ETV Bharat / business

How To Check Gas Subsidy Status : గ్యాస్​ స‌బ్సిడీ డబ్బులు మీ అకౌంట్​లో పడ్డాయా? ఈజీగా చెక్ చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 11:10 AM IST

How To Check Gas Subsidy Status : ప్ర‌తి ఇంట్లో దాదాపుగా గ్యాస్ సిలిండ‌ర్ వాడతారు. కేంద్రం దీనిపై స‌బ్సిడీ ఇస్తుంద‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ ఆ స‌బ్సిడీ డబ్బు ప‌డిందా లేదా అన్న‌ది ఎలా చెక్ చేసుకోవాలో తెలియ‌దు. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పడ్డాయో? లేదా? అని ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.

How To Check Gas Subsidy Status
How To Check Gas Subsidy Status

How To Check Gas Subsidy Status : దాదాపుగా ప్ర‌తి ఇంట్లో గ్యాస్ క‌నెక్ష‌న్ ఉంటుంది. గ‌తంలో వంట చేసుకోవడానికి క‌ట్టెల పొయి వాడేవారు కానీ.. క్ర‌మేణా పెరిగిన టెక్నాల‌జీ, అందుబాటులోకి వ‌చ్చిన వ‌న‌రుల‌తో గ్యాస్​ను ఉప‌యోగిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏటా అర్హులైన వినియోగ‌దారుల‌కు 14.2 కిలోగ్రాముల 12 సిలిండర్లను ఇస్తుంది. క‌ట్టిన బిల్లులో కొంత కొంత మొత్తం స‌బ్సిడీ ఇస్తుంది. PAHAL (DBTL) పథకం కింద, LPG సిలిండర్‌లపై సంవత్సరానికి రూ. 10 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ సంబంధిత వినియోగ‌దారుల‌ బ్యాంకు ఖాతాలో జ‌మ అవుతుంది.

Gas Subsidy Check Online : అయితే.. గ్యాస్ సిలిండ‌ర్‌పై వ‌చ్చే ఈ స‌బ్సిడీని ఎలా చెక్ చేయాలో చాలా మందికి తెలియ‌దు. ఆన్​లైన్​లో మీ స‌బ్సిడీ వ‌చ్చిందో లేదో తెలుసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన IOCL, HP, BPCLలో మీ గ్యాస్ సబ్సిడీ స్థితిని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు మీ ఎల్​పీజీ ఐడీ తెలుసుకోవాలి.

  • ముందుగా http://mylpg.in/ వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • అక్కడ పైన కుడి వైపున మీ LPG ID కి సంబంధించిన వివ‌రాలు తెలుసుకునే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
  • అక్క‌డ మీ గ్యాస్ కంపెనీ పేరు అడుగుతుంది. భార‌త్, హెచ్​పీ, ఇండేన్​ గ్యాస్​ అనే 3 ఆప్ష‌న్లు ఉంటాయి. అందులో నుంచి మీరు వాడే కంపెనీ పేరు ఎంచుకోండి.
  • త‌ర్వాత మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్క‌డ మీ ఫోన్ నంబ‌రు లేదా గ్యాస్ పంపిణీ చేసే డిస్ట్రిబ్యూట‌ర్ పేరు, వినియోగ‌దారుని నంబ‌రు అడుగుతుంది. ఆ వివ‌రాలు నింపాలి.
  • ఆ త‌ర్వాత అక్క‌డ క‌నిపించే captcha code (క్యాప్చా కోడ్) ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి. ఇలా చేసిన త‌ర్వాత మీకు LPG ID వ‌స్తుంది.

స‌బ్సిడీ తెలుసుకోవ‌డానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • మ‌ళ్లీ అదే వెబ్ సైట్ ఓపెన్ చేసి పైన కుడి వైపున క‌నిపించే ఖాళీల్లో మీ LPG ID ఎంట‌ర్ చేయండి.
  • మీ రిజిస్ట‌ర్డ్ ఫోన్ నంబ‌రు ఎంట‌ర్ చేయండి.
  • త‌ర్వాత అక్క‌డ క‌నిపించే captcha నింపండి.
  • ఇదంతా చేసిన త‌ర్వాత మీ ఫోన్ నంబ‌రుకు ఒక వ‌న్ టైమ్ పాస్ వ‌ర్డ్ (ఓటీపీ) వ‌స్తుంది.
  • అది ఫిల్ చేయ‌గానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది.
  • అక్క‌డ మీ ఈమెయిల్ ఐడీ ఎంట‌ర్ చేసి ఒక పాస్ వ‌ర్డ్ క్రియేట్ చేసుకోండి.
  • త‌ర్వాత మీ ఈ-మెయిల్​కు యాక్టివేష‌న్ లింక్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
  • ఒక‌సారి http://mylpg.in/ ఓపెన్ చేసి మీ అకౌంట్ లోకి లాగిన్ అవండి.
  • లాగిన్ అయిన త‌ర్వాత అక్క‌డ View Cylinder Booking History / subsidy transferred ఆప్ష‌న్లపై క్లిక్ చేసి స‌బ్సిడీ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

How To Start A Gas Distribution Agency : గ్యాస్‌ ఏజెన్సీతో భారీ ఆదాయం.. అనుమతి ఎలా పొందాలో తెలుసా..?

How to Apply for Indane Gas New Connection : ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్​ కావాలా..? ఆన్​లైన్​లో ఇలా అప్లై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.