ETV Bharat / sitara

విజయ్ కొత్త సినిమా.. 'లైగర్​' అప్డేట్​కు టైమ్​​ ఫిక్స్​

author img

By

Published : Sep 26, 2021, 5:47 PM IST

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్​, విజయ్​ దేవరకొండ, సిద్ధార్థ్‌​ చిత్రాల వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

'మున్నా', 'ఊపిరి', 'మహర్షి' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వంశీ పైడిపల్లి. ఈయన కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌తో ఓ చిత్రం చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. "నా సొంత బ్యానర్‌లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో విజయ్‌ హీరోగా సినిమా చేస్తున్నానని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు వంశీ. కథానాయకుడిగా విజయ్‌కు ఇది 66వ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం విజయ్‌ నటిస్తోన్న 'బీస్ట్‌' సినిమా పూర్తవగానే ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

cinema updates
విజయ్​ వంశీపైడిపల్లి కాంబో ఖరారు

ఓటీటీలో 'ఒరేయ్​ బామ్మర్ది'

సిద్దార్థ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒరేయ్‌ బామ్మర్ది'. 'బిచ్చగాడు' చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్‌ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్​ 1నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. సిద్దార్థ్‌ ఇందులో ట్రాఫిక్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. బైక్‌ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రను జీవీ ప్రకాశ్‌ పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'లైగర్​'

సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'లైగర్​'(liger movie update) ఒకటి. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ(vijay devarakonda new movie) హీరోగా తెరకెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్​. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్​ను సెప్టెంబరు 27న సాయంత్రం 4గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్​ సోషల్​మీడియాలో ట్రెండింగ్​ అవుతోంది.

cinema updates
లైగర్​

ఇదీ చూడండి: రూ.కోటి వసూలు చేసిన తొలి తెలుగు సినిమా అది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.