తెలంగాణ

telangana

'బైడెన్​ జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుడు' నివేదికలో షాకింగ్ విషయాలు!

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 12:23 PM IST

Updated : Feb 9, 2024, 1:12 PM IST

Joe Biden Memory : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు జ్ఞాపకశక్తి సరిగ్గా లేదని స్పెషల్ కౌన్సిల్ హుర్ ఇచ్చిన నివేదికపై మండిపడ్డారు. తనకు అన్ని విషయాలు గుర్తుంటాయని చెప్పారు.

Joe Biden Memory
Joe Biden Memory

Joe Biden Memory : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జో బైడెన్‌కు రహస్యపత్రాలకు సంబంధించిన నివేదిక అంశాలు ఇబ్బందికలిగించేలా మారాయి. అమెరికా రహస్య పత్రాలను బైడెన్‌ తన ఇంట్లో పెట్టుకోవడంపై ఓ నివేదిక ఇచ్చిన స్పెషల్‌ కౌన్సిల్‌ అందులో బైడెన్‌ జ్ఞాపకశక్తిపై సందేహాలు వ్యక్తం చేసింది. బైడెన్‌ను జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుడని పేర్కొంది. కాగా, ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. తనకు అన్ని స్పష్టంగా గుర్తుంటాయని చెప్పారు. అయితే ఇలా చెప్పిన కొద్ది సేపటికే మెక్సికో సరిహద్దుల్లో గాజా ఉందంటూ ఓ ప్రెస్​మీట్​లో చెప్పటం వల్ల మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

ఈజిప్టు అధ్యక్షుడిని మెక్సికో ప్రెసిడెంట్​గా
హుర్​ నివేదిక గురించి తెలుసుకున్న జో బైడెన్ తనకు అన్ని విషయాలు గుర్తుంటాయని ఓ విలేకర్ల సమావేశంలో అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎన్ని పనులు చేశానో చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో గాజాకు మానవీయ సాయం పంపడంపై బైడెన్​ను విలేకర్లు ప్రశ్నించారు. దానికి ఈజిప్టు అధ్యక్షుడుని మెక్సికో ప్రెసిడెండ్​గా పేర్కొన్నారు.' మీకు ముందే తెలుసు. మెక్సికో అధ్యక్షుడు ఎల్​ సీసీ సరిహద్దులు (గాజా సరిహద్దులు) తెరిచి మానవీయ సాయం పంపేందుకు ఇష్టపడలేదు. నేను ఆయనతో మాట్లాడి గేట్లు తెరిపించాను' అని బైడెన్ సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారు అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత అధ్యక్ష కార్యాలయ ప్రతినిధులు ఆ తప్పును సరిదిద్దాల్సి వచ్చింది.

ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉన్న రిపబ్లికన్ల చేతికి ఈ వీడియో క్లిప్ చేరింది. ఆ వీడియోను ఎక్స్‌లో బలహీనం, బాధాకరం, ఇక్కడ చూసేందుకు ఏమీలేదు అంటూ ట్రంప్ సలహాదారులు క్రిస్‌ లాసివిట, జేసన్‌ మిల్లర్లు కామెంట్లు పెడుతూ పోస్ట్ చేశారు. ఇప్పటికే బైడెన్‌ వృద్ధాప్యాన్ని, జ్ఞాపకశక్తిని తమ ప్రధాన ఎన్నికల అస్త్రంగా ప్రత్యర్థులు వాడుకుంటున్నారు.

స్పెషల్​ కౌన్సిల్ హుర్ నివేదిక
అయితే జో బైడెన్​ వయసు రీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు స్పెషల్ కౌన్సిల్ హుర్ ఇచ్చిన నివేదికలో తెలిపింది. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆయన ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నట్లు ఆరోపించింది. అలానే తన కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయమూ గుర్తు లేదని తెలిపింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని వెల్లడించింది. అయితే ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కంది.

అధ్యక్ష రేసులో ట్రంప్​ జోరు- రెండు ప్రైమరీ ఎన్నికల్లో విజయం

'ప్రపంచ సమస్యలపై భారత్ తెలివిగా వ్యవహరిస్తోంది'- నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Last Updated :Feb 9, 2024, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details