stock market live: కోలుకుంటున్న సూచీలు- సెన్సెక్స్ 200 ప్లస్
Updated on: Nov 23, 2021, 1:42 PM IST

stock market live: కోలుకుంటున్న సూచీలు- సెన్సెక్స్ 200 ప్లస్
Updated on: Nov 23, 2021, 1:42 PM IST
13:38 November 23
లాభాల్లోకి..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 250 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 58 వేల 700 ఎగువన ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో.. 17 వేల 520 వద్ద ఉంది.
లాభనష్టాల్లో..
జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అత్యధికంగా లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి.
ఇవాళ ఆరంభ ట్రేడింగ్‌లో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పతనమై కూడా తిరిగి పుంజుకోవడం విశేషం.
12:02 November 23
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా తగ్గి.. 58,411 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 17,421 వద్ద కొనసాగుతోంది.
09:46 November 23
భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా నష్టంతో.. 58,358 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 17,404 వద్ద కొనసాగుతోంది.
08:55 November 23
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో సూచీలు డీలా పడ్డాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్లకుపైగా తగ్గి.. 57,865 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయి 17,256 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30సూచీలో టాటాస్టీల్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. మిగిలినవి నష్టాల్లో కొనసాగుతున్నాయి.
