ETV Bharat / business

సొంత ఇల్లు ఏ ఏజ్​లో కొంటే బెటర్? - HOME BUYING GUIDE INDIA

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 3:11 PM IST

Best Age To Buy A House In India : మీరు కొత్త ఇంటిని కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఇల్లు కొనేటప్పుడు ఏయే అంశాలను పరిగనణలోకి తీసుకోవాలి? బడ్జెట్​ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏ ఏజ్​లో ఇల్లు కొనడం బెటర్? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Best Age To Buy A House In India
Best Age To Buy A House In India (Getty Images)

Best Age To Buy A House In India : జీవితంలో ఇల్లు కొనడం అనేది ఎవరికైనా ఓ ముఖ్యమైన మైలురాయి. ఇంటిని పొందే ప్రక్రియకు సమగ్ర పరిశీలన, వ్యూహాత్మక ప్రణాళికలు అవసరం. పాత కాలంలో ప్రజలు 40- 50 ఏళ్ల వయసులో సొంతింటి కలను సాకారం చేసుకునేవారు. అయితే పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి దృష్ట్యా ప్రస్తుత కాలంలో తక్కువ వయసులోనే ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ వయసులో ఇల్లు కొనుగోలు చేయడం బెటర్? ఇల్లు కొనుగోలు చేసేటప్పప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డౌన్ పేమెంట్
హోమ్​ లోన్​ పొందటానికి రుణ మొత్తంలో 20శాతం డౌన్‌ పేమెంట్‌ మీ వద్ద ఉండాలి. ఈ డౌన్ పేమెంట్ మీకు అవసరమైన రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. డౌన్ ​పేమెంట్‌ కోసం ముందుగానే పొదుపును ప్రారంభించడం చాలా అవసరం. డౌన్​ పేమెంట్‌ శాతం ఎక్కువ ఉంటే ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. దీనివల్ల లోన్​ భారం అంతగా అనిపించదు. కొందరికి డౌన్ పేమెంట్​ను కూడబెట్టడానికి చాలా సమయం పట్టొచ్చు. ఈ పేమెంట్​ను పొదుపు చేసేసరికి చాలా మందికి 30 ఏళ్లు దాటిపోతాయి.

కెరీర్ స్టెబిలిటీ
హోమ్ లోన్ కట్టేందుకు స్థిరమైన ఆదాయం అవసరం. అందుకే ఉద్యోగ, వ్యాపార జీవితంలో బాగా స్థిరపడడం వల్ల ఇల్లును కొనుగోలు చేసేందుకు ఆర్థిక భద్రత లభిస్తుంది. కొందరు వేగంగా వృత్తిపరంగా బాగా స్థిరపడడం వల్ల 30 ఏళ్లలోనే సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు.

క్రెడిట్ స్కోర్
క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మనకు సులభంగా లోన్స్ మంజూరు అవుతాయి. వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. అందుకే రుణ గ్రహీతలకు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. ఇల్లును కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్ అనేది చాలా కీలకమని అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే హోమ్ లోన్‌ ఈజీగా పొందొచ్చని, అలాగే వడ్డీ రేటు తక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే మంచిదని అంటున్నారు. ' క్రెడిట్ స్కోర్ బాగుంటే మీరు ఆర్థిక వ్యవహారాలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారని అర్థం. రుణాలు, క్రెడిట్ కార్డ్‌ బిల్లులను సకాలంలో చెల్లించాలి. అప్పుడే మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటుంది. ఈజీగా లోన్లు పొందొచ్చు. క్రెడిట్ స్కోర్ బాగోకపోతే మీ హోమ్ లోన్ ధరఖాస్తును బ్యాంకు అధికారులు తిరస్కరించవచ్చు. లేదంటే అధిక వడ్డీల భారం మోపవచ్చు.' అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం
పెళ్లయ్యాక ఇంటిని కొనుగోలు చేయాలని కొందరు యువత అనుకుంటారు. అలాగే 30 ఏళ్ల వయసప్పుడు పిల్లలు కనాలని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు కుటుంబ కోసం ఇల్లు అవసరమై సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. మరికొందరు ఆర్థికంగా బలహీనంగా ఉంచి ఆఖరి 20 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేస్తారు.

ధరలు
ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ ప్రభావితం చేస్తాయి. భారతదేశంలో ప్రాంతం ఆధారంగా ఇల్లు రేట్లు ఉంటున్నాయి. తమ కావాల్సిన బడ్జెట్ లో ఇల్లు దొరకపోవడం వల్ల చాలా మంది 30 ఏళ్లదాటిన తర్వాత సొంతింటిని కొనుగోలు చేయగలుగుతున్నారు.

వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లు కూడా ఇల్లు కొనుగోలులో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే హోమ్ లోన్ తక్కువ వడ్డీకి లభిస్తే ఈజీగా ఇల్లును కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక బారం కూడా తగ్గుతుంది. తక్కువ వడ్డీ రేట్లు ఈఎంఐ భారాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ క్రమంలో యువత తక్కువ వయసులో సొంతింటిని కలను సాకారం చేసుకోవచ్చు. హోమ్ లోన్ పై అధిక వడ్డీ రేటు ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇల్లు కొనాలనుకునేవారు ఆర్ బీఐ పాలసీలు, మార్కెట్ ట్రెండ్ ను ఫాలో అవ్వాలి.

ఇల్లు కొనడానికి అనువైన వయసు
భారతదేశంలో ఇల్లు కొనడానికి అనువైన వయసు 30- 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ వయసులో ఆర్థిక స్థిరత్వం బాగుంటుంది. 30-35 ఏళ్లు మధ్య వయసువారు స్థిరమైన ఉద్యోగం, పెద్ద మొత్తంలో పొదుపు, దీర్ఘకాలిక వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటెన్ చేస్తారు. అలాగే 35-40 మధ్య వయసువారు కెరీర్ పై దృష్టి సారిస్తారు.

మీరు ఉద్యోగులా? ITR ఫైల్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోకండి! - Salaried Taxpayer ITR Filing

కేంద్ర ప్రభుత్వానికి RBI రూ.2 లక్షల కోట్ల డివిడెండ్ - గతేడాదితో పోలిస్తే డబుల్! - RBI Dividend Payout To Govt

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.