వింత ఆకారంలో మేకపిల్ల జననం- ఒకటే కన్నుతో..

By

Published : Nov 23, 2021, 5:25 PM IST

thumbnail

కేరళ ఎర్నాకుళం జిల్లాలో వింత ఆకారంలో మేకపిల్ల జన్మించింది. వెలియన్నూర్ పంచాయతీకి చెందిన థామస్ ఇంట్లో పుట్టిన ఈ మేకపిల్లకు ముక్కు, ఓ కన్ను లేదు. ముక్కు స్థానంలో ఒక రంధ్రం మాత్రమే ఉంది. దాని నుంచే ఆ మేకపిల్ల శ్వాస తీసుకుంటోంది. నుదురు, నాలుక ముందుకు పొడుచుకు వచ్చాయి. తల్లి మేక నుంచి పాలు తాగలేకపోవడం వల్ల బాటిల్​ను ఉపయోగిస్తున్నట్టు యజమాని తెలిపారు. దాని అరుపులు మానవ శిశువును పోలి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ మేకపిల్లను చూడటానికి జనం గుంపులుగా ఎగబడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.