ETV Bharat / entertainment

'నాకు అలాంటోడే కావాలి - వాడితోనే కలిసి ఉంటా' - Janvi Kapoor Marriage

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 6:22 PM IST

Janhvi Kapoor Marriage : తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI
Janvi Kapoor (Source ANI)

Janhvi Kapoor Marriage : బాలీవుడ్‌ హీరోయిన్​ అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ గురించి తెలిసిందే. స్టార్​ హీరోయిన్​గా ఎదిగేందుకు తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. త్వరలోనే మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమె వరుస ఈవెంట్లలోనూ పాల్గొంటోంది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్​ను విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్న జాన్వీ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది.

"అతడు నా కలలను తన కలలుగా భావించాలి. నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ నన్ను సంతోషంగా చూసుకోవాలి. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ఓదార్చాలి. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది. కాగా, జాన్వీ గత కొంత కాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌తో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రీసెంట్​గా మైదాన్‌ మూవీ ప్రీమియర్‌ షోలోనూ ఆమె శిఖు (శిఖర్‌ పహాడియా) అనే లోగో ఉన్న నెక్లెస్‌ వేసుకుంది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. అలానే ఓ సందర్భంలో తన ఫోన్‌లో స్పీడ్‌ డయల్‌ లిస్ట్​లో తన తండ్రి, చెల్లి, శిఖర్‌ పేర్లు ఉంటాయని చెప్పింది. దీంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.

ఇకపోతే మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి సినిమా విషయానికొస్తే శరణ్‌శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. క్రికెట్‌ బ్యాక్​ డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. దీని తర్వాత జాన్వీ కపూర్‌ టాలీవుడ్​కు ఎన్టీఆర్​ దేవరతో(Janhvi Kapoor Devara Movie) పరిచయం కానుంది. దీని తర్వాత రామ్​చరణ్​ బుచ్చిబాబు సినిమాలోనూ నటించనుంది.

క్రికెట్ బాల్​తో స్టార్ హీరో పళ్లు విరగొట్టిన జాన్వీ! - Janvi Kapoor

రూ.1400 కోట్ల విజువల్ వండర్ మూవీ రిలీజ్​కు రెడీ - ఫుల్ యాక్షన్ మోడ్​, ఛేజింగ్ సీన్స్​తో! - Furiosa A Mad Max Saga

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.