ETV Bharat / state

Harish Rao Fire on Bjp:'కేంద్రం నిర్ణయాలతో సామాన్యులు ఆగమాగం'

author img

By

Published : Sep 26, 2021, 7:45 PM IST

హుజూరాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు (Minister Harish Rao), మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా నాయకులపై (Harish Rao Comments on Bjp) విమర్శలు గుప్పించారు.

Harish Rao Fire on Bjp
ఆర్థికమంత్రి హరీశ్‌రావు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తోందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు (Harish Rao Comments) విమర్శించారు. హుజూరాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్న హరీశ్‌రావు... భాజపా నాయకులపై విమర్శలు గుప్పించారు. ప్రజల వైపు ఉండి వారి కోసం పనిచేసే తెరాస పార్టీకే ఉపఎన్నికలో ఓటు వేయాలన్నారు. భాజపా ప్రభుత్వం... కులవృత్తులనూ కార్పొరేట్‌ చేతుల్లో పెడుతోందని ఆరోపించారు.

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే పార్టీ భాజపా. పేద ప్రజల ఉసురు పోసుకునే పార్టీ భాజపా. మార్కెట్ యార్డులను రద్దు చేసి ఇవాళ కొత్త చట్టాలను తీసుకొస్తుంది. ఇయ్యాళ కిరాణ దుకాణాలు పోతున్నాయి. కుల వృత్తులు పోతున్నయి. అన్ని కూడా కార్పొరేట్ చేతుల్లోకి పోతున్నయి. మన గురించి ఆలోచించే పార్టీ పక్షానా మనముందామా? మన వృత్తులను ఆగం చేసి బడాబడా పారిశ్రామిక వేత్తల చేతుల్లో పెట్టి మనల్ని అందులో కూలీలను చేసే భాజపాకు మనం మద్దతు ఇయ్యాల్నా? దయచేసి ఆలోచించాలని కోరుతున్నా.

-- హరీశ్​రావు, మంత్రి

Harish Rao Fire on Bjp:'కేంద్రం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తోంది'

ఇదీ చదవండి:

ts assembly session: అక్టోబర్​ 5వరకు అసెంబ్లీ సమావేశాలు.. ప్రోటోకాల్​పై స్పష్టమైన ఆదేశాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.