ETV Bharat / international

అధ్యక్ష రేసులో ట్రంప్​ జోరు- రెండు ప్రైమరీ ఎన్నికల్లో విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 8:53 AM IST

Updated : Feb 9, 2024, 10:06 AM IST

Republican Primary Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వరుస విజయాలు సాధిస్తున్నారు. గురువారం వర్జిన్​ ఐలాండ్స్​లో జరిగిన ఎన్నికలో ట్రంప్​ 73శాతం ఓట్లు సాధించి భారీ మెజారిటీతో గెలుపొందారు. నెవాడలోనూ ఏకగ్రీవంగా విజయం సాధించారు.

republican primary polls
republican primary polls

Republican Primary Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్​ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో గెలిచిన ఆయన, తాజాగా వర్జిన్ ఐలాండ్స్​, నెవాడ ప్రైమరీ ఎలక్షన్​లోనూ ఘన విజయం సాధించారు. గురువారం వర్జిన్​ ఐలాండ్స్​లో జరిగిన ఎన్నికలో ట్రంప్​ 73శాతం ఓట్లు సాధించి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి నిక్కి హేలీకి కేవలం 26శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నెవాడాలో ఏకగ్రీవంగా గెలిచారు.

ఎన్నికల ఫలితాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్​ హర్షం వ్యక్తం చేశారు. "మీ అందరికి నా ధన్యవాదాలు. మేము ఘన విజయం సాధించాం. వాస్తవానికి మేం గెలుస్తామని ముందే ఊహించాం. కానీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తామని మాత్రం అనుకోలేదు. మీరు అందించిన ఈ విజయాన్ని ఎప్పుడూ మరిచిపోను." అని తెలిపారు. అయితే, గురువారం జరిగిన వర్జినియా ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించలేదు. అనుమతించిన దానికంటే ముందుగానే పోటీని నిర్వహించారు.

నెవాడ ప్రైమరీ ఎన్నికల్లో ఏకగ్రీవం
నెవాడా ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. అభ్యర్థిత్వ బరిలో ఉన్న నిక్కి హేలీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఆయన ఏకగ్రీవంగా గెలిచారు. ఎన్నికల్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల బహిష్కరించినట్లు హేలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయంతో ట్రంప్​నకు 26 డెలిగెట్స్​ లభించాయి. అధికారికంగా పార్టీ తరఫున నామినేషన్ దక్కించుకునేందుకు ఆయనకు 1,215 డెలిగెట్స్​ అవసరం అవుతాయి.

అయోవా, న్యూ హ్యాంప్​షైర్​లో గెలుపు
అంతకుముందు అయోవా, న్యూ హ్యాంప్​షైర్​ రాష్ట్ర ప్రైమరీలో విజేతగా నిలిచారు డొనాల్డ్ ట్రంప్​. తొలుత ఈ పోటీలో నిక్కి హేలి, క్రిస్​ క్రిస్టీ, పెర్రీ జాన్సన్​, వివేక్​ రామస్వామి ఇలా 14 మంది నిలిచారు. కాగా ప్రస్తుతం ట్రంప్‌, నిక్కి హేలి మాత్రమే పోటీలో ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవా కాకసస్‌తో ఈ ప్రక్రియ మొదలైంది. అక్కడి నుంచి పలు రాష్ట్రాల్లో ఈ పోలింగ్‌ నిర్వహించి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకొంటున్నారు. మరోవైపు ఇటీవలె ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్‌ రాష్ట్రాలు ట్రంప్‌ను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో అధ్యక్ష పదవి చేపట్టిన ఆయన, 2020లో డెమోక్రటిక్‌ నేత జో బైడెన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.

ట్రంప్ వరుస విజయాలు- రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్!

రిపబ్లికన్ అభ్యర్థిత్వం రేసులో ట్రంప్ జోరు- ఎన్నికల్లో తొలి విజయం

Last Updated : Feb 9, 2024, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.