ETV Bharat / health

మీ శరీరం నుంచి ఈ రకమైన దుర్వాసన వస్తోందా? - అయితే, మీకు డయాబెటిస్ ఖాయం! - Body Odour Can Be Sign of Diabetes

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 9:44 AM IST

Diabetes Warning Signs : డయాబెటిస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని ముందస్తుగా గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకోకుంటే.. ఫ్యూచర్​లో తీవ్ర ఆరోగ్య సమస్యలు గ్యారెంటీ. అయితే.. షుగర్ ఉందా లేదా? అన్నది రక్త పరీక్షతో తెలుస్తుంది. కానీ.. షుగర్ దాడిచేసే వారి నుంచి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుందని.. దీని ద్వారా కూడా ప్రమాదాన్ని పసిగట్టవచ్చు అంటున్నారు నిపుణులు మరి.. మీ నుంచి వస్తోందా??

Body Odours Can Be A Sign of Diabetes
Diabetes Warning Signs (ETV Bharat)

Body Odour Can Be A Sign of Diabetes : మధుమేహం వచ్చిందో లేదో అనే విషయం రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది. కానీ.. శరీరం నుంచి వచ్చే స్మెల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి.. శరీరం నుంచి వచ్చే దుర్వాసనలకు మధుమేహానికి(Diabetes) సంబంధమేంటి? వాటిని ఎలా గుర్తించాలి? ఒకవేళ మధుమేహం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చెడు వాసనలకు కారణమేమిటంటే?

రక్తంలోని చక్కెరను శక్తిగా ఉపయోగించడం కోసం బాడీలో తగినంత ఇన్సులిన్ అవసరం. అది కావాల్సినంత లేనప్పుడు షుగర్ సమస్య తలెత్తుతుందంటున్నారు నిపుణులు. అప్పుడు లివర్.. ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. అది కీటోన్స్ అనే యాసిడ్స్​ను రిలీజ్ చేస్తుంది. అయితే.. చాలా కీటోన్స్ వేగంగా రిలీజ్ అవ్వకుండా రక్తం, మూత్రంలో నిల్వ ఉండి, ప్రమాదకర స్థాయికి చేరతాయి. కాలేయం లోపల జరిగే ఈ ప్రతిచర్య ఫలితంగా.. రక్తం ఆమ్లంగా మారుతుంది. అప్పుడు అది మొత్తం మూడు రకాల వాసనలను రిలీజ్ చేస్తుందంటున్నారు. ఇవి చెమట, శ్వాస ద్వారా బయటకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలోని అధిక స్థాయి కీటోన్‌లను సూచించే ఈ వాసనలు ఎలా ఉంటాయంటే?

  • పండ్ల వాసనతో కూడిన శ్వాస వస్తుంది.
  • మలం లాంటి చెడు శ్వాస వస్తుంది. ఇది దీర్ఘకాలిక వాంతులు, పేగు సమస్యల వల్ల కూడా కావొచ్చంటున్నారు నిపుణులు.
  • అమోనియా వంటి వాసనతో కూడిన శ్వాస వస్తుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక కిడ్నీ వైఫల్యం ఉన్నవారిలో కనిపిస్తుంది.
  • మధుమేహం వచ్చిన వారిలో శ్వాస వాసన కాకుండా ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
  • నీరసం
  • అధిక మూత్రవిసర్జన
  • తీవ్రమైన శ్వాసలు
  • వాంతులు
  • వికారం
  • కడుపులో నొప్పి
  • బరువు తగ్గడం
  • చెమటలు పట్టడం

2019లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ ఉన్న రోగులలో అధిక మూత్ర విసర్జన, అధిక దాహం అత్యంత సాధారణ లక్షణాలుగా కనుగొన్నారు. ఈ పరిశోధనలో డాక్టర్ జాన్ డో పాల్గొన్నారు. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ ఉన్నవారిలో శరీరం నుంచి కొన్ని దుర్వాసనలతో పాటు అధిక మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్ : మందు తాగితే షుగర్‌ పెరుగుతుందా? - నిపుణుల సమాధానమిదే!

డయాబెటిక్ కీటోయాసిడోసిస్​ను ఎలా నివారించాలంటే?

  • టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్‌ఫెక్షన్, గాయం, తీవ్రమైన అనారోగ్యం, శస్త్రచికిత్స, ఇన్సులిన్ ఇంజెక్షన్ డోస్ మిస్సింగ్ వంటి కారణాలతో కీటోయాసిడోసిస్‌ సంభవించవచ్చంటున్నారు నిపుణులు.
  • టైప్ 2 డయాబెటిస్ వ్యక్తులలో డయాబెటిస్ కీటోయాసిడోసిస్ తక్కువ తరచుగా, తీవ్రంగా ఉంటుందంటున్నారు. అయినప్పటికీ.. ఇది చాలా కాలం పాటు అనియంత్రిత రక్తంలో చక్కెర ద్వారా ప్రేరేపించబడవచ్చంటున్నారు.
  • మధుమేహం లేనివారికి కూడా కీటోయాసిడోసిస్ రావొచ్చంటున్నారు నిపుణులు. ఇది ఆకలిగా ఉన్న సందర్భాలలో వస్తుందట.

ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే..

  • డయాబెటిస్ ఉన్న వ్యక్తులు వారి స్థాయిలను తెలుసుకోవడానికి, పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు వారి రక్తంలో షుగర్ లెవల్స్​ రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
  • అలాగే.. సంబంధిత డాక్టర్ సూచించిన మెడిసిన్స్ తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.
  • ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే ఇన్సులిన్ వేసుకోవడానికి ముందు డాక్టర్​ని తప్పక సంప్రదించాలంటున్నారు.
  • ముఖ్యంగా మీ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్​లో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్‌ వ్యాధికి రోజూ మందులు వాడొద్దంటే - ఇలా చేస్తే సరిపోతుంది! - How To Control Diabetes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.