ETV Bharat / international

మే28 నుంచి 'స్వతంత్ర' దేశంగా పాలస్తీనా- మూడు దేశాల కీలక నిర్ణయం! - israel palestine war

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 2:51 PM IST

EU Countries Recognizing Palestine : స్వతంత్ర దేశంగా పాలస్తీనాను గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్​, స్పెయిన్​ దేశాలు చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. మే 28వ తేదీ నుంచి పాలస్తీనాకు అధికార గుర్తింపును ఇవ్వనున్నట్లు తెలిపాయి.

EU Countries Recognizing Palestine
EU Countries Recognizing Palestine (Associated Press)

EU Countries Recognizing Palestine : ఇజ్రాయెల్​- హమాస్​ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం జరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్​, స్పెయిన్​ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. మే28 నుంచి పాలస్తీనాకు అధికార గుర్తింపును ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయం పట్లు పాలస్తీనా వాసులు సంతోషం వ్యక్తం చేయగా, ఇజ్రాయెల్​ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే నార్వే, ఐర్లాండ్​లోని తమ రాయబారులను వెనక్కి రావాలని ఆదేశించింది.

పాలస్తీనా అధికారికంగా గుర్తించేందుకు గత కొన్ని వారాలుగా యూరోపియన్​ దేశాలు ప్రయత్నాలు చేపట్టాయి. రెండు రాష్ట్రాల విభజనకు అంగీకరించి ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని కోరుతున్నాయి. తాజాగా నార్వే నిర్ణయంతో అనేక ఇతర యూరోపియన్​ దేశాలు సైతం ఆ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. నార్వేకు ఈయూలో సభ్యత్వం లేకపోయినా రెండు రాష్ట్రాల ప్రతిపాదనకి బలమైన మద్దతును ఇస్తుంది.

రెండు రాష్ట్రాల ప్రతిపాదన కోసమే
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే గుర్తింపు తప్పనిసరని నార్వే ప్రధానమంత్రి జోనాస్​ ఘార్​ అన్నారు. అందుకోసమే ప్రత్యేక పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. మే 28 అధికారికంగా గుర్తించి, అరబ్​ శాంతి ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. పాలస్తీనా స్వతంత్రంగా ఉండడం దాని హక్కు అని, హమాస్​తో పాటు ఇజ్రాయెల్, రెండు రాష్ట్రాల ప్రతిపాదనను వ్యతిరేకించే వర్గాలు హింసను ప్రోత్సహించాయని చెప్పారు.

స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తూ ఐర్లాండ్​, స్పెయిన్​​ ప్రధానమంత్రులు కీలక ప్రకటన చేశారు. స్పెయిన్​, నార్వేల సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధానమంత్రి సైమన్​ హరీస్ తెలిపారు. ఇది పాలస్తీనాతో పాటు ఐర్లాండ్​కు చారిత్రక రోజుగా అభివర్ణించారు. ఇజ్రాయెల్​- పాలస్తీనా మధ్య యుద్ధానికి రెండు రాష్ట్రాల ప్రతిపాదనతో పరిష్కరించే ఉద్దేశంతోనే చేశామన్నారు. పశ్చిమాసియాతో పాటు ఇతర అనేక మంది నేతలతో తాను మాట్లాడానని, పాలస్తీనాలో శాంతిని నెలకొల్పే ఉద్దేశం ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతాన్యాహూకు లేదన్నారు. శాంతి, న్యాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పెయిన్​ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ తెలిపారు. ఈ నిర్ణయం కేవలం ఇజ్రాయెల్​ ప్రజలకు వ్యతిరేకంగా మాత్రమే తీసుకున్నామని చెప్పారు. పాలస్తీనాకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ నెల ఆరంభంలోనే అగ్రరాజ్యం అమెరికాకు తెలిపింది స్పెయిన్​.

రాయబారులను వెనక్కి రప్పించిన ఇజ్రాయెల్​
మరోవైపు పాలస్తీనాకు గుర్తింపును ఇస్తూ మూడు దేశాల తీసుకున్న నిర్ణయం పట్ల ఇజ్రాయెల్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐర్లాండ్, నార్వేలోని ఇజ్రాయెల్​ రాయబారులు వెంటనే వెనక్కి రావాలని విదేశాంగ మంత్రి కాట్జ్​ ఆదేశించారు. గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్​ పౌరులను తిరిగి ఇచ్చే ప్రయత్నాలకు ఈ గుర్తింపు అడ్డుకుంటుందని చెప్పారు. కాల్పుల విరమణకు ఆటంకం కలిగించి, యుద్ధ తీవ్రతను పెంచుతుందని తెలిపారు.

7 నెలల కాల్పుల విరమణకు హమాస్​ ఓకే- రఫాపై దాడి ప్రకటన వెంటనే అంగీకారం - israel hamas ceasefire

'నెతన్యాహు, హమాస్ నేతలపై అరెస్ట్ వారెంట్'- ఐసీసీని కోరిన ప్రాసిక్యూటర్ - Israel Hamas War

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.