How to Apply for Indane Gas New Connection : ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ కావాలా..? ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి!
How to Apply for Indane Gas New Connection : మీరు కొత్తగా ఇండేన్ వంటగ్యాస్(LPG) తీసుకోవాలనుకుంటున్నారా? అయితే.. గతంలో మాదిరిగా ఏజెన్సీ వద్దకు వెళ్లి, లైన్లో నిలబడి చాలా సేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా మీరు ఉన్న చోటు నుంచే ఆన్లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్‌కు అప్లై చేసుకోవచ్చు. మరి, అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
How to Apply for Indane Gas New Connection in Online : గతంలో కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే.. అదొక పెద్ద పని. గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దేశంలో గ్యాస్ పంపిణీ సంస్థలు సేవలు సులభతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో ఇండేన్ వంటగ్యాస్(LPG) కలెక్షన్ తీసుకోవడాన్ని చాలా ఈజీ చేసింది. మరి, కొత్త కనెక్షన్కోసం ఏవిధంగా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Required Documents for Indane Gas New Connection :
ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ కోసం అవసరమైన పత్రాలు :
- ఆధార్ కార్డ్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఓటర్ ఐడీ
- టెలిఫోన్/నీటి/ విద్యుత్ బిల్లు
- పాస్‌పోర్ట్
- బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్
- ఇంటి రిజిస్ట్రేషన్ పత్రం
- ఫ్లాట్ స్వాధీనం లేఖ
పై జాబితాలో ఏదో ఒకటి గుర్తింపు పత్రంగా సమర్పించాల్సి ఉంటుంది.
How to Apply for Indane Gas New Connection in Online :
ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలంటే..
- మీరు మొదటగా ఇండేన్ గ్యాస్ అధికారిక వెబ్సైట్ సందర్శించి.. New Gas Connection అనే లింక్ క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీరు ఓపెన్ అయిన దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
- రాష్ట్రం, పంపిణీదారు పేరు, మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ముఖ్యమైన వివరాలను అందించాలి.
- అనంతరం అక్కడ వచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీరు అవసరమైన KYC పత్రాలు, గుర్తింపు, చిరునామా రుజువు, మీ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాలి.
- ఆపై రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత మీ పత్రాలు ధృవీకరించబడతాయి.
- మీరు నమోదుచేసిన అన్ని వివరాలు సరైనవయితే మీ దరఖాస్తు ఆమోదించబడుతుంది. మీకు ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ వస్తుంది.
How to Apply for Indane Gas New Connection in Offline :
డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్‌ని ఆఫ్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేయండి..
- మీ సమీపంలోని ఇండేన్ LPG డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లండి.
- మీకు తెలియకుంటే.. ఇండేన్ గ్యాస్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
- ఆఫీసుకు వెళ్లిన తర్వాత దరఖాస్తు ఫారమ్ ఇస్తారు.
- అందులో.. మీ వ్యక్తిగత వివరాలతో నింపి.. చిరునామా రుజువు, గుర్తింపు రుజువు వంటి KYC పత్రాలను యాడ్ చేసి డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వాలి.
- అలాగే.. మీకు సబ్సిడీ వర్తిస్తే అందుకోసం రెండు ఫొటో కాపీలు, సబ్సిడీ ధ్రువీకరణ పత్రాలు ను సమర్పించాలి.
- ఫార్మాలిటీ పూర్తయిన తర్వాత.. మీ గ్యాస్ డీలర్ కొత్త కనెక్షన్ విషయాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా.. లేదా ఈ-మెయిల్ ద్వారా ధ్రువీకరిస్తారు.
IOCL Apprentice Jobs : ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. IOCLలో అప్రెంటీస్ ఉద్యోగాలు!

