వాహనదారుల కోసం ట్రాఫిక్ సిగ్నల్​ దగ్గర గ్రీన్​ మ్యాట్స్​ - ఎండల నుంచి ఉపశమనం - HMDA Green Mats at Traffic Signals

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 5:37 PM IST

thumbnail
వాహనదారుల కోసం ట్రాఫిక్ సిగ్నల్​ దగ్గర గ్రీన్​ మ్యాట్స్​ ఎండల నుంచి ఉపశమనం (ETV Bharat)

Green Mats at Traffic Signals in Hyderabad : వేసవి కాలం అవ్వడంతో భాగ్యనగరంలో ఎండలు మండిపోతున్నాయి. బయటకి వెళ్లాలంటే పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. అందులోను మధ్యాహ్నం బయటకి వెళ్లాలంటేనే భయమేస్తోంది. జాగ్రత్తలు పాటిస్తూ తప్పనిసరి పరిస్థితులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్​ సిగ్నల్​ దగ్గరైతే చెప్పక్కర్లేదు. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సిగ్నల్​ పడేంత వరకు ఎండలో ఉంటాలంటే సాహసమనే చెప్పాలి. అందువల్ల వీరి కోసం ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రయోగాత్మకంగా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్​ దగ్గర గ్రీన్​ మ్యాట్స్​ను ఏర్పాటు చేసింది. 

Uses OF Green Mats at Traffic Signals : కొన్ని కూడళ్లలో నీడ వచ్చేలా గ్రీన్​ మ్యాట్స్​ను ఏర్పాటు చేయడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఎంచక్కా సిగ్నల్​ పడేంత వరకు నీడలో సేద తీరుతున్నారు. మరికొంత మంది ఏప్రిల్​ మొదటి వారంలో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి ఉంటే మరింత బాగుండేదని చెబుతున్నారు. ఎక్కువ ట్రాఫిక్​ వల్ల సిగ్నల్ దగ్గర 2-3 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోందని ఈ గ్రీన్​ మ్యాట్స్​ వల్ల కాస్త నీడ దొరుకుతుందని తెలిపారు. ఇవి అన్ని కూడళ్లలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.