ఐడియా అదిరింది గురూ - హాట్ సమ్మర్​లో హబీబ్‌ భాయ్‌ ఆటోలో కూల్​ కూల్​ జర్నీ - FREE DRINKING WATER IN AUTO

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 2:30 PM IST

thumbnail
అదిరింది ఆటో డ్రైవర్‌ హబీబ్‌ భాయ్‌ ఆలోచన - ఉచితంగా డ్రికింగ్​ వాటర్​

Man Providing Free drinking water in Auto : గతంలో ఎదురైన అనుభవం, ఈ ఏడాది కాసిన తీవ్రమైన ఎండలు ఆ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనకు కారణమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆటోవాలాలకు కొత్త పోకడ అలవాటు చేయాలని, ప్రయాణికుల అలసట తీర్చాలని ఆ పెద్దాయన చేసిన ఆలోచన అందర్నీ ఆలోచింపజేస్తోంది. సాటి వారికి తోచిన సాయం చేయడంలోనే మనిషికి సంతృప్తి దొరుకుతుందనేది ఆ ఆటో డ్రైవర్ మాట. 

మిత్రుడి సాయంతో ఆటోకే ఓ సెటప్ ఏర్పాటు చేసి, కూర్చునేందుకు వసతి, ఎండ తగలకుండా ప్రత్యేక రూఫ్ సిస్టమ్, తాగడానికి డ్రింకింగ్ వాటర్ వసతి కల్పించారు. అలా హబీబ్ భాయ్ ఆటో ఎక్కే ప్రయాణికులు మండుటెండలో కూల్ కూల్​గా ప్రయాణిస్తూ చల్లటి నీళ్లు తాగుతూ హాయిగా ప్రయాణిస్తున్నారు. హబీబ్ భాయ్ వినూత్న ప్రయతంపై ప్రయాణికులతో పాటు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పక్కన ఎవరైనా చావుబతుకుల్లో ఉన్నా కనీసం పట్టించుకోనే నేటి పరిస్థితుల్లో ప్రయాణికుల కోసం ఆలోచించి, వారు ఎండలో ఇబ్బంది పడకూడదని ఈ ఆటోవాలా చేసిన ప్రయత్నాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. మరి హబీబ్ భాయ్​కి ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.