బ్రిటీషర్లకు రామాయణ ప్రాముఖ్యతను తెలియజేస్తున్న తెలుగుంటి ఆడపడుచు - Story Hour Founder Interview

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 5:22 PM IST

thumbnail
తెలుగు నేలపై జన్మించి - యూకేలో రామాయణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేకత (ETV Bharat)

Story Hour Founder Neelima Interview : రామాయణం. మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే. ఎన్నోసార్లు సినిమాలు, సీరియల్స్​, కథల రూపంలో చదివినదే. అలాంటి ఈ రామాయణం గొప్పతనం అందరికీ తెలియాలి. అందులో బ్రిటన్‌ వారికీ దీని పరమార్థం తెలియజెప్పాలి అని ధృఢంగా నమ్మిన ఆ మహిళ, అందుకు వడివడిగా అడుగులు వేశారు. స్టోరీ అవర్ పేరిట ఓ సంస్థను స్థాపించి రామాయణ కథలను పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. 

తెలుగు నేలపై జన్మించి, యూకేలో రామాయణ ప్రాముఖ్యతను తెలియపరుస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న నీలిమ, కథలు, సామెతలు సులభంగా అర్థమయ్యేలా తోలు బొమ్మల సాయంతో వివరిస్తున్నారు. ఇందుకోసం పిల్లలు, పెద్దలతో కలిసి పని చేస్తున్నారు. అంతేనా ఆడియో బుక్స్‌ ద్వారా మరెన్నో కథలు చెబుతూ యూకేతో పాటు తెలుగు వారి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఇందుకు చేసిన కృషి, ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నాలు, తదితర అంశాలను తెలిపేలా స్టోరీ అవర్ వ్యవస్థాపకురాలు నీలిమతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.