తెలంగాణ

telangana

Viral Audio: 'అమ్మాయిలను పంపాలంటూ ఆ ఎమ్మెల్యే మమ్మల్ని బెదిరిస్తున్నారు'

By

Published : Mar 28, 2023, 2:09 PM IST

Viral Audio on MLA Durgam Chinnaiah

Viral Audio on MLA Durgam Chinnaiah : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన ఆడియో, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఆ ఆడియో, వీడియోల్లో బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓ డెయిరీ నిర్వాహకురాలు.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. డెయిరీ ఏర్పాటుకు డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేశారని అన్నారు. తాము సహకరించనందుకు తప్పుడు కేసులు పెట్టి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదేనని ఆరోపించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఈ ఆడియో, వీడియోలపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సైతం స్పందించారు. ఆ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా తనను దెబ్బ కొట్టడానికే కొందరు తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details