ETV Bharat / bharat

పిల్లలతో ఓరల్​ సెక్స్ తీవ్ర నేరం కాదు- హైకోర్టు తీర్పు

author img

By

Published : Nov 23, 2021, 3:17 PM IST

allahabad high court, అలహాబాద్​ హైకోర్టు
పిల్లలతో ఓరల్​ సెక్స్ తీవ్ర నేరం కాదు- హైకోర్టు తీర్పు

పిల్లలతో ఓరల్ సెక్స్ తీవ్ర నేరం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఈ కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి శిక్షను 10 నుంచి 7 ఏళ్లకు తగ్గించింది(allahabad high court news).

చిన్నారులతో ఓరల్​ సెక్స్​ను తీవ్ర నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సెషన్స్ కోర్టు దోషికి విధించిన 10ఏళ్ల జైలు శిక్షను 7 ఏళ్లకు తగ్గించింది. శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. అయితే ఇలాంటి నేరాలు శిక్షార్హమేనని హైకోర్టు స్పష్టం చేసింది(allahabad high court news).

బాలుడితో ఓరల్​ సెక్స్ చేసిన ఓ వ్యక్తిని దోషిగా తేల్చి పోక్సో చట్టంలోని సెక్షన్​ 6, 10 ప్రకారం 10ఏళ్ల జైలు శిక్ష విధించింది సెషన్స్ కోర్టు. ఈ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. దీన్ని విచారించిన ధర్మాసనం ఓరల్​ సెక్స్ నేరమే కానీ, తీవ్ర లైంగిక నేరం కాదని పేర్కొంది. దీనికి పోక్సో చట్టంలోని సెక్షన్​ 4 వర్తిస్తుందని, సెక్షన్​ 6, 10 వర్తించవని చెప్పింది(allahabad high court judgement).

ఈ కేసు వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడి ఇంటికి దోషి వెళ్లాడు. అతని కుమారుడిని బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలుడికి రూ.20 ఇచ్చి ఓరల్ సెక్స్ చేశాడు.

ఇదీ చదవండి: మలాశయంలో ఇరుక్కున్న టాయిలెట్​ స్ప్రేయర్​​- చివరకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.