ETV Bharat / city

Gulab Cyclone in Telangana : తెలంగాణలోనూ 'గులాబ్' గుబులు.. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు

author img

By

Published : Sep 26, 2021, 8:16 AM IST

Updated : Sep 26, 2021, 1:50 PM IST

తెలంగాణలోనూ 'గులాబ్' ప్రభావం
తెలంగాణలోనూ 'గులాబ్' ప్రభావం

07:45 September 26

Gulab Cyclone in Telangana : తెలంగాణలోనూ 'గులాబ్' ప్రభావం

తెలంగాణలోనూ ‘గులాబ్‌’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను కేంద్రీకృతమైంది. గోపాల్‌పూర్‌కు 180, కళింగపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనున్నట్లు తెలిపింది. రేపు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలి వేగం అత్యధికంగా 95 కిలోమీటర్లు ఉంటుందన్నారు. వచ్చే 24గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు

అందులో.. ‘తుపాన్‌ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు.. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

తుపాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు చోట్ల భారీ వానలు కురిశాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.3 పోచంపల్లి (కరీంనగర్​)లో 6.3, కూనారం (పెద్దపల్లి)లో 6, ఆవునూరు (రాజన్న సిరిసిల్ల జిల్లా)లో 6, సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు చెప్పారు. 

ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర నీరు చొచ్చుకొచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరించింది.

Last Updated :Sep 26, 2021, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.