ETV Bharat / business

మీరు ఉద్యోగులా? ITR ఫైల్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోకండి! - Salaried Taxpayer ITR Filing

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 9:59 AM IST

Salaried Taxpayer ITR Filing : మీరు ఉద్యోగులా? ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Salaried Taxpayer ITR Filing
Salaried Taxpayer ITR Filing (Source : Getty Images)

Salaried Taxpayer ITR Filing : మీరు పన్ను చెల్లింపుదారులా? జీతం ద్వారా ఆదాయం పొందుతున్నారా? అయితే ఐటీఆర్​ దాఖలు చేసేటప్పుడు 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఐటీఆర్​ ఫైలింగ్​లో ఏమైనా పొరపాట్లు చేస్తే, భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. లీగల్ ప్రోబ్లమ్స్​ ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఐటీఐఆర్ ఫైల్ చేయడానికి జులై 31 వరకు గడువు ఉంది. కనుక ఐటీఐఆర్ ఫైల్ చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు, ఫారాలు సహా, ఇతర సమాచారాన్ని సేకరించుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయడానికి వీలవుతుంది.

లింక్ చేసుకోవాలి!
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు, మీ పాన్-ఆధార్ కార్డ్​లను లింక్ చేసుకోవాలి. ఒక వేళ మీ ఆధార్​-పాన్​ కార్డులను లింకు చేయకపోతే, రీఫండ్ రావడం కష్టమవుతుంది. మీ బ్యాంక్ ఖాతా వివరాలు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, మీరు కోరుకున్న బ్యాంక్​ ఖాతాలోనే రీఫండ్ సొమ్మును జమ చేస్తారు.

సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవడం ముఖ్యం:
ఐటీఆర్​ రిటర్న్స్​ దాఖలు చేయడం కోసం సరైన ఫారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు పొరపాటున వేరే ఫారాన్ని దాఖలు చేస్తే, దానిని తిరస్కరిస్తారు. అందుకే సాలరీడ్​ ట్యాక్స్​ పేయర్స్​ ITR-1 ఫారంను ఎంచుకోవాలి.

ITR-1 ఫారమ్ అంటే ఏమిటి?
మీరు భారతదేశంలో నివసిస్తూ ఉండి, ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువగా ఉంటే ITR-1 ఫారమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు వచ్చే ఆదాయం - జీతం, ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం, కుటుంబ పెన్షన్, వ్యవసాయ ఆదాయం (గరిష్ఠంగా రూ.5,000 వరకు), పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ, డిపాజిట్లు, కాంపన్సేషన్స్​ నుంచి మాత్రమే వచ్చి ఉండాలి.

ITR-1ను ఎవరు ఫైల్ చేయలేరు!

  • మీరు భారతీయ పౌరుడు కాకపోతే, మీరు ITR-1ని ఫైల్ చేయలేరు.
  • మీ మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఐటీఆర్-1 ఫైల్ చేయలేరు.
  • మీరు లాటరీ, గుర్రపు పందెం, చట్టపరమైన బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తే ఐటీఆర్-1 ఫైల్ చేయలేరు.
  • క్యాపిటల్ గెయిన్స్ పొందినప్పుడు మీరు ITR -1 ఫారం దాఖలు చేయలేరు.
  • అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా ఐటీఆర్ - 1 దాఖలు చేయలేరు.

ఈ పత్రాలు అవసరం:
వార్షిక సమాచార వివరాలు (AIS) డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో మీరు మీ మునుపటి పన్ను వివరాలన్నీ పొందుతారు. ఫారం 16, ఇతర ముఖ్యమైన పత్రాలు మీ వద్ద ఉంచుకోవాలి.అయితే, పెట్టుబడి లేదా TDS రుజువు రిటర్న్‌తో పాటు సమర్పించాల్సిన అవసరం లేదు.కానీ, మీరు ఈ పత్రాలను మీ వద్ద ఉంచుకోవాలి, తద్వారా మీరు వాటిని అసెస్‌మెంట్ లేదా విచారణ సందర్భంలో అధికారులకు చూపవచ్చు.

ITR ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు:
స్పాట్ డిస్క్రెపెన్సీ:
ముందుగా AIS, ఫారమ్ 26AS డౌన్‌లోడ్ చేసుకోండి.అసలు TDS/TCSని తనిఖీ చేయండి. ఏదైనా తేడా గమనిస్తే వాటిని సరిదిద్దాలని గుర్తుంచుకోండి.

డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా పరిశీలించాలి:
మీ ITR ఫైల్ చేసేటప్పుడు అవసరమైన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు/పాస్‌బుక్‌లు, వడ్డీ సర్టిఫికెట్‌లు, మినహాయింపులు లేదా తగ్గింపులను క్లెయిమ్ చేసినందుకు రశీదులు, ఫారం 16, ఫారం 26AS, పెట్టుబడి రుజువుల వంటి అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా పూరించిన డేటాలో PAN, శాశ్వత చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి.

ఈ-వెరిఫికేషన్ మస్ట్​!
ఐటీఆర్ రిటర్న్‌ను ఈ-ఫైలింగ్ చేసిన తర్వాత, దాన్ని ఈ-వెరిఫికేషన్ చేయాలి. మీ రిటర్న్‌ను మాన్యువల్‌గా వెరిఫై చేయాలనుకుంటే, మీరు ITR-V అక్‌నాలెడ్జ్‌మెంట్ సంతకం చేసిన కాపీని స్పీడ్ పోస్ట్ ద్వారా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు- 560500 చిరునామాకు పంపవచ్చు. ఈ దశలతో, మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం చాలా సులభం. తప్పులను నివారించడానికి, సాఫీగా పన్ను దాఖలు ప్రక్రియను నిర్ధరించడానికి మీ ఫారమ్‌లు,పత్రాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.

కేంద్ర ప్రభుత్వానికి RBI రూ.2 లక్షల కోట్ల డివిడెండ్ - గతేడాదితో పోలిస్తే డబుల్! - RBI Dividend Payout To Govt

లాంఛ్​కు బజాజ్​ CNG బైక్ రెడీ- తక్కువ ధర, పవర్​ఫుల్ ఇంజిన్, స్టైలిష్ లుక్! - Bajaj Bruzer CNG Bike Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.