MLC elections in telangana: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

author img

By

Published : Nov 23, 2021, 3:00 PM IST

Updated : Nov 23, 2021, 5:24 PM IST

Local Bodies Quota MLC Elections, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

14:45 November 23

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

mlc kavitha
మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్​ గోవర్ధన్​రెడ్డితో కలిసి నామపత్రాలు సమర్పిస్తున్న కవిత

MLC elections in telangana:స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్లను పరీశీలిస్తారు. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్​ 10 ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు.  

MLC elections nominations:ఇక అధికార తెరాస తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు నిన్న, ఇవాళ నామపత్రాలు దాఖలు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత తరఫున మరో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో గెలుపొందిన కవిత మరోసారి పోటీ చేయనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు మరోసారి అవకాశమిచ్చిన పార్టీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన కవిత.. తన ఎన్నిక కోసం స్థానిక సంస్థల సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు భానుప్రసాద్, ఎల్‌.రమణ నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీమేయర్​ రవీందర్​ సింగ్​ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దండె విఠల్‌ నామినేషన్‌ వేశారు. ఆపార్టీ తరఫున అనూహ్యంగా అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న ఆయన.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్‌, రాఠోడ్‌ బాపూరావులతో కలిసి ఆదిలాబాద్‌లో తొలి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన తరఫున ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, మంచిర్యాల జడ్పీ ఛైర్​పర్సన్​​ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వేర్వేరుగా మరో మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెరాసకు సంపూర్ణమైన బలం ఉన్నందున ఎమ్మెల్సీ విజయం ఇప్పటికే ఖాయమైందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. శాసనమండలిలో స్థానిక సంస్థల వాణిని బలంగా వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి  విఠల్‌ చెప్పారు. 

సోమవారం నామపత్రాలు సమర్పించిన అభ్యర్థులు

రంగారెడ్డి కలెక్టరేట్​లో శంభీపూర్ రాజు, మహేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి, తెరాస ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వరంగల్ కలెక్టరేట్​లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు నామపత్రాలు సమర్పించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా... ఆయన తరఫున మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్​తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లను వేశారు. అనంతరం జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, ఛైర్​పర్సన్లు గండ్ర జ్యోతి ఒక సెట్, ప్రభుత్వ చీఫ్​విప్​ దాస్యం వినయ్​ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​లు మరో సెట్ చొప్పున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరఫున నామినేషన్లు వేశారు. ఖమ్మం స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెరాస అభ్యర్థి తాతా మధు తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్​తోపాటు తెరాస ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్​కు నామపత్రాలు అందజేశారు.  

Local Bodies Quota MLC Elections:ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భాజపా ఎన్నికలకు దూరంగా ఉండగా.. కాంగ్రెస్​ కేవలం 2 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఖమ్మం, మెదక్​ స్థానాల్లోనే కాంగ్రెస్​ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మంలో ఆ పార్టీ తరఫున నాగేశ్వరరావు, మెదక్​లో నిర్మల నామపత్రాలు సమర్పించారు. ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధ నామపత్రాలు సమర్పించారు. 

ఇదీచూడండి: TS MLC elections 2021: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ

Last Updated :Nov 23, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.