ETV Bharat / sports

భారత్ x పాకిస్థాన్ మ్యాచ్​కు 'ఫ్యాన్ పార్క్'- బిగ్ స్క్రీన్​లో లైవ్ స్ట్రీమింగ్- ఎక్కడంటే? - 2024 World Cup

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 2:16 PM IST

Ind vs Pak World Cup 2024: టీ20 ప్రపంచకప్​ భారత్- పాకిస్థాన్​ మ్యాచ్​ ఫ్యాన్ పార్క్​కు ఐసీసీ అనుమతిచ్చింది. మరి ఆ ఫ్యాన్ పార్క్ ఎక్కడంటే?

Ind vs Pak World Cup 2024
Ind vs Pak World Cup 2024 (Source: ETV Bharat)

Ind vs Pak World Cup 2024: 2024 టీ20 వరల్డ్​కప్​ మరో మూడు వారాల్లో ప్రారంభం కానుంది. యావత్ క్రీడా ప్రపంచం దృష్టి జూన్ 9న జరిగే భారత్- పాకిస్థాన్ మ్యాచ్​పైనే ఉండనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్​కు న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ వరల్డ్​కప్​ టోర్నీలోనే ​హైలైట్​గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్​కు ఇంగ్లాండ్​ ఎడ్జ్​బాస్టన్ స్టేడియం నిర్వాహకులు ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.

ఆక్కడున్న క్రికెట్​ అభిమానులకు లైవ్ మ్యాచ్​ చూస్తున్న అనుభూతి కల్పించేందుకు ఫ్యాన్ పార్క్​లో భారీ స్క్రీన్​ ఏర్పాటు చేయనున్నట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఐసీసీ కూడా అనుమతి లభించినట్లు పేర్కొన్నారు. ఈ ఫ్యాన్ పార్క్ దాదాపు 8వేల మంది రావొచ్చని అంచనా వేస్తున్నారు. మొట్టమొదటిసారి ఐసీసీ యూకే క్రికెట్ ఫ్యాన్స్​కు ఎడ్జ్​బాస్టన్​ నుంచి లైవ్​ వీక్షించే అవకాశం కల్పించింది. ఇక ఈ ఫ్యాన్​ పార్క్​న​కు భారత్, పాకిస్థాన్​కు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా రానున్నట్లు తెలుస్తోంది. ​

'ఇంగ్లాండ్​లో ఫ్యాన్ జోన్ పార్క్​కు మా ఒక్కరికే అవకాశం లభించింది. ఇది అమేజింగ్. వరల్డ్​కప్​ టోర్నీలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరువవ్వాలంటే ఫ్యాన్ పార్క్​లు అవసరం. 2019 వరల్డ్​కప్​లో ఇక్కడ భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు కూడా ఆడియెన్స్​ నుంచి అదే రేంజ్​ రెస్పాన్స్​ ఉంటుందని భావిస్తున్నాం. ఫ్యాన్ పార్క్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని ఎడ్జ్​బాస్టన్ స్టేడియం నిర్వాహకులు ఒకరు చెప్పారు.

అచ్చం వాంఖడేలాగే:
ఇండోపాక్ మ్యాచ్​కు ఆతిథ్యమివ్వనున్న న్యూయార్క్ స్టేడియాన్ని ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, వరల్డ్​కప్ బ్రాండ్ అంబాసిడర్ ఉసెన్ బోల్డ్ రీసెంట్​గా ప్రారంభించాడు. ​ఈ స్టేడియం న్యూయార్క్​ ఈస్ట్​మేడ్​లోని ఐసెన్‌హోవర్ పార్క్​లో, 34 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించారు. అయితే ఈ స్టేడియం బౌండరీ లైన్ విషయంలో​ దాదాపు ముంబయి వాంఖడే మైదానాన్ని పోలి ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఈ స్టేడియంలో బౌండరీ లైన్ పిచ్​ నుంచి నలువైపులా 65- 70 మీటర్లకు కొంచెం అటు ఇటుగా ఉంది. ఈ వరల్డ్​కప్ టోర్నీ​లో భారత్- పాకిస్థాన్​ సమరంతో సహా మరో 8 మ్యాచ్​లకు ఈ స్టేడియం వేదికకానుంది.

భారత్ x పాక్- హై వోల్టేజ్ మ్యాచ్​లో భారీ స్కోర్లు!- బౌండరీ లైన్ అంత దగ్గరగానా? - T20 WORLD CUP 2024

జెట్ స్పీడ్​లో న్యూయార్క్​ స్టేడియం పనులు- ట్రక్కుల్లో మైదానానికి చేరిన పిచ్​లు - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.