ETV Bharat / entertainment

లాఠీ పట్టిన అందాల భామలు - విలన్లను రప్ఫాడించేందుకు రెడీ - Tollywood Heroines In Cop Role

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 2:02 PM IST

Tollywood Heroines In Cop Role : కేవలం గ్లామర్​కే పరిమితం కాకుండా పలువు స్టార్ హీరోయిన్లు తమలోని సరికొత్త కోణాన్ని చూపిస్తున్నారు. యాక్షన్​లోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్​లో కనిపించి అదరగొడుతున్నారు. మరి ఇప్పటి వరకు ఖాకీ డ్రెస్సుల్లో కనిపించిన నటీమణులు, త్వరలో తెరపై కాప్​ రోల్​లో మెరవనున్న తారలెవరో చూద్దామా ?

Tollywood Heroines In Cop Role
Tollywood Heroines In Cop Role (Source : ETV Bharat Archives)

Tollywood Heroines In Cop Role : సాఫ్ట్​ క్యారెక్టర్లలోనే కాదు స్ట్రాంగ్ క్యారెక్టర్లతోనూ అదరగొడుతామంటున్నారు స్టార్ హీరోయిన్లు. ఫైట్లు వంటి వాటిలో కూడా మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు కొందరు హీరోయిన్లు. ఖాకీ డ్రెస్సు, చేతిలో లాఠీ పట్టుకుని ఆడియన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ హీరోయిన్లు ఎవరు? ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దామా.

కాజల్ అగర్వాల్:
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో సూపర్ పోలీస్ ఆఫీసర్​గా ప్రేక్షకులను పలకరించనున్నారు. 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటడ్ మూవీలో ఆమె ఈ పాత్ర పోషించారు. అఖిల్ డేగల డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 17న విడుదల కానుంది. అయితే గతంలోనూ కాజల్ 'జిల్లా', 'ఘోస్టీ' వంటి చిత్రాల్లో పోలీసు అధికారిగా కనిపించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చాందినీ చౌదరీ:
'కలర్ ఫొటో', 'గామీ' లాంటి సినిమాలతో పాపులర్ అయిన చాందిని చౌదరీ త్వరలోనే పోలీస్ ఆఫీసర్​గా కనిపించనుంది. ప్రకాష్ చిత్ర రూపొందిస్తున్న 'యేవమ్' అనే చిత్రంలో ఆమె ఈ పాత్ర పోషించనుంది. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్​లుక్​లో చాందినీ ఖాకీ డ్రెస్సులో సీరియస్​గా కనిపించింది. ఆ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.

త్రిష :
కోలీవుడ్ బ్యూటీ త్రిష ఖాకీ దుస్తుల్లో కనిపించనుంది. 'బృందా' అనే వెబ్ సిరీస్​లో ఆమె ఈ పాత్ర పోషించనుంది. సూర్ వంగల డైరెక్షన్​లో రూపొందిన ఈ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్​ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పాయల్ రాజ్​పుత్:
'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది నటి పాయల్ రాజ్ పుత్. ఎప్పుడూ సాఫ్ట్​ లేదా గ్లామర్ పాత్రల్లో కనిపించే ఈ చిన్నది, ఈ సారి కొత్త జోనర్లో కనిపించేందుకు సిద్ధమైంది. 'రక్షణ' అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్​లో కీలక పాత్ర పోషించనుంది. జూన్ 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

మంచు లక్ష్మీ :
టాలీవుడ్ స్టార్ నటి మంచు లక్ష్మీ కూడా త్వరలోనే ఖాకీ దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రతీక్ ప్రజోష్ డెరెక్షన్​లో వస్తున్న'అగ్ని నక్షత్రం' చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరవనున్నరు. రీసెంట్​గా విడుదలైన సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇందులో మోహన్ బాబు కూడా ప్రొఫెసర్ విశ్వామిత్ర అనే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

విలన్ల వెన్ను విరిచిన వెండితెర పోలీస్​ వీరే!

పోలీస్ స్టోరీ పట్టు.. హిట్టు కొట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.