ETV Bharat / sitara

MAA Elections 2021: 'మా' ఎన్నికల నామినేషన్​కు అంతా రెడీ

author img

By

Published : Sep 26, 2021, 4:29 PM IST

maa elections 2021
మా ఎలక్షన్

గతకొన్ని రోజుల నుంచి చర్చనీయాంశమైన 'మా' ఎన్నికల(maa elections 2021) నామినేషన్​కు అంతా సిద్ధమైంది. దాదాపు రెండు రోజుల పాటు దీనికి అవకాశముంది. అధ్యక్ష బరిలో ముగ్గురు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన నటీనటుల సంఘం ఎన్నికలకు(maa elections 2021) సోమవారం(సెప్టెంబరు 27) నుంచి నామినేషన్లు మొదలుకానున్నాయి. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఉన్న 'మా' కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.

ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో(maa elections 2021) అసోసియేషన్ సభ్యులు 2021-23 నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. సోమవారం నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 30న నామినేషన్లను స్క్రూటినీ చేసి అక్టోబర్ 2న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారి వెల్లడిస్తారు.

అక్టోబర్ 10న(maa elections 2021 date) జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఇప్పటివరకు త్రిముఖ పోరు నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్​రాజ్​తోపాటు(prakash raj panel) మోహన్​బాబు తనయుడు మంచు విష్ణు(manchu vishnu movies) బరిలోకి దిగగా.. మరో సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు స్వతంత్ర అభ్యర్థిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(maa elections 2021) ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తన ప్యానల్ సభ్యులతో కలిసి అధ్యక్ష పదవికి ప్రకాశ్​రాజ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మంచు విష్ణు మధ్యాహ్నాం తర్వాత నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. సీవీఎల్ నర్సింహారావు ఉదయం 11 గంటలకు ఛాంబర్​కు చేరుకొని నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.