ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

author img

By

Published : Sep 26, 2021, 5:58 AM IST

Updated : Sep 26, 2021, 9:56 PM IST

etv bharat latest top news
etv bharat latest top news

21:50 September 26

టాప్​ న్యూస్​ @10PM

  • గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభం..

గులాబ్‌ తుపాను(Tropical Cyclone Gulab) తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) వెల్లడించింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది.

  • 'గులాబ్​'పై అప్రమత్తం..

తెలంగాణకూ 'గులాబ్‌' ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ సోమేశ్​కుమార్ కలెక్టర్లు,​ సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు.

  • ఉప్పుడు బియ్యం కొనండి..

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యే ఉప్పుడు బియ్యం కొనుగోలుపై చర్చిస్తున్నారు. బియ్యం కొనుగోలు అసాధ్యమని ఇటీవల కేంద్రం సమాచారమిచ్చిన కేంద్రం.. బియ్యం నిల్వలు ఇప్పటికే ఉన్నాయని వెల్లడించింది. 

  • ఆటపాటలతో హోరెత్తిన ట్యాంక్‌బండ్‌..

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సన్‌డే-ఫన్‌డే (Tank Bund Sunday Funday) ఈసారి కూడా సందడిగా సాగింది. ఆటపాటలతో నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించింది. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా... ఆర్పీఎఫ్‌ బ్యాండ్‌మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • సినీ పరిశ్రమకు వాళ్ల మద్దతు అవసరం..

సాయిధరమ్​తేజ్​ నటించిన రిపబ్లిక్​ సినిమా ప్రీరిలీజ్​ వేడుక(republic movie pre release event)లో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు(pawan kalyan speech latest) ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మా ఎన్నికల(maa elections 2021) అంశం రసవత్తరంగా సాగుతున్న సమయంలో.. పవన్​ కామెంట్లు పెద్ద చర్చకే తెరతీశాయి.

20:52 September 26

టాప్​ న్యూస్​ @9PM

  • ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయండి..

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యే ఉప్పుడు బియ్యం కొనుగోలుపై చర్చిస్తున్నారు. బియ్యం కొనుగోలు అసాధ్యమని ఇటీవల కేంద్రం సమాచారమిచ్చిన కేంద్రం.. బియ్యం నిల్వలు ఇప్పటికే ఉన్నాయని వెల్లడించింది.

  • 'గులాబ్​'పై అప్రమత్తం..

తెలంగాణకూ 'గులాబ్‌' ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ సోమేశ్​కుమార్ కలెక్టర్లు,​ సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు.

  • కట్టలు తెంచుకున్న ఆగ్రహం..

అప్పగింతలప్పుడు పెట్టుకున్న కన్నీటి చారలు ఆరకముందే.. ఆ తల్లిదండ్రులకు కంటికేడు దారలు పడ్డాయి. మంచిగా చూసుకొమ్మని అప్పజెప్పిన అల్లుడే అమ్మాయి పాలిట యముడయ్యాడని తెలిసి.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెళ్లి చేసి పంపిన నెల రోజులకే అమ్మానాన్నలకు కడుపుకోత మిగిల్చిన ఆ మెట్టినింటిపై గ్రామస్థులు, బంధువులు.. దాడికి దిగారు. పోలీసులు, ఆందోళనకారులు, వాగ్వాదం, తోపులాట, రాళ్లదాడితో.. ఉద్రిక్త వాతావరణమే ఏర్పడింది.

  • మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం..

న్యాయవ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

  • బాలీవుడ్​ జోరు..

చిత్రీకరణలు పూర్తిచేసుకున్నా ఎన్నో నెలలుగా విడుదల నోచుకుని పలు బాలీవుడ్​ చిత్రాలు రిలీజ్​ డేట్​లను ఖరారు చేసుకున్నాయి. అందులో స్టార్​ హీరోల చిత్రాలు ఉన్నాయి. అవేంటంటే..

19:53 September 26

టాప్​ న్యూస్​ @8PM

  • గులాబ్​ గుబులు..

గులాబ్‌ తుపాను(Tropical Cyclone Gulab) తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) వెల్లడించింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది.

  • సామాన్యులు ఆగమాగం..

హుజూరాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు (Minister Harish Rao), మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా నాయకులపై (Harish Rao Comments on Bjp) విమర్శలు గుప్పించారు.

  • ఏపీ సీఎం జగన్​తో మాట్లాడిన ప్రధాని..

తూర్పుమధ్య బంగాళాఖాతం నుంచి తీరంవైపు దూసుకొస్తున్న గులాబ్‌ తుపాను గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. తీర ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని ట్వీట్​ చేశారు.

  • వణికిస్తున్న గులాబ్ తుపాను..

గులాబ్​ తుపాను ఒడిశాలోని తీరప్రాంత జిల్లాలను వణికిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తుపాను తీరందాటే ప్రక్రియ మొదలైనందున.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 1600మందిని సురక్షిత కేంద్రాలకు తరలించింది.

  • కోల్​కతాపై సీఎస్కే ఘన విజయం..

కోల్​కతా నైట్​ రైడర్స్​తో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్​లో చైన్నై సూపర్​ కింగ్స్​ విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

18:50 September 26

టాప్​ న్యూస్​ @7PM

  • ఆ భూముల వేలం వాయిదా..

హైదరాబాద్​లో రేపు, ఎల్లుండి జరగాల్సిన పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కోర్టు కేసుల నేపథ్యంలో వేలాన్ని వాయిదా వేసినట్లు టీఎస్‌ఐఐసీ ప్రకటించింది. కొనుగోలుదారులకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.

  • రిమ్స్​లో ఏం జరుగుతోంది..?

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి (Adilabad Rims) అపవాదు మూటకట్టుకుంటోంది. కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఉత్తర తెలంగాణలో పేరుగాంచిన రిమ్స్ ఆసుపత్రి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. విధుల పట్ల వైద్యుల నిర్లక్ష్యం, రోగుల పట్ల ఉదాసీనతకు ఆదిలాబాద్ రిమ్స్ నిలువటద్దంలా మారుతోంది. ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలకు గ్యారంటీ లేదని స్థానికులు వాపోతున్నారు. అసలు ఆదిలాబాద్ రిమ్స్​లో ఏం జరుగుతోంది అనే అంశంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

  • యూపీలో కేబినెట్ విస్తరణ..

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా.. రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది. (UP Cabinet Expansion News) ఓటర్లపై ప్రభావం చూపే కీలక నేతలకు కేబినెట్​లో స్థానం కల్పించింది.

  • ఫిక్స్​డ్ డిపాజిట్​కు ఏది బెస్ట్?

రిస్క్​లేని పెట్టుబడి సాధనాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫిక్స్​డ్​ డిపాజిట్​. బ్యాంకులే కాదు.. పోస్టాఫీస్​లో కూడా ఎఫ్​డీ చేసుకునేందుకు వీలుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ, పోస్టాఫీస్ ఎఫ్​డీ.. వేటికి వడ్డీ రేట్లు అధికం? (Bank FD vs post office FD) ఎందులో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.

  • సినిమా అప్​డేట్స్​..

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్​, విజయ్​ దేవరకొండ, సిద్ధార్థ్‌​ చిత్రాల వివరాలు ఉన్నాయి.

17:50 September 26

టాప్​ న్యూస్​ @6PM

  • పంజాబ్​లో కొత్త మంత్రివర్గం..

పంజాబ్​లో నూతన మంత్రివర్గం (Punjab Cabinet) ప్రమాణస్వీకారం చేసింది. అమరీందర్ సింగ్​ ప్రభుత్వంలోని కొందరు మంత్రుల్ని తప్పించగా.. వారు అసంతృప్తి వెళ్లగక్కారు. (Punjab Cabinet news)

  • నిరుద్యోగ భృతి కోసం భారీ సభ..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ(Zahirabad Lok Sabha constituency) స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెరాస సర్కారుపై నేతలు విమర్శలు గుప్పించారు. భాజపాయేతర ముఖ్యమంత్రిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్న ప్రధాని మోదీ తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR)​పై మాత్రం ఒక కేసు నమోదు చేయకపోవడం విడ్డూరమని మాణికం ఠాగుర్(manickam tagore) అన్నారు.

  • ప్రజల కోసమే భారత్​ బంద్​..

అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్​ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ప్రజల కోసం చేస్తున్న ఈ బంద్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బంద్​కు తెతెదేపా పూర్తి స్థాయిలో మద్దతిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన స్పష్టం చేశారు.

  • దమ్ముంటే వారిని తిట్టాలి..

ఏపీ ముఖ్యమంత్రి జగన్​పై విషం చిమ్మేందుకే పవన్‌కల్యాణ్​ అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సినీ పరిశ్రమ గురించి పవన్ నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. సాయిధరమ్ తేజ్‌ రోడ్డుప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటని నిలదీశారు. తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసిందన్నారు. పవన్​కల్యాణ్​కు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, సీఎం కేసీఆర్‌ను తిట్టాలన్నారు.

  • 'మా' ఎన్నికల నామినేషన్​కు అంతా రెడీ..

గతకొన్ని రోజుల నుంచి చర్చనీయాంశమైన 'మా' ఎన్నికల(maa elections 2021) నామినేషన్​కు అంతా సిద్ధమైంది. దాదాపు రెండు రోజుల పాటు దీనికి అవకాశముంది. అధ్యక్ష బరిలో ముగ్గురు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

16:49 September 26

టాప్​ న్యూస్​ @5PM

  • నక్సల్స్ కట్టడికి కేంద్రం భారీ స్కెచ్​..

నక్సల్స్​పై పోరును తీవ్రతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వారికి నిధుల ప్రవాహాన్ని అడ్డుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఆదివారం.. వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో షా.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

  • బీసీ కమిషన్ ఆదేశాలు అమలుచేయాలి..

వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీసీ జాతీయ కమిషన్ ఛైర్మన్ భగవాన్​లాల్‌ సహానీ పాల్గొని ప్రసంగించారు. సదస్సులో తమిళిసై తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

  • ప్రోటోకాల్​ వివాదం..

ముషీరాబాద్​ నియోజకవర్గంలో తెరాస, భాజపా నాయకుల మధ్య వివాదం రేగింది. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం (Protocol conflict) చెలరేగింది.

  • మాకు ఏ హీరో అయినా ఒకటే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. పవన్ కోసం ప్రభుత్వం ఇండస్ట్రీని భయపెట్టలా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ హీరో సినిమా అయినా ఒకటే అని స్పష్టం చేశారు.

  • పవన్​కు మద్దతుగా నాని..

'రిపబ్లిక్'​(republic movie pre release event) సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన పవన్​కల్యాణ్​.. చిత్రపరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన హీరో నాని.. పవన్​ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చిత్రపరిశ్రమపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

15:52 September 26

టాప్​ న్యూస్​ @4PM

  • టూర్​ సక్సెస్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల అమెరికా పర్యటన (Modi in USA) ఫలప్రదంగా సాగింది. ఆదివారం.. భారత్​కు చేరుకున్న ఆయనకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో (Modi visit to US) భాగంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో పాటు క్వాడ్​ సదస్సులో (Quad summit) పాల్గొన్నారు మోదీ. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ (Biden news) సహా వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు.

  • దొడ్డు వడ్ల సంగతి తేల్చుకునే..

సీఎం కేసీఆర్​ హయాంలో రాష్ట్ర వ్యవసాయం వృద్ధి సాధించిందని మంత్రి హరీశ్ ​రావు(Harish rao) అన్నారు. కానీ రాష్ట్రం పండించిన పంటలు కొనే బాధ్యత కేంద్రానిదే అని పేర్కొన్నారు. దొడ్డు వడ్ల సంగతి తేల్చుకునే కేసీఆర్(cm kcr) దిల్లీ నుంచి వస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా పాలమాకులలో పర్యటించిన హరీశ్​.. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

  • మా సినిమా చాలా పెద్దగుంటది..

తెలంగాణ భాజపా నాయకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Armoor Mla Jeevan Reddy). వాళ్లంతా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆరోపించారు.

  • 'కోడి పుంజు'కు పుట్టినరోజు వేడుకలు..

మంసాహార ప్రియులకు కోడి కనిపిస్తే.. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనుకుంటారు! కానీ కొందరు జంతుప్రేమికులు మాత్రం వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అలాంటి ఓ కుటుంబం.. వారు పెంచుకుంటున్న కోడికి ఏకంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ పద్ధతిలో ఇంటిని అలంకరించి.. దానికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించింది.

  • చిరు ఓటు నాకే..

'మా' ఎన్నికల్లో(MAA Elections 2021) మెగాస్టార్​ చిరంజీవి తనకే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నటుడు మంచు విష్ణు(Manchu Vishnu Panel For MAA). నామినేషన్‌ వేసిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించి చిరును కలుస్తానని చెప్పారు.

14:39 September 26

టాప్​ న్యూస్​ @3PM

  • ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు..

తెలంగాణలోనూ ‘గులాబ్‌’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను కేంద్రీకృతమైంది. గోపాల్‌పూర్‌కు 180, కళింగపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనున్నట్లు తెలిపింది.

  • పవన్​ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?

సినిమా టికెట్ల విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(bosta sathyanarayana comments on pawan kalyan) చేసిన వ్యాఖ్యల​పై ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(minister bosta sathyanarayana) మండిపడ్డారు.

  • పడిపోయిన బైడెన్​ గ్రాఫ్​..

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది కాలంలోనే జో బైడెన్​పై(joe biden news today ) ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. గడిచిన రెండు నెలల్లో ఆయన గ్రాఫ్​ ఘోరంగా పడిపోయింది. ప్యూ పరిశోధన కేంద్ర విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం(pew research center report).. బైడన్​ పాలనకు 44 శాతం మాత్రమే మద్దతు పలికారు.

  • అమ్మాయిలు గెలిచారు..

మూడో వన్డేలో ఆసీస్​ మహిళా జట్టుపై భారత్​(ind vs aus) గెలిచింది. సిరీస్​ ఓడినప్పటికీ, ప్రత్యర్థి జట్టు ఖాతాలో ఉన్న రికార్డు విజయాల్ని బ్రేక్ చేసింది.

  • ఆ సినిమాతోనే అదృష్టం..

తెలుగులో రూ. కోటి వసూళ్లు రాబట్టిన తొలి సినిమాకు తాను దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని కె.రాఘవేంద్రరావు అన్నారు. ఆ చిత్ర విశేషాలను 'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన సందర్భంగా వెల్లడించారు.

14:06 September 26

టాప్​న్యూస్ @ 2PM

  • కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్‌ మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వ్యక్తి గోపిశెట్టి రజనీకాంత్‌గా గుర్తించారు. సంఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలోనే రజనీకాంత్ ఇల్లు ఉంది. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్న రజనీకాంత్​.. నిన్న రాత్రి 9గంటల సమయంలో ఇంటి నుంచి బయటకొస్తూ.. దారి కనిపించక నాలాలో పడి కొట్టుకుపోయాడు.

  • పలు రైళ్ల రద్దు

గులాబ్ తుపాన్ ప్రభావంతో రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్నింటి రైళ్ల మార్గాలను కుదిరించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను కొనసాగుతోంది. ఒడిశాలోని గోపాలపూర్​కు 310 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి కన్నబాబు తెలిపారు. సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది.

  • 16 జిల్లాల్లో ఇంటర్నెట్​ బంద్

జమ్ముకశ్మీర్​ వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినా, జరిగే అవకాశమున్నా.. వెంటనే ఇంటర్నెట్​ సేవలను నిలిపివేస్తుంది స్థానిక యంత్రాంగం. రాజస్థాన్​లోని అనేక జిల్లాల్లో ఆదివారం ఇంటర్నెట్​ను నిషేధించారు. అయితే ఆయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరగలేదు. అలాంటి వాతావరణమే లేదు. ఇంటర్నెట్​ను 'కట్​' చేయాలని అధికారులు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఓ 'పరీక్ష'.(rajasthan exam news today)

  • నదిలో పడవ బోల్తా- 29 మంది గల్లంతు!

బిహార్​ తూర్పు చంపారన్‌లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు. షికార్‌గంజ్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధియా హరాజ్‌లోని సికారహనా నదిలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 30 మంది పడవలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానిక పాలనా యంత్రాంగం, స్థానిక ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు.

  • ఘోరంగా పడిపోయిన బైడెన్​ గ్రాఫ్​.. కారణమేంటి?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది కాలంలోనే జో బైడెన్​పై(joe biden news today ) ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. గడిచిన రెండు నెలల్లో ఆయన గ్రాఫ్​ ఘోరంగా పడిపోయింది. ప్యూ పరిశోధన కేంద్ర విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం(pew research center report).. బైడన్​ పాలనకు 44 శాతం మాత్రమే మద్దతు పలికారు.
 

12:43 September 26

టాప్​న్యూస్​@ 1PM

  • భారత్​కు చేరిన మోదీ

ప్రధాని మోదీ దిల్లీ చేరుకున్నారు. అమెరికా పర్యటనను(modi us visit 2021) విజయవంతంగా ముగించుకుని దేశానికి తిరిగొచ్చిన మోదీకి భాజపా ఘన స్వాగతం పలికింది(pm modi news).

  • 'గులాబ్' గుబులు

తెలంగాణలోనూ ‘గులాబ్‌’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్‌ అని పేరుపెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేసింది. 

  • పెళ్లైన నెలకే భార్యపై అనుమానం..

హైదరాబాద్‌ బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం(husband murdered wife) చోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను కిరాతకంగా హత్య(husband murdered wife) చేశాడు. అనంతరం ఆత్మహత్యకు యత్నించాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

  • నీలాకాశంలో అద్భుత విన్యాసాలు!

జమ్ముకశ్మీర్‌లోని దాల్​ సరస్సు వద్ద 'ఎయిర్ షో' నిర్వహించింది భారత వైమానిక దళం. ఆజాది కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టింది. యువత భద్రతా దళాల్లో చేరేలా ఆకర్షించడానికి, కశ్మీర్​ లోయలో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు యుద్ధ విమానాలతో ప్రదర్శన చేశారు. ఈ విన్యాసాల్లో మిగ్​-21 బైసన్​, సుఖోయ్​-30 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. అలాగే ఆకాశ్​ గంగా బృందం స్కైడ్రైవ్​ చేసింది.

  • భారత్​కు ఊరట

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కెయిర్న్​ ఎనర్జీ, భారత ప్రభుత్వం పన్ను వివాదంలో మరో కీలక మలుపు తిరిగింది. భారత్​ నుంచి ఆర్బిట్రేషన్ అవార్డు దక్కించుకునేందుకు.. అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను జప్తు చేసుకోవాలన్న కెయిర్న్​ ఎనర్జీ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది.

12:08 September 26

టాప్​న్యూస్​@ 12 PM

  • పెళ్లైన నెలకే భార్యను హత్య చేసిన భర్త

హైదరాబాద్‌ బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన నెలరోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.

  • కేసీఆర్​కు బండి సంజయ్

 బీసీల‌ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు (bandi sanjay letter to cm kcr). బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు (bc bandhu). మంత్రివర్గంలో 8మంది బీసీలకు స్థానం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. జనాభాలో 50శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీబంధు పథకం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలపై తెరాస ప్రభుత్వం సవతితల్లి ప్రేమను విడాలన్నారు.

  • 'కాలుష్య రహిత నదుల కోసం కృషి చేయాలి'

దేశంలోని నదులను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ (Mann Ki Baat Modi). ప్రపంచ నదుల దినోత్సవం (Rivers day 2021) సందర్భంగా.. ఆదివారం నిర్వహించిన మన్-కీ బాత్​లో ఈ మేరకు అభ్యర్థించారు.

  • జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బందిపొర జిల్లాలో ఎన్​కౌంటర్(JK encounter news) జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

  • ఇక ఆ దేశానికి విమానాలు షురూ..

భారత్​లో కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. విమానాల ప్రయాణాలపై విధించిన ఆంక్షలను ఒక్కో దేశం ఎత్తివేస్తోంది. నవంబర్​ నుంచి ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా కెనడా(Canada India flight) కూడా ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. భారత్​పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విమాన సేవలు సోమవారం ప్రారంభం కానున్నాయి.


 


 


 

10:54 September 26

టాప్​న్యూస్​@ 11 AM

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Price Today) ధర దాదాపు స్థిరంగా ఉంది. వెండి ధరలోనూ పెద్దగా మార్పు లేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (Fuel Prices) స్వల్పంగా పెరిగాయి.

  • తనయగా గెలిచి.. తనవాళ్లని గెలిపించి

ఆడ పిల్లంటే.. గుండెల మీద కుంపటిలా భావించే కాలం నుంచి కంటే కూతుర్నే కనాలనే దాకా మారింది కాలం. బిడ్డ పుట్టగానే చుట్టూ అయ్యో పాపమనే జనాలు, పెరిగి చదువుతుంటే.. ఎందుకు ఖర్చూ.. పెళ్లి చేసేయక.. అనే మాటలు.. వేటినీ ఖాతరు చేయకుండా.. అడ్డుగీతలు గీయకుండా.. కూతుళ్లను ప్రపంచాన్ని గెలిచేందుకు సాగనంపుతోన్న తల్లిదండ్రులెందరో. వారి ఆశయాలకు అనుగుణంగా నిలబడుతూ.. అమ్మానాన్నలను నిలబెడుతోన్న తనయలెందరో.

  • క్షుద్రపూజలు చేస్తున్నారని.. మేనల్లుళ్లే చంపేశారు..

క్షుద్రపూజలు చేస్తున్నారనే కారణం, అప్పటికే గొడవలు ఉండటం వల్ల ముగ్గురిని గొడ్డలితో చంపేశారు. బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఝార్ఖండ్​ గుమ్లాలో(Gumla news) జరిగిందీ ఘటన

  • చొరబాటు కుట్ర భగ్నం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకలు చొరబాటుకు వరుసగా విఫలయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కొందరు ఉగ్రవాదులు ఉరీ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించగా.. భారత ఆర్మీ వారి కుట్రను భగ్నం చేసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

  • రికార్డులు కొల్లగొట్టడం 'విల్లు'తో పెట్టిన విద్య

టోర్నీ ఏదైనా.. పోటీలు ఎక్కడైనా.. జ్యోతి సురేఖ బరిలో(Jyothi Surekha Archery) దిగిందంటే కచ్చితంగా పతకం సాధించే తిరిగి వస్తుందనే నమ్మకం! చరిత్ర సృష్టించడం ఆమెకు అలవాటు. రికార్డులు బద్దలు కొట్టడం ఆమెకు విల్లుతో పెట్టిన విద్య.

09:50 September 26

టాప్​న్యూస్​@ 10 AM

  • దేశంలో మరో 28 వేల మందికి కరోనా

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 28,326 మంది​ కొవిడ్​​​ (Corona cases in India) బారినపడ్డారు. మరో 260 మంది మృతిచెందారు. ఒక్కరోజే 26,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • స్వాతంత్య్రోద్యమంలో విస్మృత వీరనారి

సంగ్రామ నేపథ్యం లేదు... సంపన్న కుటుంబమూ కాదు... ఉన్నదల్లా దేశం కోసం ఏదైనా చేయాలనే తపనే! అదే రాజ్‌కుమారి గుప్తాతో రైలు దోపిడీకి సహకరించేలా చేసింది. 25 ఆగస్టు 9న కాకోరీ సమీపంలో జరిగిందీ దోపిడీ(kakori train robbery). దీన్నే కాకోరీ దోపిడీగా పిలుస్తుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా... తన మూడేళ్ల బిడ్డను చంకలో ఎత్తుకొని, లోదుస్తుల్లో ఆయుధాలు పెట్టుకొని పొలాల్లో పడి నడుస్తూ పోరాటంలో పాల్గొన్నారు. రాజ్‌కుమారి స్వాతంత్య్రోద్యమంలో ఓ విస్మృత వీరనారి!

  • వద్దమ్మా.. ఆ లింక్స్‌ను క్లిక్‌ చేయొద్దు..!

ప్రజలకు వివిధ విషయాల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ పోలీసుల రూటే సపరేటు. సుత్తి లేకుండా సూటిగా.. ట్రెండీగా.. క్యాచీగా.. టీజింగ్​ ఉంటూనే.. వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి.. నేటి తరం యువతకు సందేశాన్ని ఇవ్వడానికి ట్విటర్​ను వినియోగిస్తున్నారు. ఆ ట్విటర్​లోనూ సాధారణ ట్వీట్లు చేయరండోయ్ వీళ్లు. యువతను ఆకట్టుకునేలా.. వారికి అర్థమయ్యేలా మీమ్స్ చేస్తూ విషయమేంటో చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మీమ్స్​తో ప్రజల్లో ట్రాఫిక్​, ఇతర విషయాలపై అవగాహన కల్పించారు. ఈసారి వీళ్లు ఎంచుకున్న అంశం.. దాన్ని చెప్పడానికి వాడిన మీమ్ ఏంటో చూసేయండి మరి.

  • భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులకు జాతీయ అవార్డులు.!

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి(Bhudan Pochampally) చేనేత కళాకారులకు(National Award for Handloom workers) అరుదైన గౌరవం దక్కింది. చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ అవార్డులకు భూదాన్‌పోచంపల్లి వాసులు ఎంపికయ్యారు. తడ్క రమేష్‌, సాయికి కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. 

  • ఆ సినిమా కోసం గాయకుడిగా మారిన రానా!

ఇప్పటికే తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న దగ్గుబాటి వారసుడు రానా.. త్వరలోనే తనలోని మరో టాలెంట్​ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రంలో ఓ పాటను తానే(Rana Daggubati Movies) స్వయంగా పాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

08:55 September 26

టాప్​న్యూస్​@ 9 AM

  • తెలంగాణలోనూ 'గులాబ్' గుబులు.. 

తెలంగాణలోనూ ‘గులాబ్‌’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్‌ అని పేరుపెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేసింది. 

  • ఏపీ కొత్త మంత్రి మండలి కూర్పు ఎలా జరుగుతోంది?

ఏపీ మంత్రిమండలి(Ap new cabinet) కూర్పుపై సీఎం జగన్(cm jagan) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపా(ycp)లోని కొందరు ముఖ్యనేతలు, సీనియర్లతో ఈ విషయంపై చర్చలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సంక్రాంతికి కొత్త మంత్రిమండలి కొలువుదీరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం

పర్యాటకులకు స్వర్గధామం రామోజీ ఫిలింసిటీకి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ పురస్కారం లభించింది. సెప్టెంబరు 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో పురస్కారాలను ప్రకటించారు. పర్యాటక శాఖ కమిషనర్‌ శనివారం వివరాలు వెల్లడించారు. పర్యాటకులకు మెరుగైన పౌరసేవల నిర్వహణ విభాగంలో రామోజీ ఫిలింసిటీ ఎంపికైంది. 27న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

  • 'విశ్వశాంతి'కి చోదక శక్తిగా భారత్​...

ప్రధాని మోదీ అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగిసింది. అమెరికా అధ్యక్షుడితో మోదీ భేటీతో భారత్‌, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది. అటు క్వాడ్​ సమావేశం కూడా విజయవంతమైంది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు తాము పునరంకితమవుతున్నట్లు క్వాడ్‌ నేతలు స్పష్టీకరించారు.

  • విజయాల జోరును కొనసాగించేదెరు?

ఐపీఎల్​ రెండో దశలో(IPL 2021) వరుస విజయాలతో కొనసాగుతోన్న చెన్నై సూపర్​కింగ్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు(CSK Vs KKR).. ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్​లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​ రేసులో మరింత ముందుకు వెళ్లేందుకు కోల్​కతా సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్​తో ప్లేఆఫ్స్​లో(IPL Playoffs 2021) అడుగుపెట్టాలని ధోనీసేన ఊవిళ్లురూతుంది.

07:55 September 26

టాప్​న్యూస్​@ 8 AM

  • ఈనెల 29న సిర్పుర్కర్ కమిషన్​ ఎదుటకు సజ్జనార్!

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై సిర్పుర్కర్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దిశ అత్యాచారానికి గురైందని ఎలా నిర్ధారణకు వచ్చారని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని ప్రశ్నించింది. ఆయన ఇచ్చిన సమాధానంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్​ను విచారించిన కమిషన్.. ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్​ను​ వచ్చే బుధవారం ప్రశ్నించనున్నట్లు సమాచారం.

  • 27న రైతుల 'భారత్‌ బంద్‌'

సెప్టెంబరు27న 'భారత్‌ బంద్‌'(Bharat bandh) పాటించాలని రైతులు ఇచ్చిన పిలుపునకు మద్దతిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ పేర్కొన్నారు. సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ.. సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌ బంద్‌(farmers agitation bandh) పిలుపునకు ఆమ్‌ ఆద్మీ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

  • మహిళా హక్కుల కార్యకర్త కమలా భసీన్ కన్నుమూత

మహిళా హక్కుల కార్యకర్త, ప్రముఖ కవయిత్రి కమలా భసీన్​(Kamla Bhasin Death) ఇక లేరు. క్యాన్సర్​తో పోరాడుతూ.. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు.

  • సూది లేకుండానే టీకా.. శాస్త్రవేత్తల ఘనత

సూది అవసరం లేకుండానే టీకా​ ఇచ్చేందుకు ఒక చిన్నపాటి పట్టీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చర్మానికి ఈ పట్టీని అతికించడం ద్వారా సాధారణ వ్యాక్సిన్‌ కన్నా మంచి ఫలితాలను రాబట్టవచ్చని పేర్కొన్నారు.

  • ప్లేఆఫ్​ రేసు నుంచి వైదలొగిన సన్​రైజర్స్​

ఐపీఎల్​లో(IPL 2021) షార్జా పరుగులవరద పారే మైదానం. అలాంటి మైదానంలో హిట్టర్లకు పేరుపడ్డ పంజాబ్‌ బ్యాటింగ్‌(SRH Vs PBKS) ఎంచుకోగానే పరుగుల పండుగే అనుకున్నారంతా. ఫోర్లు, సిక్సర్ల వర్షం చూడబోతున్నామనుకుంటే.. సింగిల్స్‌ తీయడం కూడా కష్టమైపోయిందక్కడ. పంజాబ్‌ అతి కష్టం మీద 125 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది సన్‌రైజర్స్‌. బంతితో, బ్యాటుతో హోల్డర్‌ ఎంతో శ్రమించినా హైదరాబాద్‌ను గెలిపించలేకపోయాడు. ఆ జట్టు ప్లేఆఫ్‌ రేసు(SRH Playoffs) నుంచి నిష్క్రమించింది.

07:53 September 26

టాప్​న్యూస్​@ 7AM

  • దశాబ్దాల గడ్డి అన్నారం మార్కెట్‌ చరిత్రకు తెర

మూడున్నర దశాబ్దాల చరిత్ర ముగిసింది. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు తాళం పడింది. ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఈ మార్కెట్‌ స్థానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సర్కారు.. ఈ మార్కెట్​ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలించి కార్యకలాపాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. బాటసింగారం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల.. కమీషన్​ ఏజెంట్లు, హమాలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  •  మళ్లీ పెరిగిన ఇంధన​​ ధరలు

దేశంలో మరోసారి డీజిల్​ ధరలు పెరిగాయి. ఆదివారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ డీజిల్​ ధర రూ. 89.09కు చేరుకుంది.

  • బట్టలు ఉతకాలని తీర్పునిచ్చిన జడ్జిని..

గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలని అత్యాచార కేసులో నిందితుడిని ఆదేశించిన జడ్జిని తాత్కాలికంగా విధులనుంచి తప్పిస్తూ పట్నా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

  • బిగ్​ బిలియన్‌ డేస్‌ మార్పు!

ఫ్లిప్​కార్ట్​ 'బిగ్ బిలియన్​ డేస్'(Flipkart Big Billion Days 2021) తేదీల్లో మార్పులు చేసింది. అక్టోబరు​ 3 నుంచి 10 మధ్య ఈ విక్రయాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

  • తొలి భారతీయ చిత్రంగా!

హాలీవుడ్​ సినిమాల చిత్రీకరణకు ఉపయోగించే కొత్త సాంకేతికతను పాన్​ ఇండియా చిత్రం 'సలార్'కు(Salaar Technologies) ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్న మొదటి భారతీయ చిత్రం 'సలార్'(Salaar Movie News) కావడం విశేషం.

05:47 September 26

టాప్​న్యూస్​@ 6AM

  • పాలమూరు-రంగారెడ్డికి అనుమతివ్వండి

ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తర్వులు జారీ చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వీలైనంత త్వరగా అన్ని అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని మరోమారు కోరారు. కేంద్రం హామీ ప్రకారం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నందున రాష్ట్రానికి నీటివాటా కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం (heavy rains in hyderabad) కురిసింది. ఫలితంగా రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ట్రాఫిక్​ జామ్​తో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. మణికొండలో డ్రైనేజీ గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. డ్రైనేజీ పైపులైన్ల కోసం తవ్విన గుంతలో పడ్డాడు. సమాచారం అందుకున్న డీఆర్​ఎఫ్​ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.

  • వైకాపా నేతలకు పవన్ వార్నింగ్​.. 

'సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే.. వైకాపా నేతలు కాలిపోతారు.. జాగ్రత్త' అంటూ జనసేనాని పవన్‌ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. 'ఇది వైకాపా రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్‌..' అని వ్యాఖ్యానించారు. వైకాపా రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారని హితవు పలికారు. సాయిధరమ్​ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు పవన్​ హాజరయ్యారు.

  • ఐకమత్యంగా ఉంటే మనం ఎంతో బలవంతులం

ప్రజలంతా ఐకమత్యంగా ఉంటే ఎంతో బలంగా, ఉత్తమంగా ఉంటారనే విషయం కరోనాపై పోరులో నిరూపితమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'గ్లోబల్​ సిటిజెన్ లైవ్​'లో ఆయన ఈ మేరకు తెలిపారు.

  • పొంచి ఉన్న 'గులాబ్' ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా(Gulab Cyclone Update) మారిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుపాను నేపథ్యంలో.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు 'ఆరెంజ్'​ హెచ్చరికలను జారీ చేసింది.

  •  
  • 'అందుకే అతడు మెంటార్‌ సింగ్‌ ధోనీ'

చెన్నై, ఆర్సీబీ(CSK vs RCB 2021) మధ్య జరిగిన మ్యాచ్​ అనంతరం ధోనీని.. 'మెంటార్​ సింగ్ ధోనీ'గా సంబోధించాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్(Parthiv Patel on MS Dhoni). దూకుడుగా కనిపించిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరును ధోనీ తన చాకచక్యంతో బౌలింగ్​ మార్పులు చేసి 156 పరుగులకే కట్టడి చేశాడని పేర్కొన్నాడు.

  •  పంజాబ్​ విజయం

ఐపీఎల్​ 2021లో సన్​రైజర్స్​పై పంజాబ్​ కింగ్స్​ విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

Last Updated : Sep 26, 2021, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.