ETV Bharat / business

గుడ్​న్యూస్​- భారీగా తగ్గిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా! - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 8:38 AM IST

Updated : May 23, 2024, 9:45 AM IST

Gold Rate Today May 23rd 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Source : Getty Images)

Gold Rate Today May 23rd 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల​ బంగారం ధర రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.75,700గా ఉంది. కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.94,680గా ఉంది.

  • Gold Rate Today May 23rd 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,700గా ఉంది. కిలో వెండి ధర 94,680గా ఉంది.
  • Gold Rate Today May 23rd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.75,700గా ఉంది. కిలో వెండి ధర రూ.94,680గా ఉంది.
  • Gold Rate Today May 23rd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,700గా ఉంది. కిలో వెండి ధర రూ.94,680గా ఉంది.
  • Gold Rate Today May 23rd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.75,700గా ఉంది. కిలో వెండి ధర రూ.94,680గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 23rd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో కూడా ​గోల్డ్, సిల్వర్​ రేట్లు తగ్గాయి. ఔన్స్ గోల్డ్​ ధర 40 డాలర్లు తగ్గి 2369 డాలర్లుగా ఉంది. ఔన్స్​ సిల్వర్​ ధర 30.74 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 23rd 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.50,65,275
ఇథీరియం రూ.2,86,000
టెథర్రూ.79.16
బైనాన్స్ కాయిన్రూ.46,200
సొలోనారూ.13,550

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 23rd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today May 23rd 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 74,243 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,599 దగ్గర కొనసాగుతోంది. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో నేటి కరెన్సీ మార్కెట్లు పనిచేయడం లేదు.

సెన్సెక్స్‌-30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్, ఎల్‌ అండ్‌ టి, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, టైటన్‌, విప్రో, రిలయన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

ఆన్​లైన్ మోసాలు - ఎన్ని రకాలుగా చేస్తున్నారో తెలుసా? - Types Of Online Fraud

డ్రైవింగ్ లైసెన్స్​ తీసుకోవాలా? జూన్ 1 నుంచి నయా రూల్స్​ - ఇకపై నో టెస్ట్​ డ్రైవ్​! - Driving Licence New Rules

Last Updated : May 23, 2024, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.