తెలంగాణ

telangana

ఈ 5 అలవాట్లు మిమ్మల్ని అప్పులపాలు చేస్తాయి - వెంటనే వాటిని మానుకోండిలా!

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 12:14 PM IST

How To Break Bad Money Habits In Telugu : మీరు అతిగా ఖర్చు చేస్తూ ఉంటారా? ఇప్పటికే చేసిన అప్పులతో సతమతమవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు మనల్ని ఆర్థికంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి అలవాట్ల నుంచి ఎలా బయటపడాలి? ఆర్థికంగా మనల్ని, మనం ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

5 bad money habits and how to break them
how to break bad money habits

How To Break Bad Money Habits : పైసా మే పరమాత్మ, ధనం మూలం ఇదం జగత్.. డబ్బు గురించి మనం తరచూ వినే మాటలు. ఇవి మన లైఫ్​లో డబ్బు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టంగా తెలియజేస్తాయి. మన ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేకపోతే అప్పులపాలవడమే కాకుండా కష్టాల్లో పడతాం. అందుకే డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. కానీ, ఓ 5 రకాల అలవాట్లు మనల్ని ఆర్థికంగా అస్థిరపరుస్తాయి. ఆ అలవాట్లు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసకుందాం.

1. పరిమితికి మించి ఖర్చు చేయడం :కొంత మంది అవసరమైన దానికంటే అధికంగా ఖర్చులు చేస్తుంటారు. దీని వల్ల భవిష్యత్​లో కచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఖర్చులను నియంత్రించుకునేందుకు.. బడ్జెట్ విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే క్రమశిక్షణతో ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి వీలవుతుంది. బడ్జెట్ లేకపోతే విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రమాదముంటుంది. దీనిని నివారించుకునేందుకు.. మీరు కచ్చితంగా నెలవారీ బడ్జెట్​ను రూపొందించుకోవాలి. మీ ఆదాయం, ఖర్చుల వివరాల్ని ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోవాలి. దుబారా ఖర్చులను వీలైనంత వరకు తగ్గుంచుకోవాలి. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుని.. అందుకు అనుగుణంగా బడ్జెట్​ ప్లాన్​ చేసుకోవాలి.

2. భారీగా అప్పులు చేయడం :
మరికొంత మంది అవసరాల కోసం కాకుండా.. జల్సాల కోసం అప్పు చేస్తూ ఉంటారు. ఇది వారిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టివేస్తుంది. కనుక అనవసర విషయాల కోసం.. సాధ్యమైనంత వరకు అప్పు చేయకపోవడమే ఉత్తమం. కొందరు తాము తీసుకున్న రుణాలను, లేదా రుణ వాయిదాలను సకాలంలో చెల్లించరు. దీనితో పెనాల్టీలు, అధిక వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దీనితో క్రమంగా వారు అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. అందుకే తీసుకున్న అప్పును.. ఎలా పడితే అలా ఖర్చుచేయకుండా, సక్రమంగా వినియోగించుకోవాలి.

నేడు క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే.. తరువాత ఆర్థికంగా మీరే ఇబ్బంది పడతారు. అప్పుల ఊబిలోకి జారకుంటారు. అంతే కాదు మీ క్రెడిట్ స్కోర్​ కూడా దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్​లో రుణాలు పొందే అవకాశం కూడా తగ్గుతుంది. అందుకే క్రెడిట్ కార్డులను అవసరాల కోసం మాత్రమే.. చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది.

3. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోకపోవడం :
ప్రమాదాలు చెప్పి రావు. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి)ని ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం మీ ఆదాయంలోని కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఇది అనుకోని అత్యవసర పరిస్థితుల్లో మీపై ఆర్థిక ఒత్తిడి లేకుండా చేస్తుంది. అత్యవసర నిధి లేనప్పుడు క్రెడిట్ కార్డులు, రుణాలు, అధిక వడ్డీపై లోన్ తీసుకోవడం లాంటివి చేయాల్సి వస్తుంది. వీటి వల్ల తర్వాతి కాలంలో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

4. ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం :
ఈ కాలంలో ప్రతి ఒక్కరికీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్​తప్పనిసరి. ప్రమాదాలు, అకాల మరణాలు సంభవించినప్పుడు ఇవి మన కుటుంబానికి మంచి ఆర్థిక రక్షణ కల్పిస్తాయి. అందుకే మీ సంపాదనలో కొంత మొత్తాన్ని జీవితా బీమా, ఆరోగ్య బీమాల కోసం కేటాయించండి. దీని వల్ల మీతోపాటు, మీ కుటుంబ సభ్యులకు తగినంత బీమా కవరేజీ లభిస్తుంది.

5. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోకపోవడం :
పదవీ విరమణ చేసిన తర్వాత సంతోషంగా గడపాలని అందరూ అనుకుంటారు. కానీ సరైన ఆర్థిక ప్రణాళిక లేకుంటే.. అది ఒక కలగానే మిలిగిపోతుంది. అందుకేరిటైర్మెంట్ కోసం తగిన ప్రణాళికను తొందరగా ప్రారంభించాలి. అంతే కాదు మంచి ఆదాయం వచ్చే మార్గాల్లో పెట్టుబడులు కూడా పెట్టాలి. అప్పుడే రిటైర్​మెంట్ నాటికి మంచి కార్పస్ ఏర్పడుతుంది.

ఈ క్రెడిట్‌ కార్డులు లైఫ్‌టైమ్‌ ఫ్రీ - సూపర్ బెనిఫిట్స్ కూడా!

హోమ్​ లోన్ EMI భారాన్ని - గడువుకన్నా ముందే తీర్చుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details