ETV Bharat / business

మార్కెట్​లో వీటిని కొట్టే మోడల్ లేదు! టాప్​-10 ఆల్​ టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవే! - Best Selling Cars Of All Time

Best Selling Cars Of All Time : మీరు కార్ లవర్సా? బెస్ట్ సెల్లింగ్ కార్స్ గురించి ఎప్పుడూ సెర్చ్ చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు - అవి విడుదల చేసిన కార్లు - వాటిలో పెద్ద సంఖ్యలో అమ్ముడుపోయిన (బెస్ట్​ సెల్లింగ్​) మోడల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

The World's Best-Selling Cars of All Time
Top 10 Selling Cars of All Time (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 1:46 PM IST

Best Selling Cars Of All Time : నేడు ఆటోమొబైల్ రంగం చాలా అభివృద్ధి చెందింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని భారీ సంఖ్యలో బుకింగ్స్ నమోదు చేసుకుని, బెస్ట్ సెల్లింగ్ కార్స్​గా నిలుస్తున్నాయి. మరి మీరు ఎప్పుడైనా వింటేజ్​ కార్ల గురించి ఆలోచించారా? అప్పట్లో ఆల్​-టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కార్లుగా ఏమున్నాయో తెలుసుకోవాలనుకున్నారా? అయితే ఇది మీ కోసమే. పాత కాలం నాటి టాప్​-10 బెస్ట్ సెల్లింగ్ కార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

10. Bugatti Type 40A : బుగట్టి - టైప్​ 40ఏ కారును ఒక ఇంజినీరింగ్ మాస్టర్ పీస్​గా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇది ఒక టూ-సీటర్ స్పోర్ట్స్​ కార్. ఇది గంటకు 120 కి.మీ వేగంతో పయనిస్తుంది. ఆ రోజుల్లో అత్యంత వేగంతో ప్రయాణించే కార్లలో ఇదొకటి కావడం విశేషం. ఈ స్టన్నింగ్ కారు 1926 -1931 వరకు కార్ లవర్స్​ అందరినీ ఉర్రూతలూగించింది.

ఈ బుగట్టి కారు స్లీక్​, ఎయిరోడైనమిక్ డిజైన్​తో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో 1.5 లీటర్ ఇన్​లైన్​-ఎయిట్​ ఇంజిన్​ అమర్చారు. ఇది 75 హార్స్​పవర్​ను డెలివరీ చేసేది. దీని సస్పెన్షన్​ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి గతుకుల రోడ్లపై అయినా చాలా హాయిగా ప్రయాణించడానికి వీలవుతుంది. అప్పట్లోనే ఈ బుగట్టి కారు 807 యూనిట్లు అమ్ముడుపోయి, ఆల్​-టైమ్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

Bugatti Type 40A Price : 2024 ఏప్రిల్​లో​ జరిగిన ఓ వేలంలో (Auction) ఈ బుగట్టి టైప్ 40ఏ కారు ఏకంగా 3,02,000 డాలర్లకు అమ్ముడుపోయింది.

Bugatti type 40
బుగట్టి - టైప్​ 40ఏ (Getty Images)

9. Morgan 4/4 : ఈ మోర్గాన్​ 4/4 అనే బ్రిటీష్ కారు ఆటోమోటివ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలంపాటు కొనసాగిన కారుగా నిలిచింది. ఇది 1936 నుంచి 2018 వరకు దాదాపు 10,000 యూనిట్ల వరకు సేల్ అయ్యింది. ఇది బ్లెండ్ లుక్స్​, పెర్ఫార్మెన్స్​, రగ్గడ్ యూజబిలిటీతో కార్​ లవర్స్​ను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే 2020లో దీని స్థానంలో కొత్త 'ప్లస్​ ఫోర్'​ కారును కంపెనీ తీసుకువచ్చింది.

ఈ మోర్గాన్ 4/4 కారులో ఫోర్డ్ సిగ్మా 1600 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6000 rpm వద్ద 110 bhp పవర్, 131 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ వింటేజ్ కారు గంటకు 188 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సైజ్ 55 లీటర్లు ఉంటుంది.

Morgan 4/4 Price : ప్రస్తుతం ఇది మార్కెట్లో అందుబాటులో లేదు. వేలంపాటలో బహుశా 46,900 యూరోస్​ పలకవచ్చని అంచనా.

Morgan 4-4
మోర్గాన్​ 4/4 (Getty Images)

8. Ferrari 458 : ఫెరారీ-458 ఏకంగా 24,000 యూనిట్లు అమ్ముడుపోయి ఆల్​ టైమ్ బిగ్గెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే ఈ కార్​లో మూడు రకాల వేరియంట్స్ ఉన్నాయి. అవి: ఇటాలియాస్ (15,000 యూనిట్లు)​, స్పెషలెస్ (3,000 యూనిట్లు)​, స్పైడర్స్ (6,000 యూనిట్లు) ఉన్నాయి.

ఫెరారీ 458 ఇటాలియాలో 4497 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 561.9 bhp పవర్​, 540 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. దీని సిటీ మైలేజ్ 4 కి.మీ/లీటర్​. పైగా దీని సీటింగ్ కెపాసిటీ-2.

Ferrari 458 Price : మార్కెట్లో ఈ ఫెరారీ 458 కారు ధర సుమారుగా రూ.3.87 కోట్లు ఉంటుంది.

ferrari 458
ఫెరారీ -458 (Getty Images)

7. Lamborghini Urus : వింటేజ్ కార్లలో 25000 యూనిట్లకుపైగా అమ్ముడుపోయి, బెస్ట్ సెల్లింగ్ కారుగా లంబొర్గినీ ఉరుస్​ నిలిచింది. ప్రపంచంలోని మొదటి సూపర్ స్పోర్ట్ యుటిలిటీ కారు ఇది. ఈ ఎస్​యూవీలో 4.0 లీటర్​ ట్విన్​ వీ8 ఇంజిన్ అమర్చారు. దీని డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్​, పెర్ఫార్మెన్స్​ అద్భుతంగా ఉంటాయి.

Lamborghini Urus Price : మార్కెట్లో ఈ లంబొర్గినీ ఉరుస్ కారు ధర సుమారుగా రూ.4.98 కోట్లు ఉంటుంది.

Lamborghini Urs
లంబొర్గినీ ఉరుస్ (Getty Images)

6. Rolls-Royce Silver Shadow : రోల్స్​ రాయిస్​ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ కార్లలో 'సిల్వర్ షాడో' ఒకటి. ఇది 1965 నుంచి 1980 మధ్యలో మోస్ట్ పాపులర్ కారుగా ఉంది. ఇది మొత్తంగా 29,030 యూనిట్లు అమ్ముడుపోయింది.

ఈ రోల్స్ రాయిస్ కారులో V8, 6.75 లీటర్​, నేచురల్లీ ఆస్పైర్డ్ ఇంజిన్ ఉంది. ఇది 4000 rpm వద్ద 189 హోర్స్​పవర్​ జనరేట్ చేస్తుంది. ఇది 3-స్పీడ్​ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 26.4 గ్యాలెన్స్​. ఇది గంటకు 118 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

Rolls-Royce Silver Shadow Price : దీనిలో అనేక వేరియంట్లు ఉన్నాయి. వీటి ధర 12,850 యూరోల నుంచి 35,000 యూరోల రేంజ్​లో ఉంటుంది.

Rolls Royce Silver Shadow
రోల్స్​ రాయిస్​ సిల్వర్ షోడో (Getty Images)

5. Bentley Continental GT : బెంట్లీ కాంటినెంటల్ జీటీ 90,000 యూనిట్లకు పైగా సేల్​ అయ్యి ఆల్ టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

ఈ బెంట్లీ కారులో 5950 సీసీ 12 సిలిండర్​ ఇంజిన్​ ఉంది. ఇది 650 bhp పవర్​, 900 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెట్ ట్యాంక్ కెపాసిటీ 90 లీటర్స్​. దీని మైలేజ్​ 12.9 కి.మీ/లీటర్​.

Bentley Continental GT Price : మార్కెట్లో ఈ బెంట్లీ కాంటినెంటల్​ జీటీ కారు ధర సుమారుగా రూ.7.44 కోట్ల నుంచి రూ.9.71 కోట్ల వరకు ఉంటుంది.

Bentley Continental GT
బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Getty Images)

4. Triumph Herald : ట్రయంఫ్ హెరాల్డ్​ ఏకంగా 4,64,238 యూనిట్లు అమ్ముడుపోయింది. అంటే బయ్యర్లకు ఇది అంటే ఎంత మోజో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 1959 నుంచి 1970ల మధ్యలో ఇది ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపింది.

ఈ ట్రయంఫ్ కారులో 4 సిలిండర్​ 948 సీసీ ఇంజిన్ ఉంది. అయితే దీనిలో సింగిల్ కార్బ్​, ట్విన్ కార్బ్ అనే రెండు వెర్షన్​లు ఉన్నాయి. సింగిల్ కార్బ్​ వెర్షన్​ 4500 rpm వద్ద 34.5 bhp పవర్​, 2750 rpm వద్ద 49 టార్క్ జనరేట్ చేస్తుంది.

Triumph Herald Price : ఈ ట్రయంఫ్ హెరాల్డ్ కారు ధర యావరేజ్​గా 13,080 డాలర్లు ఉంటుంది.

Triumph Herald
ట్రయంఫ్ హెరాల్డ్​ (Getty Images)

3. Jaguar XJ : వన్ మిలియన్ యూనిట్లు సేల్ అయ్యి జాగ్వర్ XJ ఆల్​ టైమ్ బెస్ట్ సెల్లింగ్ వింటేజ్ కారుగా ప్రసిద్ధి చెందింది. 1968లో లాంఛ్ అయిన ఈ కారు 2019 వరకు తన ప్రస్థానాన్ని కొనసాగిచింది.

ఈ జాగ్వార్ కారులో 2993 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 301.73 bhp పవర్​, 689 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్​ 14.47 కి.మీ/ లీటర్​. అయితే ఇది డీజిల్​తో నడుస్తుంది.

Jaguar XJ Price : జాగ్వర్ ఎక్స్​జే కారు ధర సుమారుగా రూ.99.56 లక్షల నుంచి రూ.1.97 కోట్లు వరకు ఉంటుంది.

Jaguar – XJ
జాగ్వర్ XJ (Getty Images)

2. Porsche 911 : జర్మనీకి చెందిన ఈ పోర్స్చే 911 స్పోర్ట్స్​ కారు ఏకంగా 1.2 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి, ది బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. 1963లో లాంఛ్ అయిన ఈ కారు ఇప్పటికీ, బయ్యర్లకు అందుబాటులో ఉంది. అంటే ఇది ఎంత సక్సెస్​ఫుల్ కారో అర్థం చేసుకోవచ్చు. ఈ పోర్స్చే 911 కారులో 3996 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 379.50 bhp పవర్​, 465 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్​ 10.64 కి.మీ/ లీటర్​.

Porsche 911 Price : మార్కెట్లో ఈ పోర్స్చే 911 కారు ధర సుమారుగా రూ.1.86 కోట్లు నుంచి రూ.4.26 కోట్లు వరకు ఉంటుంది.

Porsche – 911
పోర్స్చే 911 (Getty Images)

1. Plymouth Fury : 1956లో మార్కెట్లోకి వచ్చిన ప్లైమౌత్​ ఫ్యూరీ ఏకంగా 3.68 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది. దీనిలో సలూన్​, వేగన్​, కూపే, కన్వర్టిబుల్ మోడల్స్ ఉన్నాయి.

Plymouth Fury Price : మార్కెట్లో ఈ ప్లైమౌత్ ఫ్యూరీ కారు ధర సుమారుగా 32,089 డాలర్లు ఉంటుంది.

Plymouth – Fury
ప్లైమౌత్​ ఫ్యూరీ (Getty Images)

నోట్​ : ఇక్కడ తెలిపినవి ఆయా ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన బెస్ట్ సెల్లింగ్ కార్స్ మాత్రమే. ఇంకా చాలా బెస్ట్ సెల్లింగ్ కార్స్ మార్కెట్లో ఉంటాయి. వాటి గురించి తరువాత ఆర్టికల్స్​లో తెలుసుకుందాం.

రూ.10 లక్షల బడ్జెట్లో మంచి SUV కార్​ కొనాలా? టాప్​-5 మోడల్స్​​ ఇవే! - Most Powerful SUVs Under 10 lakh

గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్​పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.