ఐకమత్యంగా ఉంటే మనం ఎంతో బలవంతులం: మోదీ

author img

By

Published : Sep 25, 2021, 11:32 PM IST

Updated : Sep 26, 2021, 12:16 AM IST

globan citizen live summit

ప్రజలంతా ఐకమత్యంగా ఉంటే ఎంతో బలంగా, ఉత్తమంగా ఉంటారనే విషయం కరోనాపై పోరులో నిరూపితమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'గ్లోబల్​ సిటిజెన్ లైవ్​'లో ఆయన ఈ మేరకు తెలిపారు.

ప్రజలంతా కలిసి ఉన్నప్పుడు ఎంతో బలంగా, ఉత్తమంగా ఉంటారని.. కరోనా మహమ్మారిపై పోరు ద్వారా తెలిసొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'గ్లోబల్ సిటిజెన్ లైవ్' సదస్సులో వర్చువల్​గా ఆయన పాల్గొన్నారు.

"జీవితకాలంలో ఓ సారి వేధించే మహమ్మారితో రెండేళ్లుగా మనం పోరాడుతున్నాం. ఈ పోరులో మన ఉమ్మడి అనుభవాలు... మనం ఐకమత్యంగా ఉంటే దృఢంగా, ఉత్తమంగా ఉంటామని తెలిసేలా చేశాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

కరోనా విజృంభణ సమయంలో మానవత్వమే అన్నింటి కన్నా ప్రధానమని నిరూపితమైన సత్యాన్ని రాబోయే తరాలు కూడా గుర్తుంచుకుంటాయని మోదీ చెప్పారు. కరోనాను ఓడించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, కొవిడ్​ యోధులు తమ వంతుగా చేసిన కృషి.. యావత్​ ప్రపంచం చూసిందని పేర్కొన్నారు.

ప్రపంచం ముందు వాతావారణ మార్పులు అనే ముప్పు పొంచి ఉందని మోదీ హెచ్చరించారు. ఈ ముప్పును నివారించడానికి ప్రత్యమ్నాయ మార్గాలను ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మా గాంధీ గొప్ప పర్యావరణ వేత్త అని పేర్కొన్నారు. పేదలను ప్రభుత్వాలపై ఎక్కువగా ఆధారపడేలా చేస్తే.. పేదరికంపై పోరాడలేమని చెప్పారు.

Last Updated :Sep 26, 2021, 12:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.