ETV Bharat / business

How To Plan For Retirement : పదవీ విరమణ ప్రణాళిక.. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ప్రారంభించాలి?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 2:44 PM IST

How To Plan For Retirement : పదవీ వరమణ అనంతరం మిగిలిన జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే సరైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవాలి. మలి వయసులో ఉపయోగపడే సరిపడా డబ్బును చిన్న వయసులోనే జమచేసుకోవాలి. ఈ నేపథ్యంలో రిటైర్‌మెంట్‌ కోసం ఏ వయసులో ఎలాంటి ప్లాన్​తో ముందుకెళ్లాల్లో ఇప్పుడు చూద్దాం.

Steps To Follow For Better Life After Retirement
How To Plan For Retirement

How To Plan For Retirement : దేశంలో అధిక శాతం యువత పదవీ విరమణ లక్ష్యాలపై అంతగా దృష్టి సారించడం లేదని ఓ బ్యాంక్​ నిర్వహించిన సర్వే ఆధారంగా వెల్లడైంది. 30 ఏళ్ల వయసు రాకముందే పదవీ విరమణ ప్రణాళిక గురించి ఆలోచన చేయాలని సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా చాలా మంది తమ వార్షిక ఆదాయానికి 10 రెట్ల నిధి రిటైర్‌మెంట్ తర్వాతి అవసరాలకు సరిపోతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రిటైర్​మెంట్​ ప్లాన్​ గురించి చిన్న వయసులోనే సీరియస్​గా ఆలోచించాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అసలు రిటైర్‌మెంట్‌ ప్రణాళిక ఎప్పటి నుంచి మొదలుపెట్టాలి? ఏఏ వయసులో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిని సాకుగా చూపకండి..
Retirement Plan : ప్రస్తుతం ఉండే ఆర్థిక అవసరాలు చాలా మందికి రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ అడ్డంకిగా మారుతుంటాయి. నెలనెలా వచ్చే ఆదాయంలో అధిక శాతం లోన్​ ఈఎంఐలకు, కార్లు, ఇల్లు, విద్యా రుణం ఇలా రకరకాల లోన్స్​ కట్టాడానికే సరిపోతుంది. దీంతో పదవీ విరమణకు కావాల్సిన డబ్బును దాచుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొందరైతే ఉద్యోగ భవిష్య నిధి నుంచి కూడా డబ్బును తీసుకొని తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే, ఇవేవీ పదవీ విరమణ లక్ష్యాలకు అడ్డంకిగా మారకుండా చూసుకోవాలి.

ఎంత కావాలి?
Retirement Goals : పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగడానికి ఎంత మొత్తం నిధి అవసరం పడుతుందో చాలా మంది అంచనా వేయలేక పోతున్నారు. రిటైర్‌మెంట్‌కు ఇంకా కొన్ని దశాబ్దాల సమయం ఉన్నవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 30 రెట్ల సొమ్మును దాచి ఉంచుకోవాలని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు రూ.లక్ష అనుకుంటే.. ఏడాదికి రూ.12 లక్షల చొప్పున మీరు రూ.3.6 కోట్ల నిధిని రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం కోసం పోగు చేసుకోవాల్సి ఉంటుంది.

చిన్నవయసులోనే ప్రారంభించండి..
మీ రిటైర్‌మెంట్‌ లక్ష్యం ఏంటో 20 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకోవడం ఉత్తమం. దాన్ని చేరుకోవాలంటే ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలో ఒక అంచనాకు రావాలి. ప్రతి నెలా కొంత మొత్తం పక్కకు తీసి మదుపు చేస్తే కాంపౌండింగ్‌ పద్ధతి ద్వారా భారీ మొత్తంలో నిధిని ఆదా చేసుకోవచ్చు. పైగా తక్కువ వయసులోనే ఈ ప్రక్రియ మొదలుపెడితే ఈక్విటీల లాంటి రిస్క్‌ ఉండే ఆర్థిక సాధనాల్లోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీంతో మీ రాబడిని కూడా సులువుగా పెంచుకోవచ్చు.

ఆరోగ్య బీమా తప్పనిసరి..
అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీలను కచ్చితంగా తీసుకోవాలి. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే మీ రిటైర్‌మెంట్‌ ప్లాన్‌కు ఢోకా తగులుతుంది. అలాగే కనీసం ఆరునెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్​ను వేరేగా జమచేసుకోవాలి.

వాటిని కూడా కొనసాగించాలి..
30, 40 ఏళ్లు వచ్చేనాటికి మీకు ఒక జీవనశైలి అలవాటై ఉంటుంది. దీని సాయంతో మీ రిటైర్​మెంట్​కు ఎంత మొత్తం కావాలో సులువుగా నిర్ధరించుకోవచ్చు. ఇన్వెస్ట్​ చేసే మొత్తాన్ని ఏటా 20- 25 శాతం పెంచుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. పూర్తిగా రిస్క్‌ కలిగిన సాధనాల్లో కాకుండా.. ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్లు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ లాంటి వివిధ మార్గాల్లో మదుపు చేసే అవకాశాలను ఎంచుకోవచ్చు. అదే సమయంలో ఎన్‌పీఎస్‌, ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ లాంటి రిటైర్‌మెంట్‌ ప్లాన్లనూ కొనసాగించాలి.

టూ లేట్​ అయినా సరే..
అనేక కారణాల వల్ల 50ల్లోకి అడుగుపెట్టేంత వరకు కొంతమందికి రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ అస్సలు సాధ్యం కాదు. అయితే అప్పటికీ మించిపోయింది ఏమీ ఉండదు. వారు కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే.. రిటైర్​మెంట్​ తర్వాత కావాల్సిన సొమ్మును త్వరగానే పోగు చేసుకోవచ్చు. అయితే ఈ వయసులో కోరికలు, లగ్జరీ లైఫ్​, విలాసాలను కాస్త కంట్రోల్​ చేసుకోవాల్సేందే అంటున్నారు ఫైనాన్షియల్​ ఎక్స్​పర్ట్స్. దీంతో రెగ్యులర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు అదనపు సొమ్మును మదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది.

అవసరమైతే ఆస్తులమ్మైనా..
అవసరమైతే చిన్నాచితకా ఆస్తులేమైనా ఊరికే పడి ఉంటే వాటిని విక్రయించి పదవీ విరమణ కోసం వేరే చోట మదుపు చేయడం ఉత్తమమైన మార్గమని నిపుణులు అంటున్నారు. అయితే పిల్లల అవసరాలు, తల్లిదండ్రుల ఖర్చులను నిర్వహించుకుంటూ ఈ వయసులో రిటైర్‌మెంట్‌ నిధిని పోగు చేయడం అనేది కాస్త కష్టమే అయినా.. పిల్లల పెళ్లిళ్లు, ఇంట్లో శుభకార్యాల లాంటి వాటిని గ్రాండ్​గా కాకుండా సింపుల్​గా జరిపిస్తే సరిపోతుంది.

IRCTC Zomato Tie Up : రైలు ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. ఇకపై ట్రైన్​లోనూ జొమాటో ఫుడ్ డెలివరీ షురూ!

How To Check Gas Subsidy Status : గ్యాస్​ స‌బ్సిడీ డబ్బులు మీ అకౌంట్​లో పడ్డాయా? ఈజీగా చెక్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.