంలో ఓ ఇంట్లో గ్యాస్​ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నానక్​రామాగూడాలోని హనుమాన్ దేవాలయం దగ్గర్లోని ఓ ఇంట్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు గ్యాస్​ సిలిండర్ పేలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 11 మంది గాయపడ్డారు. 

  • భారత్​లో కరోనా తగ్గుముఖం

భారత్​లో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 7,579 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 236 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.

  • ఆ ప్రాంతాల్లో బాబు పర్యటన

Chandrababu Kadapa Tour news : నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీలోని వరద ముంపు ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు కడప, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగనుంది. రేపు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.

  • నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు​

భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ ​మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా నష్టంతో.. 58,358 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 17,404 వద్ద కొనసాగుతోంది.

  • ఈ వారం చిత్రాలివే!

ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తన్న విక్టరీ వెంకటేశ్ 'దృశ్యం 2' సినిమా ఈ వారమే విడుదలకానుంది. ఇక సూపర్​ స్టార్ రజనీ కాంత్ నటించిన పెద్దన్న ఇదివరకే థియేటర్లలో సందడి చేయగా, ఈ వారం ఓటీటీలోకి రానుంది. దాంతో పాటు సల్మాన్​ ఖాన్, రాజ్​ తరుణ్ వంటి హీరోల కొత్త చిత్రాలతో పాటు ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఏంటో చూడండి.

08:49 November 23

టాప్​ న్యూస్​@ 9AM

  • సాయం చేయాలనుకుంటున్నారా..!

మీరు చదువుకున్న స్కూల్​కు మీ వంతు సాయం చేయాలనుకుంటున్నారు. కానీ మీరు సుదూర ప్రాంతాల్లో లేదా విదేశాల్లో ఉన్నందువల్ల సాయం చేయడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు మీ పాఠశాలకు మధ్య వారధిగా నిలిచి.. మీ సాయాన్ని స్కూల్​కు చేర్చేందుకు దోహదపడుతుంది కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన విద్యాంజలి పథకం. ఈ పథకం ద్వారా కేవలం మీరే కాదు.. పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలకు.. స్కూళ్లకు మధ్య వారధిగా నిలుస్తోంది.

  • పిల్లలకు కరోనా టీకా

వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు టీకా పంపిణీ(Covid vaccine for kids) ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్దలకు బూస్టర్‌ డోసులపైనా రెండు వారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • ఐదుగురు దుర్మరణం

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వంతెనపై అదుపు తప్పిన కారు.. 100 మీ. లోతులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • సారథీ నీపైనే ఆశలు

టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ గెలిచి పదేళ్లు దాటిపోయింది.. అదే టీ20 ప్రపంచకప్‌ అయితే ఏకంగా 14 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకూ మరో కప్పును ముద్దాడలేకపోయింది. ఈ ఏడాది పొట్టి కప్పును పట్టేస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. 

  • ఈ 'షో' కోసం ఎదురుచూపులు!

ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ మరికొన్ని రోజుల్లో ప్రసారంకానుంది. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం 'ఆలీతో సరదాగా' షోలో (alitho saradaga latest episode) సందడి చేయనున్నారు. ఆయన పంచుకున్న విశేషాలేంటో తెలియాలంటే నవంబర్​ 29న ప్రసారమయ్యే కార్యక్రమం చూడాల్సిందదే.

07:50 November 23

టాప్​ న్యూస్​@ 8AM

  • పిల్లలకు కరోనా టీకా ఎప్పుడంటే?

వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు టీకా పంపిణీ(Covid vaccine for kids) ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్దలకు బూస్టర్‌ డోసులపైనా రెండు వారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • విస్తరిస్తున్న జికా వైరస్‌

దేశం.. ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటుండగా.. పలుచోట్ల జికావైరస్ కేసులు నమోదవడం ​కలవరపాటుకు గురిచేస్తుంది. తొలుత కేరళలో బయటపడిన జికా కేసులు.. తర్వాత మహారాష్ట్ర, ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​లో బాధితులు పెరుగుతుండటం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్​ వ్యాప్తికి ముందే అడ్డుకట్ట వేయకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • ఇక ఆఫీస్​కు రండి

కొవిడ్ (Covid) వల్ల పూర్తిస్థాయిలో ఇంటి నుంచే పనికి పరిమితమైన ఐటీ ఉద్యోగులు (IT Employees) ... ఇకపై కార్యాలయాలకు రావాల్సిందిగా యాజమాన్యాలు సంకేతాలు అందిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కాకుండా... ఉద్యోగులపై ఒత్తిడి తేకుండా చూడాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకోసం హైబ్రిడ్ మోడళ్లను అమలు చేస్తూ పరిమిత సంఖ్యలో సిబ్బందిని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక ప్రాజెక్టులపై పనిచేసే ఉద్యోగులను తప్పనిసరిగా కార్యాలయాలకు రావాల్సిందిగా... యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

  • సింధు ఈసారైనా..

ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ(Indonesia Open 2021) నేటి(నవంబర్ 23) నుంచే ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయిన సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది.

  • వెంకటేశ్​కు రేచీకటి

తనదైన శైలి కామెడీతో కడుపుబ్బా నవ్వించే దర్శకుడు అనిల్ రావివూడి. 'ఎఫ్​3'తో (Anil Ravipudi F3) మరోసారి సందడి చేయడానికి వస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎఫ్​3 విశేషాలతో పాటు బాలయ్యతో (Anil Ravipudi Balakrishna) చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో పంచుకున్నారాయన.

06:55 November 23

టాప్​ న్యూస్​@ 7AM

  • ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

TRS MLC Candidates list 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. ఎన్నికలు జరిగే 12 స్థానాలకు గులాబీ బాస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత మరోసారి శాసనమండలికి పోటీ చేసేందుకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. బండా ప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభకు వెళతారనే ప్రచారం సాగినా.. ఆమెను శాసనమండలికి పంపడానికే సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపారు.

  • ఐస్​క్రీమ్​ బాల్​ బాంబు పేలుడు

ఐస్​క్రీమ్​ బాల్​ పేలి ఓ 12 ఏళ్ల బాలుడు గాయపడిన ఘటన కేరళలోని కన్నుర్​ జిల్లాలో చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలు ఉన్న ఆ ఐస్​క్రీమ్​ బాల్​తో బాలుడు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో చుట్టుపక్కల వారు ఎవరూ గాయపడలేదని తెలిపారు. గాయపడిన బాలుడు నారివయల్​కు చెందిన శ్రీవర్ధన్​గా అధికారులు గుర్తించారు.

  • ఎక్కడికంటే అక్కడికి రాలేం

క్యాబ్‌ (Cab Rides) బుక్‌ చేసుకుంటే చాలు ఎక్కడికైనా ఇట్టే వెళ్లిపోవచ్చనే భరోసా ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. యాప్‌ ద్వారా బుక్‌ చేస్తే... కాసేపటికే ‘సర్‌ ఎక్కడికి వెళ్లాలి?’ అంటూ డ్రైవర్‌ నుంచి ఫోన్‌ కాల్‌. వెళ్లాల్సిన ప్రాంతం చెప్పాక క్యాబ్‌ వస్తుందో, క్యాన్సిల్‌ అవుతుందో తెలియదు. హైదరాబాద్‌లోనే నిత్యం 20-25 వేల రైడ్లు రద్దవుతున్నట్లు అంచనా. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులున్నాయి.

  • త్వరలో కొత్త బిల్లుతో వస్తాం

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని పీటీఐ(Amaravati capital news) వార్తా సంస్థ వెల్లడించింది. వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని శాసనసభలో ఏపీ సీఎం జగన్ ప్రకటించినట్లు పీటీఐ తెలిపింది. రాష్ట్ర విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే జగన్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఈ చట్టం స్థానంలో కొత్త బిల్లు ప్రవేశపెడతామని సీఎం ప్రకటించినట్లు తెలిపింది.

  • రహానేకు ఇది సువర్ణావకాశం

త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ అజింక్యా రహానే(ajinkya rahane newsకు ఓ సువర్ణావకాశమని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.

04:39 November 23

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • కేంద్రం వైఖరేంటో

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో తెలుసుకోవాలని (Cm Kcr on Paddy Purchase), ఆ విషయం తేల్చుకున్నాకే... ఇతర అంశాలపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు, సీతారామ, ఇతర ప్రాజెక్టులకు వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతుల విషయమై జల్‌శక్తి, పర్యావరణ శాఖల అధికారులను కలిసి వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని ఎంపీలకు ఆయన సూచించారు.

  • ధరణి సమస్యల పరిష్కరించేలా..

ధరణి పోర్టల్‌కి (Dharani Portal) చెందిన సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరించేలా... ప్రభుత్వ కసరత్తు వేగవంతం అవుతోంది. వివిధ సమస్యల పరిష్కారం కోసం మాడ్యూల్స్ రూపొందించాలని ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం... వాటిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. రేపు మరోమారు సమావేశం కానున్న ఉపసంఘం... సమస్యల పరిష్కారం, అవగాహన కోసం కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది.

  • ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు తెరాస అభ్యర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్​, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస తరపున మాత్రమే అభ్యర్థులు నామినేషన్ వేయడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.

  • క్యాబ్‌డ్రైవర్ల అనాసక్తి

హైదరాబాద్​లో రోజూ 20-25 వేల క్యాబ్ రైడ్లు (Cab Rides) రద్దవుతున్నట్లు అంచనా. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులున్నాయి.

  • ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్

రాష్ట్రంలో నాలుగైదు చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యనాయకులతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి...ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

  • ఐస్​క్రీమ్​ బాల్​ బాంబు పేలి

ఐస్​క్రీమ్​ బాల్​ పేలిన ఘటనలో ఓ బాలుడు గాయపడ్డాడు. బంతి అనుకుని పేలుడు పదార్థాలు ఉన్న ఈ ఐస్​క్రీమ్​ బాల్​తో ఆడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • డ్రైవర్​ ఇంట్లో భోజనం

సామాన్యుడిగా మారి.. పంజాబ్​ లుథియానాలో పర్యటించారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్(kejriwal auto rickshaw)​. ఓ ఆటో ఎక్కి నగర విధుల్లో తిరిగారు. అనంతరం ఆ ఆటో డ్రైవర్​ ఇంట్లో భోజనం చేశారు. సీఎం తమ ఇంట్లో భోజనం చేయడంపై ఆటో డ్రైవర్​ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

  • పాక్​ గ్రీన్​ సిగ్నల్

పాక్​ మీదుగా అఫ్గానిస్థాన్​కు భారత్​ అందించే గోధుమల తరలింపునకు (India Afghanistan News) ఇమ్రాన్​ ఖాన్ ప్రభుత్వం అనుమతించింది. అఫ్గాన్​కు సాయంగా 50వేల మెట్రిక్​ టన్నుల గోధుమలను అందిస్తున్నట్లు గతనెల భారత్​ ప్రకటించింది.

  • అమ్మాయిల కలల రాకుమారుడు!

అక్కినేని వారసుడిగా తనదైన నటనతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు హీరో నాగచైతన్య. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

  • శ్రేయస్ మ్యాజిక్

తన మ్యాజిక్​తో మరోసారి టీమ్ఇండియా ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేశాడు యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. కార్డ్ ట్రిక్​(shreyas iyer magic video)తో పేసర్ సిరాజ్​ను అవాక్కయ్యేలా చేశాడు.



 

Last Updated : Nov 23, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.